Your RTO details
RTO name
Code
City
Address
Pincode
Contact No.
  • City & RTO
  • Car Brand
  • Car Model
  • Car Fuel Type
  • Car Variant
  • Registration Year
కేవలం ₹2,094/ సంవత్సరానికి మాత్రమే కారు బీమాను పొందండి#
కార్ ఇన్సూరెన్స్‌లో 85%* వరకు సరిపోల్చండి మరియు ఆదా చేసుకోండి;
  • 2 నిమిషాల్లో పాలసీని రెన్యువల్ చేసుకోండి*

  • 21 కోట్లు +

  • 1.2 కోట్లు +

ప్రాసెసింగ్
    Other models
    Other variants
    Select your variant
    View all variants
      Secure
      We don’t spam
      ధరను వీక్షించండి
      Please wait..
      By clicking on “ధరను వీక్షించండి”, you agree to our Privacy Policy & Terms of Use
      Get Updates on WhatsApp
      Select Make
      Select Model
      Fuel Type
      Select variant
      Registration year
      Registration month
      Save & update
      Please wait..
      Search with another car number?

      We have found best plans for you!! Our advisor will get in touch with you soon.

      ఇండియా లోఉత్తమ మైన కార్ ఇన్సూరెన్సు సంస్థలు

      ఇండియా లో గల అందరు కారు /వాహన యజమాను లకూ మోటార్ ఇన్సూరెన్సు పొందడం చాలా అవసరం. మోటార్ వెహికల్ ఆక్ట్, 1988 ప్రకారం థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్సు ను తప్పక పొంది ఉండాలి. కానీ, వాహనానికి ఒక సమగ్రమైన ఇన్సూరెన్సు కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్సు ప్లాన్ మీ వల్ల థర్డ్ పార్టీ (డ్రైవర్/వాహనం/ఆస్తి) నష్టపోవడం/దెబ్బతినడం జరిగినా లేదా సహజం/మనిషి-చేసిన విపత్తుల నుండి కాపాడటానికి సహాయపడుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది, ప్రతీ ఇన్సూరెన్సు కంపెనీ ప్రాధమిక ప్లాన్ తో సహా సమర్ధవంత మైన కవరేజీ చేసుకొనేందుకు ఆడ్-ఆన్ ప్లాన్ లు కూడా అందిస్తున్నారు.

      Read more

      ఇండియా లో కారు ఇన్సూరెన్సు పాలసీ ల రకాలు

      ఇండియా లో, కారు యజమానులు రెండు రకాలైన కార్ ఇన్సూరెన్సు పాలసీ లు కొనుగోలు చేయవచ్చు. అవి:

      సమగ్ర కారు ఇన్సూరెన్సు

      సమగ్ర కార్ఇన్సూరెన్సు పాలసీ భీమా చేయ బడ్డ కారు కు సంపూర్ణమైన రక్షణ ని కల్పిస్తుంది. కారు కు అనుకోకుండా అగ్ని ప్రమాదం, ఆక్సిడెంట్ లు, దొంగతనం, విద్వంసాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు మనిషుల వల్ల జరిగే విపత్తులు వంటి సంఘటనలు జరిగే సమయం లో కాపాడు కోవడానికి ఉపయోగపడుతుంది. పాలసీ దారుడు చట్టబద్దం గా థర్డ్ పార్టీ కి చెల్లించాల్సిన ఆక్సిడెంట్ లయబిలిటీ ను కూడా కవర్ చేస్తుంది. అంతే కాకుండా, వ్యక్తి గత ప్రమాద భీమా కవరేజీ భీమా చేయబడ్డ కారు డ్రైవ్ చేసే యజమానికి లభిస్తుంది.

      థర్డ్ పార్టీ లయబిలిటీ కార్ ఇన్సూరెన్సు

      ఒక థర్డ్ పార్టీ లయబిలిటీ కార్ ఇన్సూరెన్సు, పాలసీ దారుడు ఆక్సిడెంట్ వలన కలిగిన గాయాలు, మరణం లేదా ఆస్తి నష్టం వల్ల థర్డ్ పార్టీ కు చెల్లించవలసిన నష్ట పరిహారం నుండి కవరేజీ ని ఇస్తుంది. ఈ రకమైన ఇన్సూరెన్సు వల్ల భీమా చేయబడ్డ కార్ కు గానీ దాని డ్రైవర్ కు గానీ ఏ విధమైన నష్టం లేదా నాశనం జరిగినప్పుడు కవరేజీ కలిగి ఉండదు.

      ఇండియా లో ఉత్తమ మైన కార్ ఇన్సూరెన్సు కంపెనీల ఇంకార్డ్ రేషియో & నెట్ వర్క్ గ్యారేజీలు

      ఇండియా లో గల పెద్ద కార్ ఇన్సూరెన్సు కంపెనీల ఇంకార్డ్ రేషియో (ఐ సి ఆర్) మరియు

      క్యాష్ లెస్ రిపేర్ చేయించుకోవడానికి వీలుగా అవి కలిగి ఉన్న నెట్ వర్క్ గారేజ్ ల సంఖ్య పరిశీలన కోసం క్రింద ఇవ్వబడింది:

      కార్ ఇన్సూరెన్సు కంపెనీలు

      క్యాష్ లెస్ గ్యారేజీలు

      ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో (2018-19)

      బజాజ్ అలియాన్స్ కార్ ఇన్సూరెన్సు

      4000+

      62%

      భారతి ఏ ఎక్స్ ఏ కార్ ఇన్సూరెన్సు

      5200+

      75%

      చోళ ఎం ఎస్ కార్ ఇన్సూరెన్సు

      6900+

      84%

      డిజిట్ కార్ ఇన్సూరెన్సు

      1400+

      76%

      ఈడెల్వెయిస్ కార్ ఇన్సూరెన్సు

      1000+

      145%

      ఫ్యూచర్ జెనెరలి కార్ ఇన్సూరెన్సు

      2500+

      69%

      హెచ్ డి ఎఫ్ సి ఎర్గో కార్ ఇన్సూరెన్సు

      6800+

      82%

      ఇఫ్కో టోకియో కార్ ఇన్సూరెన్సు

      4300+

      87%

      కోటక్ మహీంద్రా కార్ ఇన్సూరెన్సు

      1000+

      74%

      లిబర్టీ కార్ ఇన్సూరెన్సు

      4300+

      70%

      నేషనల్ కార్ ఇన్సూరెన్సు

      ఎన్ ఏ

      127.5%

      న్యూ ఇండియా అసురన్సు కార్ ఇన్సూరెన్సు

      1100+

      87.54%

      ఓరియంటల్ కార్ ఇన్సూరెన్సు

      ఎన్ ఏ

      112.62%

      రహేజా క్యూబ్ కార్ ఇన్సూరెన్సు

      1000+

      102%

      రిలయన్స్ కార్ ఇన్సూరెన్సు

      3700+

      85%

      రాయల్ సుందరం కార్ ఇన్సూరెన్సు

      4600+

      89%

      ఎస్ బి ఐ కార్ ఇన్సూరెన్సు

      5400+

      87%

      శ్రీరామ్ కార్ ఇన్సూరెన్సు

      1500+

      69%

      టాటా ఏ ఐ జి కార్ ఇన్సూరెన్సు

      ఎన్ ఏ

      70%

      యునైటెడ్ ఇండియా కార్ ఇన్సూరెన్సు

      700+

      120.79

      యూనివర్సల్ సోంపో కార్ ఇన్సూరెన్సు

      ఎన్ ఏ

      88%

      విశేష సూచన:*పాలసీ బజార్ ఏ ఒక్క ఇన్సూరెన్సు సంస్థను లేదా ఆ ఇన్సూరెన్సు సంస్థ అందించే ఉత్పత్తి ని గానీ గానీ ప్రోత్సహించడం, రేటింగ్ ఇవ్వడం లేదా సిఫార్సు చేయడం గానీ చేయదు. ఐ సి ఆర్ వివరాలు ఐ ఆర్ డి ఏ 2018-19 వార్షిక నివేదిక నుండి పొందడం జరిగింది.

      ఇండియా లోని ఉత్తమ కారు ఇన్సూరెన్సు కంపెనీలపై ఒక అవలోకనం

      మీ కారు సురక్షితం గా ఉంచుకొనేందు కు పెద్ద కార్ ఇన్సూరెన్సు కంపెనీలను ఎంచుకోవడానికి వీలుగా క్లుప్తం గా ఇవ్వబడిన వివరాలు:

      బజాజ్ అలియాన్స్ కార్ ఇన్సూరెన్సు

      2020 లో మనీ టుడే వారిచే బెస్ట్ మోటార్ ఇన్సూరెన్సు అవార్డు పొందిన బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి అనేది ప్రముఖ కార్ ఇన్సూరెన్సు కంపెనీల లో ఒకటి. ఇది అందించే సమగ్ర మైన కార్ ఇన్సూరెన్సు పాలసీ ల తో పాటూ లయబిలిటీ-ఓన్లీ పాలసీ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ లు అన్నీ సరసమైన ధరల్లో లభిస్తూ కావలసిన విధం గా మార్చుకోవడానికి వీలు గా దూరం లేదా రోజులు ఆధారం గా ఏర్పడి ఉంటాయి.

      బజాజ్ అలియాన్స్ కార్ ఇన్సూరెన్సు థర్డ్-పార్టీ లిబిలిటీస్ కు కవరేజీ ను కల్పిస్తూ మీ కార్ కు సహజం గా /వ్యక్తుల వలన విపత్తు వాటిల్లినా లేదా దొంగతనం వలన నష్టం లేదా దెబ్బతిన్నా కవరేజీ ను కల్పిస్తుంది. దీనితో పాటు పర్సనల్ ఆక్సిడెంట్ (పి ఏ) కవరేజీ రూ. 15 లక్షల వరకూ డ్రైవ్ చేస్తున్న యజమానికి కలిగి ఉంటుంది. మీరు ఇంకా సి ఎన్ జి కిట్ కవరేజీ, ఎన్ సి బి డిస్కౌంట్, ఆక్సిస్సోరీలు కవర్ మరియు తోటి-ప్రయాణికునికి/పైడ్ డ్రైవర్ కు పి ఏ కవరేజీ లు లాంటి కూడా ఎంచుకోవచ్చు.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · ఆన్లైన్ పాలసీ ఇన్సూరెన్సు మరియు రెన్యువల్

      · జీరో డిప్రిషియేషన్ కవర్ లభ్యమవుతుంది

      · 24X7 స్పాట్ అసిస్టెన్స్ లభ్యం

      · సెల్ఫ్-వెహికల్ సర్వే మరియు తక్షణ క్లెయిమ్ పరిష్కారం మరియు మోటార్-ఆన్-ది-స్పాట్ సదుపాయం

      · స్వచ్చంద అదనపు డిస్కౌంట్

      · ఏంటి-థెఫ్ట్ పరికరం అమరిక వలన తగ్గింపు

      · అనుమతించిన ఆటోమొబైల్ అసోసియేషన్ మెంబెర్ షిప్ డిస్కౌంట్ లు

      · డిప్రిషియేషన్ షీల్డ్

      · కీ & లాక్ బదిలీ చేయబడం

      · ఇంజిన్ ప్రొటెక్టర్

      · వ్యక్తిగత బాగేజ్

      · కన్వేయన్సు బెనిఫిట్

      · కన్సూమబుల్ ఎక్స్ పెన్సెస్


      భారతి ఏ ఎక్స్ ఏ కార్ ఇన్సూరెన్సు

      భారతి ఏ ఎక్స్ ఏ జనరల్ ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి. ఇండియా లో ఒక ప్రసిద్ధి చెందిన కార్ ఇన్సూరెన్సు కంపెనీ. ఇది మీ కార్ ను దొంగతనం, ఆక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాలవలన మరియు మానవ-నిర్మిత వైపరీత్యాల వలన కలిగే డామేజ్/లాస్ లను కవర్ చేస్తుంది. అంతే కాక, థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు వ్యక్తిగత ఆక్సిడెంటల్ కవర్ రూ. 15 లక్షల వరకూ డ్రైవ్ చేస్తున్న యజమానికి కలుగ జేస్తుంది.

      భారతి ఏ ఎక్స్ ఏ కార్ ఇన్సూరెన్సు మూడు రకాలైన కార్ ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తుంది -

      • సమగ్రకార్ ఇన్సూరెన్సు
      • థర్డ్-పార్టీలయబిలిటీ ప్లాన్
      • స్టాండ్అలోన్ డామేజ్ ప్లాన్

      భారతి ఏ ఎక్స్ ఏ కార్ ఇన్సూరెన్సు తాను దేశం లో అతి పెద్ద క్యాష్ లెస్ గారేజ్ నెట్ వర్క్ లను కలిగి ఉన్న దని చెబుతోంది. ఇది మీకు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా చట్టబద్దం గా క్లీనర్లు/డ్రైవర్ లకు చెల్లించాల్సిన లేదా కోల్పోయిన లేదా దెబ్బతిన్న ఆక్సిస్సోరీస్ లకు కవరేజీ ని కల్పించుకోవచ్చు.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · ఆన్లైన్ లో త్వర గా కొనుగోలు చేసుకోవచ్చు

      · 24X7 క్లెయిమ్ సహాయం

      · నెట్ వర్క్ గ్యారేజీలలో క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్

      · డిప్రిసియేషన్ కవర్

      · కన్సూమబుల్ కవర్

      · రోడ్ సైడ్ సహాయం

      · తాళం బదిలీ కవర్

      · ఇంజిన్ & గేర్ బాక్స్ కవర్

      · తోటి-ప్రయాణికునికి పర్సనల్ ఆక్సిడెంట్ కవర్

      · అంబులెన్సు చార్జీలు

      · ఇన్వాయిస్ ప్రైస్ కవర్

      · హాస్పిటల్ క్యాష్

      · మెడికల్ ఖర్చులు


      చోళమండలం కార్ ఇన్సూరెన్సు

      చోళ ఎం ఎస్ జనరల్ ఇన్సూరెన్సు కో.ఎల్ టి డి. దేశం లో ఒక ప్రసిద్ధి చెందిన కార్ ఇన్సూరెన్సు కంపెనీ. ఈ ఇస్యూరెన్సు పాలసీ థర్డ్-పార్టీ పర్సనల్ లయబిలిటీ మరియు థర్డ్-పార్టీ ప్రాపర్టీ డామేజ్ లనుండి కాపాడుతుంది. ఇది ప్రకృతి/మానవ సంబంధ వైపరీత్యాల నుండి, దొంగతనం నుండి కవరేజీ ని ఇస్తూ డ్రైవర్-యజమాని కి రూ. 15 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ ను అందిస్తుంది. ఇండియా లో ఈ కార్ ఇన్సూరెన్సు కంపెనీ మూడు రకాలైన ప్లాన్ లను అందిస్తుంది -

      • థర్డ్పార్టీ కార్ ఇన్సూరెన్సు
      • జీరోడిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్సు
      • సమగ్రకార్ ఇన్సూరెన్సు

      చోళ ఎం ఎస్ కార్ ఇన్సూరెన్సు ఇండియా లో అతి పెద్ద క్యాష్ లెస్ కార్ గ్యారేజీ ల నెట్ వర్క్ ను కలిగి ఉంది. అది రూ. 3 ,000 వరకూ తీసుకు వెళ్లడాన్ని అయ్యే ఖర్చులను కూడా రీ రీ ఇంబర్స్ చేస్తుంది. ప్రయాణికులకు రూ 2 లక్షల వరకూ పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ ను ఎంచుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్

      · 24x7 సహాయం

      · ఆన్లైన్ పాలసీ రెన్యువల్

      · వింటేజ్ కార్ డిస్కౌంట్

      · గుర్తింపు పొందిన ఆటోమొబైల్ అసోసియేషన్ మెంబర్షిప్ లో డిస్కౌంట్

      · ఏంటి-థెఫ్ట్ పరికరం అమర్చుకొనే చార్జీలలో డిస్కౌంట్

      · ప్రత్యేకం గా రూపొందిన/మార్పు చేయబడిన వాహనానికి డిస్కౌంట్

      · స్వచ్చంద తగ్గింపుల డిస్కౌంట్

      · ఆన్-సైట్ మైనర్ రిపేర్

      · ఎంచుకున్న వర్కుషాప్ లో రిపేర్ డిస్కౌంట్

      · వీవర్ అఫ్ డిప్రిసియేషన్

      · రోడ్ సైడ్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్

      · తాళాలు బదిలీ

      · ఫిక్స్డ్ డైలీ అలవెన్సు

      · పర్సనల్ బెలొంగింగ్ కవర్

      · రేయిం స్టేట్మెంట్ వేల్యూ

      · కన్వేయన్సు అలవెన్సు

      · మంత్లీ ఇన్స్టాల్మెంట్ కవర్

      · నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్

      · డీసెబుల్డ్ వెహికల్ కవరేజ్

      · ఇన్సూరెన్సు కాస్ట్ కవర్

      · రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లాస్ట్ కవర్

      · కన్సూమబుల్స్ కవర్

      · ఫ్రాంచైజ్ బెనిఫిట్

      · ఆటో ఎక్స్టెన్షన్ అఫ్ పాలసీ

      · లైసెన్స్ లాస్ కవర్

      · లాస్ అఫ్ కీ కవర్

      · ఇ ఎం ఐ కవర్

      · వెహికల్ రీప్లేస్మెంట్ అడ్వాంటేజ్ కవర్

      · చోళ వేల్యూ-యాడెడ్ సర్వీసెస్

      డిజిట్ కార్ ఇన్సూరెన్సు

      భీమా చేయబడిన కారు సమగ్ర రక్షణకోసం కవరేజీని అందించే డిజిట్ కార్ ఇన్సూరెన్సు దూసుకెళ్తున్న స్టార్ట్-అప్ ఇన్సూరెన్సు కంపెనీల లో ఒకటి. ఇది కార్ ఆక్సిడెంట్ వలన, అగ్ని ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు థర్డ్-పార్టీ లాస్ వంటి నష్టాలు/దెబ్బతినడం వాటి నుండి కవర్ చేస్తుంది. ఇది డ్రైవ్ చేస్తున్న కారు యజమాని కి పర్సనల్ ఆక్సిడెంట్ కవరేజీ ని కూడా అందజేస్తుంది. డిజిట్ కార్ ఇన్సూరెన్సు రెండు రకాలైన కార్ ఇన్సూరెన్సు ప్లాన్ లను ఎంచుకోవడానికి అందిస్తుంది.-

      • థర్డ్పార్టీ కార్ ఇన్సూరెన్సు
      • సమగ్రకార్ ఇన్సూరెన్సు కవర్

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · ఆన్లైన్ లో సులువుగా లభ్యమయ్యే ఇన్సూరెన్సు

      · నో క్లెయిమ్ బోనస్

      · 24x7 సహాయం

      · రిపేర్ కోసం ఇంటి వద్దనుండి పిక్-అప్ చేసుకోవడం

      · క్యాష్ లెస్ రేపైర్స్

      · స్మార్ట్ ఫోన్ సహాయం తో స్వీయ-తనిఖీ

      · సత్వర క్లెయిమ్ పరిష్కార

      · జీరో డిప్రిసియేషన్ కవర్

      · బ్రేక్ డౌన్ సహాయం

      · పాసెంజర్ కవర్

      · కన్సూమబుల్ కవర్

      · రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్

      · టైర్ ప్రొటెక్ట్ కవర్

      · ఇంజిన్ అండ్ గేర్-బాక్స్ ప్రోలెక్షన్ కవర్


      ఈడెల్వెయిస్ కార్ ఇన్సూరెన్సు

      ఈడెల్వెయిస్ కార్ ఇన్సూరెన్సు, మోటార్ ఇన్సూరెన్సు సొల్యూషన్స్ అందించే మరొక ప్రయివేటు ఇన్సూరెన్సు సంస్థ. ఇది థర్డ్ పార్టీ లయబిలిటీ ల తో పాటూ మీ కార్ కు లాస్/దెబ్బ తినడం వలన కవరేజీ ను అందిస్తుంది. అంతేకాక, ఇది కార్ డ్రైవ్ చేసే యజమాని కొరకు రూ. 15 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ ని కూడా అందిస్తుంది. ఈడెల్వెయిస్ కార్ ఇన్సూరెన్సు రెండు రకాల ప్లాన్ లను అందిస్తుంది -

      • ప్రైవేట్కార్ ప్యాకేజీ ఇన్సూరెన్సు
      • ప్రైవేట్కార్ లయబిలిటీ ఓన్లీ ఇన్సూరెన్సు

      ఈడెల్వెయిస్ కార్ ఇన్సూరెన్సు ప్రయాణికులకు పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, పైడ్ డ్రైవర్ కొరకు లీగల్ లయబిలిటీ కవర్ వంటి అదనపు కవరేజీ ను పొందేటందుకు అవకాశం ఇస్తుంది.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి)

      · క్యాష్ లెస్ గారేజ్ లలో ప్రాధాన్యత సేవలు

      · సత్వర క్లెయిమ్ పరిష్కారం

      · డిప్రిసియేషన్ ప్రొటెక్ట్

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · ఇంజిన్ ప్రొటెక్ట్

      · కన్సూమబుల్ ఎక్సపెన్సెస్ ప్రొటెక్ట్

      · మ్యాండటరీ డిడక్షన్ ప్రొటెక్ట్

      · ఇన్వాయిస్ వేల్యూ ప్రొటెక్ట్

      · ఎన్ సి బి ప్రొటెక్ట్

      · పర్సనల్ బెలొంగింగ్స్ ప్రొటెక్ట్

      · కీస్ అండ్ లాక్స్ ప్రొటెక్ట్


      ఫ్యూచర్ జెనెరలి కార్ ఇన్సూరెన్సు

      ఫ్యూచర్ జెనెరలి ఇండియా ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి. ఇండియా లో ప్రసిద్ధి చెందిన కార్ ఇన్సూరెన్సు కంపెనీ. ఇది సమగ్ర థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ మరియు కార్ డామేజ్ తో పాటు డ్రైవ్ చేసే కారు యజమాని కి రూ. 15 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ అందజేస్తుంది. మీరు పైడ్ డ్రైవర్, క్లీనర్ లేదా పాసెంజర్ ల కవరేజీ కోసం కోసం అదనపు లీగల్ లిబిలిటీస్ పొందటానికి అదనపు ప్రీమియం చెల్లించి కవరేజీ పొందవచ్చు.

      ఫ్యూచర్ జెనెరలి కార్ ఇన్సూరెన్సు ప్రయాణికులకు కూడా రూ.2 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ అందించడానికి తోడ్పడుతుంది.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి)

      · క్యాష్ లెస్ గారేజ్ లలో ప్రాధాన్యత సేవలు

      · సత్వర క్లెయిమ్ పరిష్కారం

      · డిప్రిసియేషన్ ప్రొటెక్ట్

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · ఇంజిన్ ప్రొటెక్ట్

      · కన్సూమబుల్ ఎక్సపెన్సెస్ ప్రొటెక్ట్

      · మ్యాండటరీ డిడక్షన్ ప్రొటెక్ట్

      · ఇన్వాయిస్ వేల్యూ ప్రొటెక్ట్

      · ఎన్ సి బి ప్రొటెక్ట్

      · పర్సనల్ బెలొంగింగ్స్ ప్రొటెక్ట్

      · కీస్ అండ్ లాక్స్ ప్రొటెక్ట్


      హెచ్ డి ఎఫ్ సి ఎర్గో కార్ ఇన్సూరెన్సు

      హెచ్ డి ఎఫ్ సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి., ఇండియా లో కెల్లా ఉత్తమ-నోచ్ కార్ ఇన్సూరెన్సు కంపెనీల లో ఒకటి. ఈ కార్ ఇన్సూరెన్సు పాలసీ థర్డ్ -పార్టీ లయబిలిటీ దొంగతనం, ఆక్సిడెంట్లు, అగ్ని & విస్ఫోటాలు, ప్రకృతి వైపరీత్యాలవలన కలిగే డామేజ్/లాస్ లను కవర్ చేస్తుంది. అంతే కాక మరియు వ్యక్తిగత ఆక్సిడెంటల్ కవర్ రూ. 15 లక్షల వరకూ డ్రైవ్ చేస్తున్న యజమానికి కలుగ జేస్తుంది. ఇది మూడు రకాలైన ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తుంది.

      • థర్డ్-పార్టీలయబిలిటీ ప్లాన్
      • సమగ్రకార్ ఇన్సూరెన్సు ప్లాన్
      • స్టాండ్అలోన్ కార్ ఇన్సూరెన్సు ప్లాన్

      హెచ్ డి ఎఫ్ సి ఎర్గో కార్ ఇన్సూరెన్సు అతి పెద్ద గ్యారేజీ నెట్ వర్క్ కలిగి ఉంది. ఈ మోటార్ పాలసీ తో టొవింగ్ ఖర్చులు కూడా రూ. 1500 వరకూ రీయింబర్సు చేసుకోవచ్చు.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి)

      · క్యాష్ లెస్ గారేజ్ లలో ప్రాధాన్యత సేవలు

      · అర్ధ రాత్రి కార్ రిపేర్ సర్వీసెస్

      · 30 నిమషాల్లో క్లెయిమ్ ఆమోదం

      · అపరిమిత క్లెయిమ్ సదుపాయం

      · జీరో డిప్రెషషన్ కవర్

      · నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్

      · ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్

      · రిటర్న్ టు ఇన్వాయిస్

      · కీ రీప్లేస్మెంట్ కవర్

      · ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్టర్

      · లాస్ అఫ్ యూస్ - డౌన్ టైం ప్రొటెక్షన్

      · కాస్ట్ అఫ్ కన్సూమబుల్ ఐటమ్స్


      ఇఫ్కో టోకియో ఇన్సూరెన్సు

      ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్సు కో.ఎల్ టి డి. దేశం లో భీమా చేయబడిన కారు కు మంచి భద్రత ను కలిగించే ఒక ప్రసిద్ధి చెందిన కార్ ఇన్సూరెన్సు సంస్థ. ఇది ప్రకృతి వైపరీత్యాల వలన, మనుషుల వలన కలిగే వైపరీత్యాలు మరియు థర్డ్-పార్టీ లీగల్ లయబిలిటీ ల వంటి కోల్పోవడం/నాశనం కావడం నుండి కవరేజీ ను కలిగిస్తుంది. ఇది డ్రైవ్ చేసే కార్ యజమానికి కూడా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ అందజేస్తూ కొంత అదనపు ప్రీమియం సొమ్ము తో దానిని మిగిలిన ప్రయాణికులకు వర్తింపచేయడానికి సహాయపడుతుంది.

      ఇఫ్కో టోకియో కార్ ఇన్సూరెన్సు రెండు రకాలైన ప్లాన్ లను కలిగి ఉంది -

      • సమగ్రకార్ ఇన్సూరెన్సు
      • థర్డ్-పార్టీకార్ ఇన్సూరెన్సు

      మీరు ఇంకా సి ఎం జి/ ఎల్ పి జి ఫ్యూయల్ కిట్ కవర్ మరియు అదనపు ప్రీమియం చెల్లింపు పై ఆక్సిస్సోరీస్ పై కవరేజీ ని పొందవచ్చు.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · నో క్లెయిమ్ బోనస్

      · నెట్ వర్క్ హాస్పిటల్ లో క్యాష్ లెస్ క్లెయిమ్స్

      · జీరో డిప్రిసియేషన్ కవర్

      · ఇంజిన్ ప్రొటెక్షన్

      · నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · రిటర్న్ టు ఇన్వాయిస్


      కోటక్ మహీంద్రా కార్ ఇన్సూరెన్సు

      కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి. ఇండియా లో గల ప్రఖ్యాతి గాంచిన ఇన్సూరెన్సు కంపెనీల లో ఒకటి. ఇది మీ కార్ కు అన్నివిధాలా సమగ్ర మైన ప్రైవేట్ కార్ ఇన్సూరెన్సు ప్లాన్ ను అందిస్తుంది. ఇది ప్రకృతి లేదా మన సంబంధ వైపరీత్యాలనుండి, థర్డ్-పార్టీ లయబిలిటీ నుండీ, బై-ఫ్యూయల్ సిస్టం మరియు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ విడి భాగాలు పై లాస్ లేదా డామేజ్ కవరేజీ ని అందిస్తుంది.

      ముఖ్య అంశాలు

      యాడ్-ఆన్ కవర్స్

      · నెట్ వర్క్ గ్యారేజీ లలో క్యాష్ లెస్ సేవలు

      · నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం

      · గుర్తింపు పొందిన ఏ ఏ ఐ మెంబర్షిప్ డిస్కౌంట్

      · స్వచ్చంద తగ్గించబడే డిస్కౌంట్

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · కన్సూమబుల్ కవర్

      · డిప్రిసియేషన్ కవర్

      · ఇంజిన్ ప్రొటెక్ట్

      · టైర్ కవర్

      · రిటర్న్ టు ఇన్వాయిస్

      · డైలీ కార్ అలవెన్సు

      · లాస్ అఫ్ పర్సనల్ బెలొంగింగ్స్

      · ఎన్ సి బి ప్రొటెక్ట్

      · కీ రీప్లేస్మెంట్


      లిబర్టీ కార్ ఇన్సూరెన్సు

      లిబర్టీ కార్ ఇన్సూరెన్సు మీరు కార్ ఇన్సూరెన్సు కొనుగోలు కోసం ఎంచుకొనేందు కు పనికి వచ్చే మరొక మోటార్ ఇన్సూరెన్సు కంపెనీ. ఇది భీమా చేయబడిన కారు కు ఆక్సిడెంట్ కవర్, థర్డ్ పార్టీ కవర్, దొంగతనం, సహజం గా/మానవ జనిత విపత్తులు లకు ఓన్ డామేజ్ కవర్ మరియు పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ అందజేస్తుంది. ఇది రెండు రకాల కార్ ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తుంది -

      • ప్యాకేజీపాలసీ
      • లయబిలిటీఓన్లీ పాలసీ

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · ప్రస్తుత భీమా సంస్థ నుండి నో క్లెయిమ్ బోనస్ బదిలీ

      · నెట్ వర్క్ గారేజ్ ల ద్వారా క్యాష్ లెస్ క్లెయిమ్ సేవలు

      · టెలిఫోన్ ద్వారా సహాయం

      · 7 రోజులలో క్లెయిమ్ పరిష్కరిరం

      · రెన్యువల్ డిస్కౌంట్స్

      · డిప్రిసియేషన్ కవర్

      · గ్యాప్ వేల్యూ కవర్

      · కన్స్యూమబుల్ కవర్

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్

      · కీ లాస్ కవర్

      · పాసెంజర్ అసిస్టెన్స్ కవర్

      · ఇంజిన్ సేఫ్ కవర్


      నేషనల్ కార్ ఇన్సూరెన్సు

      నేషనల్ కార్ ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి. ఇండియా లో ఒక ప్రముఖ ఇన్సూరెన్సు కంపెనీల లో ఒకటి. ఇది థర్డ్-పార్టీ లయబిలిటీస్ నుండి, పోగొట్టుకోవడం/దెబ్బ తినడం వల్ల, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం మరియు మానవ సంబంధ విపత్తుల నుండి రక్షణ ను ఇస్తుంది. ఇది టొవింగ్ చార్జీలు కూడా రూ. 1500 కవర్ చేస్తుంది. నేషనల్ కార్ ఇన్సూరెన్సు మీ కోసం రెండు రకాల కార్ ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తుంది-

      • ఏన్యువల్లయబిలిటీ -ఓన్లీ పాలసీ
      • ఏన్యువల్ప్యాకేజీ పాలసీ

      నేషనల్ కార్ ఇన్సూరెన్సు ఇండియా లో ఉన్న కార్ ఇన్సూరెన్సు కంపెనీల అన్నింటికంటే ఎక్కువ ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో ని కలిగి ఉంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · టొవింగ్ సహాయం

      · నో క్లెయిమ్ డిస్కౌంట్స్

      · త్వరగా రెన్యువల్ చేసుకోవడం

      · నిల్ డిప్రిసియేషన్

      · ఇన్వాయిస్ ప్రొటెక్ట్

      · నిల్ డిప్రిసియేషన్ ప్లస్

      · ఎన్ సి బి ప్రొటెక్ట్

      · ఇంజిన్ ప్రొటెక్ట్


      న్యూ ఇండియా అసురన్సు కార్ ఇన్సూరెన్సు

      న్యూ ఇండియా అసురన్సు కో. ఎల్ టి డి. ప్రపంచ వ్యాప్తం గా 28 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న ఒక ఉత్తమ మైన ఇన్సూరెన్సు కంపెనీ. ఇది కార్ ఇన్సూరెన్సు లో బాగా పేరు కలిగిన లయబిలిటీ -ఓన్లీ మరియు ప్యాకేజీ పాలసీ లను కలిగి ఉంది. ఇది పర్సనల్ ఆక్సిడెంట్ డ్రైవ్ చేసే కారు యజమాని కి అందించడం తో పాటూ, థర్డ్-పార్టీ లయబిలిటీ లు, దొంగతనం వల్ల, ప్రకృతి సిద్ధం గా లేదా మనవ సంబంధ విధ్వం వలన కలిగిననష్టం/ద్వంసం ను కూడా కవర్ చేస్తుంది.

      న్యూ ఇండియా అసురన్సు కార్ ఇన్సూరెన్సు రూ. 1500 వరకూ టొవింగ్ ఛార్జ్ లు కూడా కవర్ చేస్తుంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ డిస్కౌంట్స్

      · టొవింగ్ సహాయం

      · అనుమతి పొందిన గారేజ్ లలో క్యాష్ లెస్ క్లెయిమ్ లు

      · లాస్ అఫ్ ఆక్సిస్సోరీస్

      · ప్రయాణికులకు మరియు పైడ్ డ్రైవర్ లకు ఆక్సిడెంట్ కవర్

      · ఉద్యోగస్తులకు లీగల్ లయబిలిటీ


      ఓరియంటల్ కార్ ఇన్సూరెన్సు

      ఓరియంటల్ కార్ ఇన్సూరెన్సు మీ ప్రైవేట్ కార్ కుఒక సమగ్ర రక్షణ ను అందించే పబ్లిక్ ఇన్సూరెన్సు కంపెనీ. ఈ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్సు పాలసీ వాహన ఆక్సిడెంట్ డామేజ్ / లాస్ లకు, థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు దొంగతనం వలన, ప్రకృతి వైపరీత్యాల వలన, అగ్ని/విస్ఫోటనం వలన /పిడుగులు/సెల్ఫ్-ఇగ్నిషన్ వంటి నుండి కవరేజీ కోసం తయారు చేయబడింది. అంతే కాక, ఇది డ్రైవ్ చేస్తున్న కార్ యజమానికి కూడా పర్సనల్ ఆక్సిడెంట్ కవరేజీ ని అందిస్తుంది.

      వివిధ డిస్కౌంట్లు మరియు ఆడ్-ఆన్ లు అందించడమే కాకుండా, ఓరియంటల్ కార్ ఇన్సూరెన్సు మీకు సి ఎన్ జి /ఎల్ పి జి ఇంధన కవరేజీ మరియు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ పరికరాల కవరేజీ ని అదనపు ప్రీమియం ను చెల్లించడం ద్వారా కవరేజీ ని పొందడానికి అవకాశమిస్తుంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · ఏంటి-తెఫ్ట్ పరికరం పై డిస్కౌంట్

      · స్వచ్చంద తగ్గింపు ఇచ్చే డిస్కౌంట్

      · నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి)

      · ఆటోమొబైల్ అసోసియేషన్ మెంబెర్ షిప్ డిస్కౌంట్

      · ఆన్ లైన్ పాలసీ రెన్యువల్ సదుపాయం

      · నిల్ డిప్రిసియేషన్ కవర్

      · ఆల్టర్నేట్ కార్ బెనిఫిట్

      · లాస్ అఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్

      · టి వీ ఎస్ ద్వారా ఉచిత ఎమర్జెన్సీ సర్వీస్ బెనిఫిట్


      రహేజా క్యూబ్ కార్ ఇన్సూరెన్సు

      రహేజా క్యూబ్ కార్ ఇన్సూరెన్సు ఇండియా లో కార్ ఇన్సూరెన్సు పాలసీ లు అందించే ఒక నమ్మకమైన మోటార్ కార్ ఇన్సూరెన్సు కంపెనీ . ఇది మీ కార్ ఆక్సిడెంట్, ప్రకృతి వైపరీత్యాలు లేదా దొంగతనం తో పాటు థర్డ్ పార్టీ లయబిలిటీ లవంటి డామేజ్/లాస్ ల నుండి రక్షణను కల్పిస్తుంది. దీనితో పాటూ, డ్రైవ్ చేసే కారు యజమాని కి కూడా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ ను అందజేస్తుంది.

      రహేజా క్యూబ్ కార్ ఇన్సూరెన్సు నాలుగు రకాలైన కార్ ఇన్సూరెన్సు ప్లాన్ లు ఎంచుకోవడానికి వీలు గా అందజేస్తుంది-

      • ప్రైవేట్కార్ ప్యాకేజీ పాలసీ
      • లయబిలిటీఓన్లీ - ప్రైవేట్ కార్ పాలసీ
      • స్టాండ్అలోన్ ఓన్ డామేజ్ పాలసీ - ప్రైవేట్ కార్
      • ప్రైవేట్కార్ పాలసీ - బండెల్డ్

      మీరు ఎలక్ట్రికల్/నాన్-ఎలక్ట్రికల్ ఆక్సిస్సోరీస్ కూడా కవర్ చేసుకొనేందుకు, ప్రయాణీకుల పర్సనల్ ఆక్సిడెంట్ (పి ఏ) మరియు క్లీనర్/పైడ్ డ్రైవర్ ల లీగల్ లయబిలిటీ వంటి అదనపు కవర్ లు కూడా కొనుగోలు చేసుకోవచ్చును.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్

      · హయ్యర్ వాలంటరీ ఎక్సెస్ డిస్కౌంట్

      · ఆటోమొబైల్ అసోసియేషన్ మెంబర్షిప్ డిస్కౌంట్

      · అనుమతించబడిన ఏంటి-తెఫ్ట్ పరికరం పై తగ్గింపు

      · జీరో డిప్రిసియేషన్

      · కన్సూమబుల్ ఎక్సపెన్సెస్

      · ఇంజిన్ ప్రొటెక్టర్

      · కీ ప్రొటెక్ట్ కవర్

      · డైలీ కన్వేయన్సు బెనిఫిట్

      · రిటర్న్ తో ఇన్వాయిస్

      · లాస్ అఫ్ పర్సనల్ బి లొంగింగ్స్

      · ఎన్ సి బి రేటెన్షన్ కవర్

      · టైర్ అండ్ రిమ్ ప్రొటెక్టర్


      రిలయన్స్ కార్ ఇన్సూరెన్సు

      రిలయన్స్ జనరల్ కార్ ఇన్సూరెన్సు కో. ఎల్ టి డి. నాలుగు చక్రాల మోటారు వాహనాల సత్వర ఇన్సూరెన్సు పరిష్కారాలకు ఒక అంత్యంత ప్రసిద్ధి చెందిన ఇన్సూరెన్సు సంస్థ. ఇది మీ కార్ కు థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు లాస్ లేదా డామేజ్ ఢీ కొట్టడం వలన గానీ, మనుషుల వలన/ప్రకృతి కారకం లేదా దొంగతనం వలన కలిగే సమస్యల నుండి సమగ్ర రక్షణను కలిపిస్తుంది. ఇది డ్రైవ్ చేసే యజమానికి కూడా వ్యక్తి గత ఆక్సిడెంట్ కవర్ ను రూ. 15 లక్షల వరకూ అందిస్తుంది.

      రిలయన్స్ జనరల్ కార్ ఇన్సూరెన్సు రెండు రకాలైన ప్లాన్ లను అందిస్తుంది -

      • థర్డ్-పార్టీలయబిలిటీ కార్ ఇన్సూరెన్సు పాలసీ
      • సమగ్రకార్ ఇన్సూరెన్సు పాలసీ

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్

      · స్వచ్చందంగా తగ్గించబడే డిస్కౌంట్

      · ఆటోమ్పోబిల్ అసోసియేషన్ అఫ్ ఇండియా మెంబర్షిప్ డిస్కౌంట్

      · సెక్యూరిటీ పరికరం అమర్చుకొనేందుకు డిస్కౌంట్

      · పేపర్ వర్క్ లేకుండా వెంటనే రెన్యువల్

      · నిల్ డిప్రిసియేషన్

      · కన్సూమబుల్స్ కవర్

      · ఎన్ సి బి రిటెన్షన్ కవర్

      · ఇంజిన్ ప్రొటెక్టర్ కవర్

      · డైలీ అలవెన్సు బెనిఫిట్

      · కీ ప్రొటెక్ట్ కవర్

      · ఈ ఎం ఐ ప్రొటెక్షన్


      రాయల్ సుందరం కార్ ఇన్సూరెన్సు

      రాయల్ సుందరం కార్ ఇన్సూరెన్సు అనుకోని సంఘనల వలన పరిణామాలనుండి రక్షణ కల్పించడానికి హామీ ఇస్తుంది. ఇది అందించే కార్ షీల్డ్ పాలసీ ద్వారా డ్రైవ్ చేసే యజమాని పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, థర్డ్ పార్టీ ప్రాపర్టీ కోసం ఇండెమ్నిటి మరియు పరిమితి లేని థర్డ్-పార్టీ లయబిలిటీ లతో సమగ్ర కార్ ఇన్సూరెన్సు ను అందజేస్తుంది. అంతే కాక, లాస్ లేదా డామేజ్ ఆక్సిడెంట్ లు & ఉపరితల డామేజ్, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని & విస్ఫోటనం, దోపిడీ & దొంగతనాలు, ద్వేషపూరిత పనులు మరియు మనుషులు కలిగించే విపత్కర పరిస్థితులు ల నుండి కూడా డామేజ్ ప్రొటెక్షన్ ను కల్పిస్తుంది.

      రాయల్ సుందరం కార్ ఇన్సూరెన్సు అదనపు కవరేజీ ని పైడ్ డ్రైవర్ లకు మరియు పేరు తెలియని ప్రయాణికులకు పర్సనల్ ఆక్సిడెంట్, సి ఎన్ జి కిట్/బై-ఫ్యూయల్ సిస్టం కవర్, డ్రైవర్స్ & ఉద్యోగస్తులకు లీగల్ లయబిలిటీ మరియు ఎలక్ట్రికల్/ నాన్-ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కు కవరేజీ ని అందిస్తుంది.

      అంతే కాక, రాయల్ సుందరం కార్ ఇన్సూరెన్సు ఇండియా లో గల అన్ని ప్రైవేట్ కార్ ఇన్సూరెన్సు కంపెనీల కంటే ఎక్కువ ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో (ఐ సి ఆర్) ని కలిగి ఉంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · ఆటోమొబైల్ అసోసియేషన్ అఫ్ ఇండియా మెంబర్షిప్ డిస్కౌంట్

      · స్వచ్చందం గా తగ్గించ గలిగిన డిస్కౌంట్

      · ఫుల్ ఇన్వాయిస్ ప్రైస్ కవర్

      · నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) ప్రొటెక్టర్

      · టైర్ కవర్

      · కీ ప్రొటెక్టర్

      · డిప్రిసియేషన్ వీవర్ కవర్

      · లాస్ అఫ్ బాగేజ్ కవర్

      · విండ్ షీల్డ్ గ్లాస్ కవర్

      · స్పేర్ కార్ క్లాజ్

      · స్వచ్చందం గా తగ్గింపు కవర్

      · ఇంజిన్ (అగ్రివేషన్) ప్రొటెక్టర్ కవర్

      · లైఫ్ టైం రోడ్ టాక్స్ క్లాజ్


      ఎస్ బి ఐ కార్ ఇన్సూరెన్సు

      ఎస్ బి ఐ కార్ ఇన్సూరెన్సు ఒక ప్రఖ్యాతి గాంచిన మోటార్ ఇన్సూరెన్సు కంపెనీ మాత్రమే కాకమీ కారు కు సమగ్రమైన రక్షణ ను కల్పిస్తుంది. ఇది వాహనం ఆక్సిడెంట్ డామేజ్, డ్రైవ్ చేస్తున్న కారు యజమానికి రూ. 15 లక్షల కవరేజీ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ వంటి కవరేజీ లను అందిస్తుంది. భీమా చేయబడిన కారు ద్వ౦సం అయితే లేదా పోయినా, అగ్ని, ప్రకృతి వైపరీత్యాల వలన, సెల్ఫ్-ఇగ్నిషన్, విస్ఫోటనలు మరియు ఆక్సిడెంట్ లు వంటి ప్రమాదాలకు కవర్ చేస్తుంది.

      మీరు ఇంకా బై-ఫ్యూయల్ కిట్ కవర్, ఉద్యోగస్టులు & పైడ్ డ్రైవర్ కోసం లీగల్ లయబిలిటీ మరియు ప్రయాణికుల పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ కూడా ఎస్ బి ఐ మోటార్ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్సు పాలసీ నుండి ఎంచుకోవచ్చును.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్

      · స్వచ్చందం అదనపు డిస్కౌంట్

      · సత్వర క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ

      · రిటర్న్ టు ఇన్వాయిస్

      · ఇంజిన్ గార్డ్

      · డిప్రిసియేషన్ రీఇంబర్సుమెంట్

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · కీ రీప్లేస్మెంట్

      · కన్సూమబుల్స్ కవర్

      · లాస్ అఫ్ బెలొంగింగ్స్

      · ఎన్ సి బి ప్రొటెక్షన్

      · ఇన్ కన్వీనియన్స్ అలవెన్సు

      · హాస్పిటల్ డైలీ క్యాష్ కవర్

      · టైర్ అండ్ రిమ్ గార్డ్

      · ఈ ఎం ఐ ప్రొటెక్టర్


      శ్రీరామ్ కార్ ఇన్సూరెన్సు

      శ్రీరామ్ కార్ ఇన్సూరెన్సు మీ మోటార్ కారు ను రక్షణను ఇవ్వడం లో మంచి పేరున్న మోటార్ ఇన్సూరెన్సు కంపెనీ. ఈ కారు ఇన్సూరెన్సు పాలసీ థర్డ్ పార్టీ ప్రాపర్టీ డామేజ్, థర్డ్ పార్టీ లయబిలిటీ మరియు ప్రకృతి వైపరీత్యాలు, ఆక్సిడెంట్, దొంగతనం, హాని కరమైన పనులు, అగ్ని, మానవసంబంధ వైపరీత్యాలు మరియు విస్ఫోటనలు వంటి లాస్ లేదా డామేజ్ ను కవర్ చేస్తుంది.

      అంతేకాక, మీరు అదనం గా కోరుకొనే డ్రైవ్ చేస్తున్న వాహన యజమానికి రూ. 15 లక్షలు, బై-ఫ్యూయల్ సిస్టం, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు పైడ్ డ్రైవర్ & ప్రయాణికులకూ, కవరేజీ ని శ్రీరామ్ మీ కారు ఇన్సూరెన్సు పాలసీ తో పాటూ కు అందిస్తుంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · తక్షణమే పాలసీ ను ఇష్యూ చేయడం

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · క్యాష్ లెస్ రిపేర్

      · నో క్లెయిమ్ బోనస్

      · స్వచ్చందం గా లభించే డిస్కౌంట్

      · ఏంటి-తెఫ్ట్ పరికరం పై డిస్కౌంట్

      · ఆటోమొబైల్ అసోసియేషన్ డిస్కౌంట్

      · జీరో డిప్రిసియేషన్ కవర్

      · రిటర్న్ టు ఇన్వాయిస్

      · డైలీ రీ ఇంబర్సుమెంట్

      · పర్సనల్ బెలొంగింగ్స్ కవర్

      · కీ రీప్లేస్మెంట్

      · ఎన్ సి బి ప్రొటెక్షన్ కవర్

      · ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హోటల్ ఎక్సపెన్సెస్ రీ ఇంబర్సుమెంట్

      · మల్టీ-కార్ రిబేటు


      టాటా ఏ ఐ జి కార్ ఇన్సూరెన్సు

      టాటా ఏ ఐ జి కార్ ఇన్సూరెన్సు దేశం లో అత్యంత ప్రియమైన మోటార్ కంపెనీల లో ఒకటి. ఇది మీ కారు కు కావలసినవి అన్నీ ఇచ్చేందుకు హామీ ఇస్తుంది. దీని ఆటో సెక్యూర్-ప్రైవేట్ కార్ ప్యాకేజీ పాలసీ కార్ ను ఎక్స్టర్నల్ లాస్/దొంగతనం వలన డామేజ్, ప్రకృతి సిద్ధం గా లేదా మానవ సంబంధ వైపరీత్యాలు మొదలైన వాటినుండి మీ కార్ ను సంరక్షిస్తుంది. అంతే కాక ఇది థర్డ్-పార్టీ లయబిలిటీ లు మరియు డ్రైవింగ్ చేసే కార్ యజమాని కి రూ. 15 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ కూడా కలుగ జేస్తుంది.

      పాలసీ దారుడు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా పైడ్ డ్రైవర్ కు, కార్ క్లీనర్ మరియు ప్రయాణికులకు పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ మరియు ఎలక్ట్రిక్/ఎలక్ట్రానిక్ విభాగాలకు కూడా కవరేజీ లభిస్తుంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) ప్రొటెక్షన్ లభిస్తుంది

      · ఎమర్జెన్సీ రోడ్ సైడ్ సహాయం

      · గుర్తింపు పొందిన ఆటోమొబైల్ అసోసియేషన్ మెంబర్షిప్ లో డిస్కౌంట్

      · ఏంటి-తెఫ్ట్ పరికరం అమరికలో తగ్గింపు

      · మార్పు చేయబడిన/ప్రత్యేకం గా తయారు చేయబడిన వాహన డిస్కౌంట్

      · డిప్రిసియేషన్ రీ ఇంబర్సుమెంట్

      · కర్టసీ / హైర్ కార్

      · డైలీ అలవెన్సు

      · రిటర్న్ టు ఇన్వాయిస్

      · రిపేర్ అఫ్ గ్లాస్, ప్లాస్టిక్, ఫైబర్ మరియు రబ్బర్ పార్ట్శ్

      · ఎన్ సి బి ప్రొటెక్షన్ కవర్

      · లాస్ అఫ్ పర్సనల్ బెలొంగింగ్స్

      · కీ రీప్లేస్మెంట్

      · ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ అండ్ హోటల్ ఎక్సపెన్సెస్

      · ఇంజిన్ సెక్యూర్

      · కన్సూమబుల్ ఎక్సపెన్సెస్

      · టైర్ సెక్యూర్

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్


      యునైటెడ్ ఇండియా కార్ ఇన్సూరెన్సు

      యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కో.ఎల్ టి డి., మోటార్ ఇన్సూరెన్సు పాలసీ లు అందించే ఒక ప్రభుత్వ రంగ ఇన్సూరెన్సు సంస్థ. ఇది ఓన్ డామేజ్ కవర్, థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ తో పాటూ, డ్రైవర్ ఓనర్ కు ఆక్సిడెంట్ కవర్ కూడా అందిస్తుంది. ఓన్ డామేజ్ లో కార్ కు అగ్ని వలన ప్రమాదం, సెల్ఫ్-ఇగ్నిషన్, దొంగతనం, పిడుగులు, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ జనిత వైపరీత్యాల తో సహా కారు విడి భాగాల లాస్/డామేజ్ కవరేజీ ను కూడా కవర్ చేస్తుంది.

      యునైటెడ్ ఇండియా కార్ ఇన్సూరెన్సు పాలసీ ద్వారా పేరు తెలిసిన & పేరు తెలియని డ్రైవర్స్ కు ఆక్సిడెంట్ కవర్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ విడి భాగాలు, ఫైబర్ గ్లాస్ ఫ్యూయల్ ట్యాంక్స్ మరియు సి ఎన్ జి /ఎల్ పి జి బై-ఫ్యూయల్ కిట్ వంటి వాటికి కవరేజీ ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది.

      యునైటెడ్ ఇండియా కార్ ఇన్సూరెన్సు ఇండియా లో కెల్లా ఎక్కువ ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో (ఐ సి ఆర్) ని కలిగి ఉంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · వింటేజ్ కార్ డిస్కౌంట్

      · ఆటోమొబైల్ అసోసియేషన్ మెంబర్షిప్ డిస్కౌంట్

      · నో క్లెయిమ్ బోనస్

      · ఏంటి-తెఫ్ట్ పరికరం పై డిస్కౌంట్

      · ప్రత్యేకం గా రూపొందించిన /మార్పుచేయబడిన వాహనానికి డిస్కౌంట్

      · కర్టసీ కార్

      · మెడికల్ ఖర్చులు


      యూనివర్సల్ సోంపో కార్ ఇన్సూరెన్సు

      యూనివర్సల్ సోంపో జనరల్ కార్ ఇన్సూరెన్సు కో.ఎల్ టి డి. నాన్- కమర్షియల్ కార్ లకు సమగ్ర మోటార్ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్సు అందించే ఇన్సూరెన్సు సంస్థ. ఇది భీమా పొందబడిన కార్ పోయిన/నష్టపోయిన కవర్ చేస్తూ, అగ్ని, దొంగతనం, విస్ఫోటనం, మానవ సంబంధ వైపరీత్యాలు సెల్ఫ్-ఇగ్నిషన్ మరియు ప్రకృతి వైపరీత్యాలు ల నుండి మరియు థర్డ్ పార్టీ లీగల్ లయబిలిటీ ను కూడా కవర్ చేస్తుంది. ఇది ఓనర్-డ్రైవర్ కు పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ కూడా అందజేస్తుంది.

      ఎంచుకోవడానికి వీలు గా విడి భాగాలు లు, ప్రయాణికుల పర్సనల్ ఆక్సిడెంట్, పైడ్ డ్రైవర్/క్లీనర్ ల లీగల్ లయబిలిటీ మరియు పెంచబడిన థర్డ్-పార్టీ ప్రాపర్టీ లీగల్ లయబిలిటీ కూడా యూనివర్సల్ సోంపో కార్ ఇన్సూరెన్సు అందజేస్తుంది.

      అంతే కాకుండా, యూనివర్సల్ సోంపో కార్ ఇన్సూరెన్సు ఇండియా లో అన్ని మోటార్ ఇన్సూరెన్సు కంపెనీల కన్నా ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ను కలిగి ఉంది.

      అంశాలు

      ఆడ్-ఆన్ కవర్స్

      · నో క్లెయిమ్ బోనస్

      · ఏంటి-తెఫ్ట్ పరికరం అమర్చుకొనేందుకు డిస్కౌంట్

      · స్వచ్చంద మైన అదనపు తగ్గింపు

      · ప్రత్యేకం గా రూపొందించిన/ మార్పు చేయబడిన వాహన డిస్కౌంట్

      · నిల్ డిప్రెషషన్ కవర్

      · డైలీ క్యాష్ అలవెన్సు

      · రిటర్న్ టు ఇన్వాయిస్

      · ఆక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ క్లాజు

      · రోడ్ సైడ్ అసిస్టెన్స్

      · కీ రీప్లేస్మెంట్

      · కాస్ట్ అఫ్ కన్సూమబుల్స్

      · హైడ్రో స్టాటిక్ లాక్ కవర్

      · సెక్యూర్ టోవింగ్

      · ఎన్ సి బి ప్రొటెక్టర్

      · ఇంజిన్ ప్రొటెక్టర్


      విశేష సూచన: * పాలసీ బజార్ ఏ ఒక్క ఇన్సూరెన్సు సంస్థను లేదా ఆ ఇన్సూరెన్సు సంస్థ అందించే ఉత్పత్తి ని గానీ గానీ ప్రోత్సహించడం, రేటింగ్ ఇవ్వడం లేదా సిఫార్సు చేయడం గానీ చేయదు. ఐ సి ఆర్ వివరాలు ఐ ఆర్ డి ఏ 2018-19 వార్షిక నివేదిక నుండి పొందడం జరిగింది.

      ఇండియా లో ఉత్తమ మైన కార్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోవడానికి ముందు గమనించ వలసిన విషయాలు:

      మంచి కార్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనే ముందు, మీరు ముఖ్యమైన ఈ క్రింది విషయాల ను పరిగణ లోని కి తీసుకోవాలి:

      ఇన్సూరెన్సు కవరేజీ అందించే ముఖ్యమైన అంశాలను సరిపోల్చుకోండి:

      మీరు ఎంచుకున్న మంచి మోటార్ ఇన్సూరెన్సు పాలసీ లను సరిపోల్చుకొని, అవి ఒకే రకమైన ఇన్సూరెన్సు కవరేజీ ని అందిస్తున్నాయో లేదో విశ్లేషించు కోవాలి. మీ ఇన్సూరెన్సు ప్లాన్ ముఖ్యమైన పదజాలాన్ని (ఓన్ డామేజ్ కవర్) మరియు పర్సనల్ ఆక్సిడెంట్ మరియు థర్డ్-పార్టీ వలన గాయాలు పాలవడం వంటివి కలిగి ఉండాలి.

      ఇండియా లో ఉత్తమ మైన కార్ ఇన్సూరెన్సు పాలసీ లో భాగమైన ఆడ్-ఆన్ రైడర్ ల సమీక్ష:

      ఇండియా లో గల ఉత్తమ మైన కార్ ఇన్సూరెన్సు పాలసీ ఎంచుకోవడానికి అదనపు ప్రయోజనాలను ఇచ్చే ఆడ్-ఆన్ రైడర్స్ ని జాగ్రత్త గా పరిశీలించడం చాలా అవసరం. మీ సౌలభ్యం కోసం, కొన్ని కీలక మైన మోటార్ ఇన్సూరెన్సు రైడర్స్ క్రింద ఇవ్వడం జరిగింది.

      ఇంజిన్ కవర్:

      ఇది మీ కార్ ఇంజిన్ డామేజ్ అయినప్పుడు కలిగే అదనపు ఖర్చుల ను తప్పించుకోవడానికి ఇది ఒక అదనపు రక్షణ కల్పిస్తుంది.

      థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్:

      ఇది థర్డ్-పార్టీ మోటార్ వాహనం యొక్క గాయాలు, మరణం మరియు డామేజ్ రిపేర్ కాస్ట్ మొదలైన ఆర్ధిక చెల్లింపుల నుండి కారు యజమాని కి రక్షణ కల్పించేందుకు ఈ థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజీ ఉపయోగపడుతుంది.

      రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్:

      ఒక వేళ మీరు మార్గం మధ్యలో ఇంజిన్ ఫెయిల్ అవడం వల్ల వంటరి అయిపోయినా లేదా ఆక్సిడెంట్ వల్ల , టైర్ పంక్చర్ అయినా మీకు రోడ్ అసిస్టెన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. దీనివలన మీ ఇన్సూరెన్సు సంస్థ కు కాల్ చేసి ఒక కార్ మెకానిక్ ను మీరు ఉన్న ప్రదేశానికి పంపమని కోరుకోవచ్చు.

      జీరో డిప్రిసియేషన్ కవర్:

      మీరు ఒక వేళ జీరో డిప్రిసియేషన్ కవర్ ను మీ కార్ ఇన్సూరెన్సు పాలసీ కు జత చేసినట్లైతే, ప్రత్యామ్నాయ కార్ భాగాలపై తరుగుదలను మీ ఇన్సూరెన్సు కంపెనీ మాఫీ చేస్తుంది. దీని వలన మీరు ఎక్కువ క్లెయిమ్ మొత్తాన్ని పొందడానికి అర్హత పొందుతారు.

      పర్సనల్ ఆక్సిడెంటల్ కవర్:

      పర్సనల్ ఆక్సిడెంటల్ కవరేజీ వాహనం యజమాని కి అనుకోని మరియు దురదృష్టవ శాత్తూ జరిగిన శారీరక గాయాలు, ఆక్సిడెంట్ వలన కలిగిన మరణం, లేదా పూర్తిగా శాశ్వత వైకల్యం వలన రోడ్ ప్రమాదం వలన కోల్పోయే ఆర్ధిక భద్రత ను కవరేజీ చేయడానికి పనిచేస్తుంది.

      ఇన్సూరెన్సు కంపెనీల సమీక్షలను పరిగణ లోనికి తీసుకోండి:

      మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను ఒక మోటార్ ఇన్సూరెన్సు కంపెనీ తో వారికి గల అనుభవాన్ని తప్పక అడిగి తెలుసుకోండి. మీకు దగ్గర గా ఉన్న వారు, ప్రియమైన వారు తెలిపిన అభిప్రాయం ఆ కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్ మరియు క్లెయిమ్ పరిష్కారాల ప్రక్రియ లను లోతు గా పరిశీలించడానికి అవకాశము ఉంటుంది. దానివలన మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

      ఫ్లెక్సిబుల్ కార్ ఇన్సూరెన్సు కవరేజీ ని ఎంచుకోవడం:

      ఇండియా లో ఒక మంచి కార్ ఇన్సూరెన్సు ను కొనుగోలు చేయాలంటే, ఒక ఫ్లెక్సిబుల్ కవరేజీ చాలా ముఖ్యమైంది. రక రకాల వినియోగదారులు ఉంటారు కనుక ఒకే రకమైన 'వన్-సైజ్-ఫిట్స్-ఆల్' పాలసీ లు ఉండవు. నిర్దిష్టమైన అవసరాలకు తగ్గ కార్ ఇన్సూరెన్సు పాలసీ నే మీరు ఎంచుకోవాలి. ఒక ఇన్సూరెన్సు కంపెనీ ఫ్లెక్సీ-కవరేజ్ ప్రయోజనం ఇస్తున్నట్లైతే, దానికే మిగతా వాటికన్నా ప్రాముఖ్యత ని ఇవ్వాలి. ఒక వేళ ఇన్సూరెన్సు సంస్థ కొన్ని సిద్ధం గా ఉన్న ప్యాకేజీలు మీ అవసరాలకు తగ్గట్టు గా అందిస్తూ ఉంటే, మీరు అటువంటి ఇన్సూరెన్సు ప్లాన్ ను తీసుకోవడానికి మొగ్గు చూపాలి.

      ఇన్సూరెన్సు ప్రీమియం ను ఆన్ లైన్ లో సరిపోల్చుకోండి:

      ఇంటర్నెట్ చాలా రకాలైన గొప్ప లావాదేవీలను మీకు కుప్పలు తెప్పలు గా ముందుకు తీసుకువస్తుంది. ఆ వల లో మీరు పడకండి. అవి మిమ్మల్ని ఉచ్చు లో బిగించడానికి వేసిన ఒక ఎర అని తెలుసుకోండి. మీ రోజువారీ బిజీ కార్యక్రమాలలో కొంత సమయం మిగుల్చుకొని ఇంటర్నెట్ లో వెతికితే, కొన్ని మంచి ఒప్పందాలు మీకు కనపడ వచ్చు.

      మీరు కార్ ఇన్సూరెన్సు పాలసీ లు ఆన్ లైన్ లో సరిపోల్చేటప్పుడు, ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి:

      • వివిధఇన్సూరెన్సు కంపెనీలు అందించే వేర్వేరు ఇన్సూరెన్సు ప్లాన్ లు సరిపోల్చుకోండి.
      • సరిపోల్చేకంపెనీ ప్రీమియం ను ఫిక్సెడ్ ఐ డ్ వి (ఇన్సురెడ్ డిక్లేర్డ్ వేల్యూ) ద్వారా లెక్కిస్తుందో లేదో నిర్ధారించుకోండి.
      • ఇన్సూరెన్సుప్రీమియం కనీసం 3 ఆన్ లైన్ ఇన్సూరెన్సు కంపారిజన్ సైట్ లతో సరిపోల్చుకోండి.

      మీ కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ని ప్రభావితం చేసే అంశాలు:

      ఇన్సూరెన్సు ప్రీమియం ని ప్రభావితం చేసే అంశాలు, ఇన్సూరెన్సు సంస్థ కవర్ చేసే రిస్క్ ల పై ఆధారపడి ఉంటుంది. వీటిని ఈ క్రిందివిధాలు గా వర్గీకరించ వచ్చు:

      కార్ కు సంబంధించిన రిస్క్ లు

      కారు యొక్క మోడల్, క్యూబిక్ కెపాసిటీ, ఫ్యూయల్ రకం మొదలైన విషయాలు మీ కారు ఇన్సూరెన్సు ప్రీమియం ను నిర్ణయిస్తాయి. కొన్ని వాణిజ్య కార్లు మరియు ఎస్ యూ వి వంటి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ లు సాధారణం గా ఎక్కువ ప్రీమియం ను కలిగి ఉంటాయి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో క్లెయిమ్స్ లు ఇటువంటి కార్ ల నుండే ఇన్సూరెన్సు సంస్థలకు అందుతూ ఉంటాయి. సాధారణం గా పెట్రోల్ వాహనాల కన్నా డీజిల్ కార్ లు 10-15% ఎక్కువ ప్రీమియం కలిగి ఉంటాయి.

      ప్రదేశాన్ని బట్టీ మారే రిస్క్:

      ఇది రిజిస్ట్రేషన్ చేసిన ప్రదేశాన్ని బట్టీ ఆధారపడి ఉంటుంది. సాధారణం గా, కారు యజమాని అర్బన్ ఏరియా లో, ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతం లో, లేదా హైవే ల వద్ద నివసిస్తూ ఉంటే ప్రీమియం ఎక్కువ గా ఉంటుంది. మీరు నివసిస్తున్న ప్రాంతాలలో దొంగతనాలు లేదా వాహనాలు కోల్పోవడాలు ఎక్కువగా ఉంటే, మీ కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ఎక్కువ గా ఉంటుంది.

      కారు డ్రైవర్ పై ఆధారపడే రిస్క్ లు:

      డ్రైవ్ చేసే వారి వృత్తి, వయస్సు ను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. మీ కార్ కు ఎక్కువమంది డ్రైవర్ లు ఉంటే, ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

      నెగోషియేషన్ ఈస్ ది కీ :

      మోటార్ ఇన్సూరెన్సు కొనే టప్పుడు, మీ ప్రస్తుత ఇన్సూరెన్సు సంస్థతో నెగోషియేట్ చేయండి. మీరు ఒక బాధ్యత గల డ్రైవర్ అయి ఉన్నట్లైతే, మీరు ఎక్కువగా క్లెయిమ్ లు నమోదు చేయనట్లైతే లేదా ఎక్కువ గా ఆక్సిడెంట్ లు చేయక పొతే, మీకు చివరగా కొంత ప్రయోజనం కలుగ వచ్చు.

      మీ నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) ను సురక్షితం గా ఉంచుకోండి:

      మీరు ఒక బాధ్యత గల డ్రైవర్ అయి ఉన్నట్లైతే మరియు మీరు క్లెయిమ్ లు నమోదు చేయనట్లైతే మీకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) ప్రయోజనం కలుగుతుంది. మీరు ఒక సంవత్సరం లో ఏ ఆటో ఇన్సూరెన్సు క్లెయిమ్ కూడా నమోదు చేయక పొతే, మీ కార్ ఇన్సూరెన్సు కంపెనీ నో క్లెయిమ్ బోనస్ బహుమతి గా ఇస్తుంది. ఇది మీ పాలసీ రెన్యువల్ సమయం లో డిస్కౌంట్ రూపం లో ప్రీమియం నుండి తగ్గింపబడుతుంది. ఒక ఎంపికగా, మీరు ఎన్ సి బి ని కోరుకోవచ్చు.

      క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (సి ఎస్ ఆర్) ను చెక్ చేసుకోండి:

      ఒక కార్ ఇన్సూరెన్సు కంపెనీని అంతిమం గా ఎంచుకోయే ముందు, ఆఖరిది అయినా తీసి పారేయ కూడని విషయం ఇన్సూరెన్సు కంపెనీ యొక్క పూర్వపు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో రికార్డు లు పరిశీలించడం. ఒక ఇన్సూరెన్సు కంపెనీ తమ వినియోగదారుల క్లెయిమ్ ల ను పరిష్కరించడం తీసుకొనే సమయం పై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటే నే మీరు ముందుకు వెళ్ళండి. ఇండియా లో ఒక ఉత్తమ మైన కార్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క సి ఎస్ ఆర్ బాగా ఉండక పొతే దానికి కొనుగోలు చేయడానికి కనీసం ఆలోచించకండి. మీరు ఐ ఆర్ డి ఏ అఫ్ ఇండియా వెబ్ సైట్ నుండి సులువుగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో లను తనిఖీ చేసుకోవచ్చు.

      ఇండియా లో బెస్ట్ కార్ ఇన్సూరెన్సు కంపెనీని ఏ విధముగా ఎంపిక చేసుకోవాలి?

      ఇండియా లో ఉత్తమ కార్ ఇన్సూరెన్సు కంపెనీని ఎంపిక చేసుకోవడం అనేది క్లిష్టమైన పని కాదు. కానీ మీ కార్ కు ఎటువంటి భద్రత కావాలి అనేది మీకు తెలిసి ఉండాలి. దానితో పాటు ఇక్కడ మీకు కొన్ని సూచనలు వున్నాయి. అవి మీరు టాప్ కార్ ఇన్సూరెన్సు కంపెనీ లను ఎంపిక చేసుకోవడానికి సహాయపడతాయి. వాటిని చూడండి:

      • కార్ఇన్సూరెన్సు అవసరాలను విశ్లేషించుకోవడం - టాప్ కార్ ఇన్సూరెన్సు కంపెనీని ఎంపిక చేసేముందు మీ కార్ ఇన్సూరెన్సు అవసరాలను మీరు అంచనా వేయాల్సి ఉంటుంది. కవరేజ్ అనేది ఏ స్థాయి లో ఉంటుందో మీరు తెలుసుకోవాలి. దానితో పాటుగా మీరు ఎటువంటి ప్రత్యేకమైన ఆడ్- ఆన్స్ ను కొనుగోలు చేయదలచుకున్నారో చూసుకోవాలి. మీరు మీ కార్ యొక్క ఇన్సురెడ్ డిక్లేర్డ్ వేల్యూ (ఐ డి వి ) ఎంత కావాలి అన్న విషయంలో స్పష్టంగా ఉండాలి.గరిష్ట స్థాయిలో మీరు భరించగల పాలసీ ప్రీమియం గురించి మీకు తెలిసి ఉండాలి.
      • మోటార్ఇన్సూరెన్సు కంపెనీ ప్రామాణికత - కార్ ఇన్సూరెన్సు అవసరాలు ఇప్పుడు మీకు తెలుసు. మార్కెట్ లో వుండే ప్రామాణికత మోటార్ ఇన్సూరెన్సు కంపెనీలను మీరు తెలుసుకోవాలి. ఐ అర్ డి ఏ నమోదు సంఖ్య తనిఖీ ద్వారా కార్ ఇన్సూరెన్సు కంపెనీ యొక్క ప్రామాణికతను తెలుసుకొనవచ్చును. ఇండియా లో వుండే ఇన్సూరెన్సు కంపెనీలకు ఐ అర్ డి ఏ అధికార నియంత్రణ కలిగి వుంది. నిజమైన ఇన్సూరెన్సు ప్రొవైడర్ లకు మాత్రమే ఈ ఐ అర్ డి ఏ నమోదు సంఖ్య ను మంజూరు చేస్తుంది.
      • కంపెనీయొక్క ఆర్థిక యోగ్యత - కార్ ఇన్సూరెన్సు కంపెనీ యొక్క ప్రామాణికతను పరిశీలించే సమయములో కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా తనిఖీ చేసుకోవాలి. తనిఖీ చేయడం వలన కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు తెలుసుకోగలుగుతారు .మీకు అవసరమైన సమయములో క్లెయిమ్ మొత్తాన్ని మీకు ఏవిధముగా చెల్లిస్తుంది అనేది తెలుసుకొనే అవకాశం ఉంటుంది. కంపెనీ ఆన్యువల్ ఫైనాన్సియల్ రికార్డ్స్ ద్వారా సొల్వెన్సీ రేషియో ఎలా వుంది అనేదానిని బట్టి కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితి ని గుర్తించవచ్చు.
      • క్లెయిమ్సెటిల్మెంట్ రేషియో- ఇన్సూరెన్సు కొనుగోలు చేసే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (సి ఎస్ అర్ ) మరియు ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో (ఐ సి అర్ ) ను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.ఇన్సూరెన్సు కంపెనీ ద్వారా సెటిల్ చేయబడిన క్లైముల మొత్తం శాతాన్ని ఈ సి ఎస్ అర్ తెలియచేస్తుంది. అదే విధముగా ఇన్సూరెన్సు కంపెనీ సేకరించిన మొత్తం ప్రీమియం నుంచి ఎంత శాతం ప్రీమియం ను ఉపయోగించారు అనేది ఐ సి అర్ తెలియచేస్తుంది. మీరు ఎక్కువ సి ఎస్ అర్ మరియు ఐ సి అర్ వుండే కంపెనీలను మీరు ఎంపిక చేసుకుంట్లయితే, మీరు నమోదు చేసే క్లెయిమ్ ఇన్సూరెన్సు సంస్థ చేత తిరస్కరణకు గురు అయ్యే అవకాశం అంత తక్కువ గా ఉంటుంది.
      • క్లెయిమ్సెటిల్మెంట్ స్పీడ్- క్లెయిమ్ రేషియో తో పాటుగా ఇన్సూరెన్సు కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ స్పీడ్ ను కూడా గుర్తించాల్సి ఉంటుంది.వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ చేసే కంపెనీలను ఎంపిక చేసుకుంట్లయితే ఆ ఇన్సూరెన్సు కంపెనీమీ క్లెయిమ్ మొత్తాన్ని త్వరగాచెల్లిస్తుంది అని అర్ధం.
      • క్యాషులెస్గ్యారేజ్ నెట్ వర్క్ -తరువాత,మీరు క్యాష్ లెస్ గ్యారేజ్ నెట్ వర్క్ లు వుండే కార్ ఇన్సూరెన్సు కంపెనీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ లెస్ గ్యారేజ్ లు ఇన్సూరెన్సు కంపెనీలచేత ఆమోదించబడి,నగదు లేకుండా నే కార్ మరమత్తులు చేయబడతాయి. ఒక కంపెనీ కి ఎక్కువ క్యాష్ లెస్ గ్యారేజ్ లు ఉండటం వల్ల మీ పట్టణం లో గాని చుట్టుప్రక్కల గాని క్యాష్ లెస్ గ్యారేజ్ లను ఎంపిక చేసుకొనే అవకాశం వుంది.
      • వినియోగదారునిసేవలు - ఉత్తమ మైన మోటార్ కార్ ఇన్సూరెన్సు కంపెనీని ఎంచుకోవడం అనేది ఆ కంపెనీ కస్టమర్లకు అందించే సేవలను బట్టి నిర్ణయించబడుతుంది. కస్టమర్ సర్వీస్ అనేది మీరు ఇన్సూరెన్సు సంస్థ ను ఎంత సులువుగా సంప్రదించి వారి సహాయాన్ని పొందగలిగారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. 24x7 మీరు సంప్రదించే విధం గా రౌండ్ ది క్లోక్ సేవలు అందించే కంపెనీని ఎంచుకోండి.
      • ఆన్లైన్ లో సరిపోల్చుకోవడం- మీ ఇన్సూరెన్సు అవసరాలను తీర్చగల ఇన్సూరెన్సు కంపెనీలను ఆన్లైన్ ద్వారా సరిపోల్చుకొని ఎంపిక చేయడం అనేది సరి అయిన విధానం.కార్ ఇన్సూరెన్సు ప్లాన్స్ ను వేరువేరు ఇన్సూరెన్సు కంపెనీలతో ఆన్లైన్ లో సరిపోల్చి నట్లయితే వారు అందించే కవరేజ్ స్థాయిని,ప్రీమియం రేట్లను అదే విధంగా వారు అందించే ప్రయోజనాలను మీరు విశ్లేషించే సామర్ధ్యం కలిగి వుంటారు.ఆదర్శమయిన ఇన్సూరెన్సు కంపెనీలు గరిష్ట స్థాయి కవరేజ్ ను ఎక్కువ ప్రీమియం లు చెల్లించ కుండానే అందజేస్తాయి.
      • కస్టమర్రివ్యూస్ - వేర్వేరు మోటార్ ఇన్సూరెన్సు కంపెనీలలో ఒక దానిని ఎంపిక చేసుకొనేప్పుడు అన్ని రకాల మోటార్ ఇన్సూరెన్సు కంపెనీల యొక్క కస్టమర్ రివ్యూలను ఎప్పుడూ తనిఖీ చేసుకోవాలి.ఒక కంపెనీతో ఏ విధమైన ఇన్సూరెన్సు అనుభవాన్ని కలిగివుంటారు అనేది తెలుసుకొనుటకు ప్రస్తుత లేక ముందు కస్టమర్ రివ్యూలు మీకు సహాయపడతాయి .ప్రతికూల రివ్యూలు వున్న కంపెనీల కంటే అనుకూల రివ్యూలు వున్న కార్ ఇన్సూరెన్సు కంపెనీలను మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

      ఆఖరి-మాట

      క్యాష్ లెస్ రిపేర్ ను అందించే నెట్ వర్క్ గ్యారేజీ ల సంఖ్య, ఇంకార్డ్ క్లెయిమ్ రేషియో తో పాటు ఆడ్-ఆన్ కవర్ లను తప్ప కుండా ఒక కార్ ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేసేముందు తనిఖీ చేసుకోవాలి. పైన పేర్కొనబడిన కంపెనీలలో ఒక దానిని ఎంపిక చేసుకొని ఇండియా లోని గరిష్ట స్థాయి కవరేజ్ ప్రయోజనాలను నామ మాత్రపు ప్రీమియంకు అందించే మంచి మోటార్ ఇన్సూరెన్సు కంపెనీలను ఎంచుకోండి.

      తరుచు గా అడిగే ప్రశ్నలకు సమాధానాలు

      Find similar car insurance quotes by body type

      Hatchback Sedan SUV MUV
      Save upto 85% on Car Insurance
      Disclaimer: The list mentioned is according to the alphabetical order of the insurance companies. Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by any insurer. This list of plans listed here comprise of insurance products offered by all the insurance partners of Policybazaar. For complete list of insurers in India refer to the Insurance Regulatory and Development Authority of India website www.irdai.gov.in
      Claim Assurance Program

      #Rs 2094/- per annum is the price for third-party motor insurance for private cars (non-commercial) of not more than 1000cc

      *Savings are based on the comparison between the highest and the lowest premium for own damage cover (excluding add-on covers) provided by different insurance companies for the same vehicle with the same IDV and same NCB. Actual time for transaction may vary subject to additional data requirements and operational processes.

      ##Claim Assurance Program: Pick-up and drop facility available in 1400+ select network garages. On-ground workshop team available in select workshops. Repair warranty on parts at the sole discretion of insurance companies. Dedicated Claims Manager. 24x7 Claim Assistance.