- హోమ్‌పేజీ
- మోటార్ ఇన్సూరెన్స్
- కారు భీమా
- కార్ ఇన్సూర్న్స్ లో నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి)
కార్ ఇన్సూర్న్స్ లో నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి)
నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) అనేది ఒక ఇన్సూరెన్సు సంస్థ తమ పాలసీదారుడు పాలసీ కాలపరిమితి లో క్లెయిమ్లు చేయనందున ఇచ్చే బహుమతి. పెరుగుతున్న నో క్లెయిమ్ బోనస్ రాబోయే సంవత్సరాల ప్రీమియం తగ్గింపుకు దారితీస్తుంది.ఈ ఎన్ సి బి డిస్కౌంట్ ఓన్ డామేజ్ ప్రీమియం పై 20 % నుండీ 50 % వరకూ ఉంటుంది. ఒక వేళ పాలసీ దారుడు వాహనాన్ని మార్చి వేసినా, నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) కొనుగోలు చేసిన క్రొత్త వాహనానికి కూడా మార్చుకోవచ్చు.
కారు ఇన్సూరెన్సు లో ఎన్ సి బి పూర్తి పేరు ఏమిటి?
ఎన్ సి బి అంటే నో క్లెయిమ్ బోనస్. మోటారు వాహనాల కార్ యజమానులకు పాలసీ కాలవ్యవధి లో ఎటువంటి క్లెయిమ్ లు నమోదు చేయనందున ఇచ్చే బహుమతి. ఈ బహుమతి మరుసటి సంవత్సరము చెల్లించాల్సిన కారు ఇన్సూరెన్సు ప్రీమియం యొక్క తగ్గింపు రూపం లో ఉంటుంది.
కారు ఇన్సూరెన్సు లో ఎన్ సి బి ప్రయోజనాలు
నో క్లెయిమ్ బోనస్ కారు యజమానులకు కారు ఇన్సూరెన్సు పాలసీ లో చాలా రకాలైన ప్రయోజనాలను కలిగిస్తుంది. వాటిని ఒక సారి చూద్దాం:
- ప్రీమియం ను తగ్గిస్తుంది- నో క్లెయిమ్ బోనస్ పాలసీ దారుడు కి కారు ఇన్సూరెన్సు ప్రీమియం ధర లో కనీసం 20% తగ్గింపును పొందడానికి సహాయపడుతుంది. క్లెయిమ్ లు నమోదు కాని ప్రతీ సంవత్సరమూ ఎన్ సి బి డిస్కౌంట్ పాలసీదారుని కి మంజూరు చేయబడుతుంది. కారు ఇన్సూరెన్సు ను పునరుద్ధరించుకొనే సమయం లో పాలసీ దారుడు చెల్లించే ప్రీమియం మొత్తం నుండి ఈ తగ్గింపును పొందవచ్చు.
- బహుమతులనుగెలుచుకోవడం - నో క్లెయిమ్ బోనస్ ను బట్టి, బాధ్యత గల డ్రైవర్ అని లేదా ఇన్సూరెన్సు చేయబడిన కారు మంచి పరిస్థితిలో ఉందని నిర్ధారించడం కుదరదు. పాలసీ దారుడు ముందు పాలసీ కాలపరిమితి లో క్లెయిమ్ లు చేయకపోయినట్లైతే, ఎన్ సి బి రూపం లో బహుమతులు పొందవచు.
- పాలసీ దారులకుమంజూరుచేసేవి- ఎన్ సి బి మంజూరు చేసే ఈ ప్రయోజనాలు కేవలం పాలసీ దారునకు/కారు యజమానికి మాత్రమే కానీ, కారు కు కాదు. అందువలన అతను ఒక క్రొత్త కారు కొన్న లేదా ఇన్సూరెన్సు చేయబడిన కారును అమ్మి వేసినా, ఎన్ సి బి అతను కార్ ఇన్సూరెన్సు పాలసీ లను పునరుద్ధరించుకొనే వరకూ అతనితో మాత్రమే ఉంటుంది. అది ఆ కారు క్రొత్త యజమానికి బదిలీ అవదు.
- ఇంకొక కారు/భీమా సంస్థకు బదిలీ -పాలసీ దారుడు ఇంకొక కారు ను మార్చినట్లైతే, నో క్లెయిమ్ బోనస్ సులువు గా మరొక కారుకు బదిలీ అవుతుంది. అంతే కాకుండా కారు యజమాని వేరొక భీమా సంస్థ నుండి ఇన్సూరెన్సు కొనుగోలు చేయాలనుకుంటే, ఒక భీమా సంస్థ నుండి వేరొక భీమా సంస్థ కు కూడా బదిలీ చేసుకోవచ్చు.
ఎన్ సి బి ను కొత్త కార్ ఇన్సూరెన్సు కు బదిలీ చేయడం ఎలా?
ఎన్ సి బి ను కొత్త కార్ ఇన్సూరెన్సు పాలసీ కు బదిలీ చేసే పద్దతి చాలా సులువు. అయితే, ఆ పద్ధతి కారు యజమాని ఇన్సూరెన్సు ను ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లేదా ఏజెంట్ ద్వారా వంటి కొనుగోలుచేసే విధానాన్ని బట్టీ మారుతూ ఉంటుంది.
క్రొత్త కార్ ఇన్సూరెన్సు ను ఆన్ లైన్ లో కొనుగోలు చేసినట్లైతే, ఎన్ సి బి ని బదిలీ చేయడానికి కారు యజమాని చేయాల్సిందల్లా క్రొత్త ఇన్సూరెన్సు కంపెనీకి ఖచ్చితమైన ఎన్ సి బి, మీ పాత ఇన్సూరెన్సు సంస్థ పేరు మరియు మీ పాత పాలసీ నెంబర్ ను తెలియజేయాలి ఉంటుంది. ఆ ఇన్సూరెన్సు కంపెనీ స్వయంచాలికం గా ఎన్ సి బి ని పాత ఇన్సూరెన్సు సంస్థ నుండి ప్రస్తుత ఇన్సూరెన్సు పాలసీ కు మారుస్తుంది.
ఒక వేళ కార్ యజమాని న్యూ కార్ ఇన్సూరెన్సు ను ఆఫ్ లైన్ మార్గం లో గానీ లేదా ఏజెంట్ ద్వారా గానీ కొనుగోలు చేయాలనుకుంటే, నో క్లెయిమ్ బోనస్ ను ఈ క్రింది విధం గా బదిలీ చేసుకోవచ్చు.
- పాత మోటార్ఇన్సూరెన్సు సంస్థను సంప్రదించండి
- ఎన్ సి బి బదిలీ కోసం అభ్యర్ధన చేసుకొని, కావలసిన పత్రాలను జమ చేయండి.
- ఇన్సూరెన్సుసంస్థ ఎన్ సి బి పత్రాన్ని విడుదల చేస్తుంది.
- ఎన్ సి బి పత్రాన్ని క్రొత్త ఇన్సూరెన్సు సంస్థకు అందచేయండి.
- క్రొత్త ఇన్సూరెన్సుసంస్థ ఎన్ సీ బీ ను బదిలీ చేస్తుంది.
ఎన్ సి బి బదిలీ కి కావలసిన పత్రాలు
పాలసీ దారుడు నో క్లెయిమ్ బోనస్ ను బదిలీ చేసుకోవడానికి ఇన్సూరెన్సు కంపెనీకి ఈ క్రింద చెప్పబడ్డ పత్రాలు జమ చేయాల్సి ఉంటుంది.
- బదిలీ పత్రము
- కారు ఇన్సూరెన్సుయొక్క నకలు
- కొనుగోలు-అమ్మకపు దారుని ఒప్పందం (ఫార్మ్స్ 29 & 30)
- పాత బదిలీ రిజిస్ట్రేషన్పత్రము/యాజమాన్య బదిలీ పత్రము (పాత కారు అమ్ముతున్నట్లైతే)
- డెలివరీ నోట్నకలు
- బుకింగ్ రసీదు(కొత్త కార్ కొనినట్లైతే)
- ఎన్ సి బి సర్టిఫికెట్
ఎన్ సి బి ఎలా పనిచేస్తుంది?
కార్ ఇన్సూరెన్సు సంవత్సర ప్రీమియం ధరను ఎన్ సి బి తగ్గిస్తుంది. ప్రతీ సంవత్సరమూ
ఏ క్లెయిమ్ లూ నమోదు కాని పక్షం లో పెరిగే 5% ఎన్ సి బి, మరుసటి సంవత్సరం ప్రీమియం చెల్లింపు సమయం లో ఉపయోగించుకోవచ్చు. దీనిని ఒక ఉదాహరణం సహాయం తో అర్ధం చేసుకుందాం:
ఉదాహరణ
రూ. 4 లక్షలు కలిగి ఉన్న ఒక కారు ఐ డి వి (ఇన్సురెడ్ డిక్లేర్డ్ వేల్యూ) ఓన్ డామేజ్ మొదటి పునరుద్దీకరణ ప్రీమియం రూ. 12,000 . ఒక వేళ పాలసీ దారుడు ఏ విధమైన క్లెయిమ్ లూ చేయని పక్షం లో 20% తగ్గింపు పొందుతాడు. అందువన అతని ప్రీమియం రూ. 12,000 లకు బదులు గా రూ. 9,600 అవుతుంది. దీనివల్ల అతను క్లెయిమ్ లు చేయని కారణం గా రూ. 2,400 నిశ్చితం గా ఆదా చేసుకోగలుగుతాడు.
ప్రతీ సంవత్సరమూ పెరిగే ఈ తగ్గింపు వలన ఓ డి (ఓన్ డామేజ్) ప్రీమియం పై లభ్యమయ్యే ఆదా మొత్తం కూడా పెరుగుతూ వస్తుంది.
ఇప్పుడు ఐ ఆర్ డి ఏ నియమాల ప్రకారం ప్రతీ సంవత్సరము నో క్లెయిమ్ బోనస్ ఏవిధం గా పెరుగుతుందో గమనిద్దాం:
క్లెయిమ్ చేయబడని సంవత్సరాల సంఖ్య |
ఎన్ సి బి శాతం |
1 వ క్లెయిమ్-ఫ్రీ రెన్యువల్ సమయం లో |
20% |
2 వ క్లెయిమ్-ఫ్రీ రెన్యువల్ సమయం లో |
25% |
3 వ క్లెయిమ్-ఫ్రీ రెన్యువల్ సమయం లో |
35% |
4 వ క్లెయిమ్-ఫ్రీ రెన్యువల్ సమయం లో |
45% |
5 వ క్లెయిమ్-ఫ్రీ రెన్యువల్ సమయం లో |
50% |
*ఓ డి = ఓన్ డామేజ్
ఎన్ సి బి ఎప్పుడు ముగించబడుతుంది?
ఈ క్రింద ఇవ్వబడిన ఏ ఒక్క పరిస్థితులలోనైనా ఎన్ సి బి ముగించబడుతుంది:
- పాలసీ కాలపరిమితి లో క్లెయిమ్ చేయబడినపుడు ఎన్ సి బి మరుసటి సంవత్సరము లో ఇవ్వబడదు.
- పాలసీ గడువు తేదీ తరువాత 90 రోజుల లోగా పాలసీ పునరుద్ధరణ చేయించుకోని పక్షం లో.
ఎన్ సి బి కోసం మరింత సమాచారం
- ఒకే పాలసీదారుడు అయినట్లైతే, ఎన్ సి బి ను ఒకరి వాహనం నుండి మరొక వాహనం కు బదిలీ చేసుకోవచ్చు.
- ఎన్ సి బి ని ఒక భీమా సంస్థ నుండి మరొక భీమా సంస్థకు పునరుద్ధరణ సమయం లో బదిలీ చేసుకోవచ్చు.
- ఎన్ సి బి బదిలీ కొరకు ప్రస్తుత భీమా సంస్థనుండి ఎన్ సి బి పత్రాన్ని పొందవలసి ఉంటుంది.
వాణిజ్య వాహనాల కొరకు ఎన్ సి బి
సాధారణం గా వ్యాపారానికి ఉపయోగించే మూకుమ్మడి వాహనాలకు ఎన్ సి బి పెరుగుదల ఉండదు. కాని కొన్ని ఇన్సూరెన్సు సంస్థలు వాణిజ్య వాహనాలు నడిపే అనుభవాన్ని దృష్టి లో ఉంచుకొని ప్రీమియం ను నిర్ధారిస్తూ ఉంటాయి.
మీరు మీ కారు ను సాంఘిక సంక్షేమం మరియు ఆనందం కోసం ఇన్సూరెన్సు చేయించి ఉంటే ఎన్ సి బి పెరగడానికి అవకాశం ఉంది.
ఎన్ సి బి థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు కు వర్తించదు
నో క్లెయిమ్ బోనస్ అనే ప్రయోజనం కేవలం ఓన్ డామేజ్ కవర్ తోనే లభిస్తుంది. దీని అర్ధం, మీరు మీ కారు కోసం థర్డ్ పార్టీ కవర్ మాత్రమే పొంది ఉంటే ఎన్ సి బి డిస్కౌంట్ ప్రయోజనం లభించదు. అలాగే, ఆడ్-ఆన్స్ కూడా వర్తించదు. మీ పాలసీ పునరుద్ధరణ సమయం లో అనవసరమైన ఆడ్-ఆన్ కవర్ లు వదిలేసినప్పటికీ, మీ ఎన్ సి బి పై దాని ప్రభావం ఉండదు. ఈ సందర్భం లో ఎన్ సి బి ప్రొటెక్టర్ అనే ఆడ్-ఆన్ ని ఎంచుకోవడం వలన క్లెయిమ్ ఉన్నప్పటికీ ఎన్ సి బి బెనిఫిట్ పొందవచ్చు.
ఎన్ సి బి నిర్ధారణ చెల్లుబాటు కాలం
ఎన్ సి బి నిర్ధారణ చెల్లుబాటు కాలం సాధారణం గా రెండు సంవత్సరాలు ఉంటుంది. ఏదయినా కారణాల వలన పాలసీ దారుడు రహదారికి దూరం గా ఉన్నా లేక రెండు సంవత్సరాలు పాలసీ లేకున్నా, మళ్ళి ఇన్సూరెన్సు తీసుకోవాలంటే మొదటి నుండీ ప్రక్రియ ను ప్రారంభించాల్సి ఉంటుంది.
ప్రమాదం జరిగినా లేదా దొంగిలించబడిన వాహనానికి ఎన్ సి బి
ఒక వేళ ప్రమాదం జరిగి ఉంటే భీమా సంస్థ అవతలి సంస్థనుండి ఖర్చులను పొందని పక్షం లో, డ్రైవర్ తప్పువలన జరిగినా, కొంత గానీ పూర్తి గా గానీ ఎన్ సి బి బోనస్ ను కోల్పోవడానికి అవకాశం ఉంది. ఒక వేళ సంఘటన లో థర్డ్ పార్టీ కూడా కలసి ఉంటే మరియు డ్రైవర్ తప్పు నిరూపించబడని పక్షంలో మొత్తం ఖర్చులు రెండుభాగాలు గా చేయబడుతుంది, ఎన్ సి బి బోనస్ పై ప్రభావితం చేస్తుంది.
దొంగతనం చేయబడిన వాహనం విషయం లో కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి ఎందుకంటే ఇంకొక సంస్థనుండి ఇన్సూరెన్సు పాలసీ సంస్థ ఖర్చులను భర్తీ చేసుకో లేదు కనుక. దీనివలన కూడా నో క్లెయిమ్ బోనస్ లభించదు.
ఎన్ సి బి ను కాపాడుకోవడం ఎలా?
అదనపు ప్రీమియం ను చెల్లించడం ద్వారా, క్లెయిమ్ నమోదు చేసినప్పటికీ నో క్లెయిమ్ బోనస్ ను కాపాడుకోవచ్చును. నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ తీసుకోవడం ద్వారా ఎన్ సి బి బెనిఫిట్ కోల్పోయే ప్రమాదం లేదు. కాని ఈ ఖర్చులు ఐదు సంవత్సరాల తరువాత నో క్లెయిమ్ బెనిఫిట్ ద్వారా పొందిన తగ్గింపు తో సమానం గా ఉండదు. కాని సంవత్సరానికి రెండు అంత కన్నా ఎక్కువ క్లెయిమ్స్ మరియు ఎంత వ్యవధి తో ఇన్సూరెన్సు ను ఉపయోగించుకోవాలనే అంశాలు ప్రభావితం చేస్తాయి. నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ను కొనుగోలు చేయడం వల్ల కొన్ని రోజుల తరువాత పాలసీ కాస్ట్ ను ఖచ్చితం గా తగ్గిస్తుంది.
మిర్రర్డ్ నో క్లెయిమ్ బోనస్
నో క్లెయిమ్ బోనస్ అనే పదాన్ని ఒక వ్యక్తి తన ఇన్సురంచె పాలసీ ద్వారా లాభం పొంది ఉండి, ఇప్పుడు వాణిజ్య ప్రయోజనానికి వాహనాన్ని కొనుగోలు చేస్తున్నట్లైతే ఉపయోగిస్తారు.
పేరుపొందిన డ్రైవర్లకు ఎన్ సి బి
కొన్ని ఇన్సూరెన్సు కంపెనీలు పేరుపొందిన డ్రైవర్ లకు నో క్లెయిమ్ డిస్కౌంట్స్ అందజేస్తుంటాయి. ఇది కొన్ని రోజులు గడిచిన తరువాత పేరుపొందిన డ్రైవర్ తన స్వంత ఇన్సూరెన్సు కోసం వెళ్ళినప్పుడు అద్భుతం గా నో క్లెయిమ్ డిస్కౌంట్స్ లాభం పొందవచ్చు.
ఎన్ సి బి ఆడ్-ఆన్
ఎన్ సి బి అనేది మోటార్ ఇన్సూరెన్సు క్లెయిమ్ లు చేయని పాలసీ దారుని కి లభించే బహుమతి. ఒక్క చిన్న క్లెయిమ్ చోటుచేసుకున్నా, మొత్తం బహుమతి తుడిచిపెట్టుకుపోయి సున్నా అయిపోతుంది. కార్ ఇన్సూరెన్సు సంస్థలు, తమ వినియోగదారుల కోసం ఎన్ సి బి మైంటెనెన్సు ఆడ్-ఆన్ కవర్ వంటి ఆడ్-ఆన్ లు ఎన్ సి బి మైంటెనెన్సు ప్రొటెక్షన్ కోసం అందిస్తున్నారు. ఇటువంటి అదనపు కవరేజీలు ఎన్ సి బి లను రక్షణకు పూర్తి హామీ ఇచ్చినా కొంత హద్దుల వరకూ షరతుల మేర కాపాడతాయి.
ఎన్ సి బి బదిలీ చేయడం
నో క్లెయిమ్ బోనస్ అనేది పాలసీదారునికి ఇచ్చేదే కానీ వాహనానికి ఇచ్చేది కాదు కనుక, పాలసీ దారుడు లేదా వాహన యజమాని తన క్రొత్త వాహనానికి పాలసీ కొనుగోలు చేసే సమయం లో బదిలీ చేసుకొని లబ్ది పొందవచ్చు.
ఇన్సూరెన్సు మరొక ఇన్సూరెన్సు కంపెనీకి మారితే
పాలసీ దారుడు ఇంకొక ఇన్సూరెన్సు సంస్థకు మారినట్లైతే, క్రొత్త ఇన్సూరెన్సు సంస్థ సాధారణం గా నో క్లెయిమ్ బోనస్ ను అంగీకరిస్తుంది. ఒక వేళ సమర్పించిన ఎన్ సి బి పత్రం పై ప్రశ్నలు ఉత్పన్నమైతే, పాలసీ దారుడు ఇంతకు మునుపు పూర్వపు కంపెనీ వద్ద ఎటువంటి క్లెయిమ్ నమోదు చేయలేదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
డస్కీ క్లాజ్
నో క్లెయిమ్ బోనస్ అందించే అన్ని ప్రయోజనాలకంటే ఆక్షర్షణీయమైన అంశం కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ను తగ్గించడం. ఎన్ సి బి బెనిఫిట్ ను తరువాత సంవత్సరపు పాలసీ పునరుద్ధరణ సమయం లో ప్రీమియం ధరను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ, నిజానికి మీరు ఎన్ సి బి నుండి గరిష్టం గా 50% వరకూ క్లెయిమ్ చేసుకోగలుగు తయారు. ఒక సారి మీరు గరిష్ట పరిమితి కి చేరుకుంటే, క్లెయిమ్ ఉన్నా లేకపోయినా అదనపు డిస్కౌంట్ ఇవ్వబడదు. కొన్ని ఇన్సూరెన్సు కంపెనీలు ఈ ప్రయోజనాలను ఎన్ సి బి లు క్లెయిమ్ చేసుకొనే వరకూ ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఒక సారి క్లెయిమ్ జరిగినట్లయితే, ఎన్ సి బి సున్నా అయిపోతుంది మరియు పాత ఎన్ సి బి నియమాలు పునరుద్ధరణ సమయం లో వర్తిస్తాయి.
ఎన్ సి బి మీ కార్ ఇన్సూరెన్సు ప్రీమియం ను గణనీయం గా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఎక్కువ ఎన్ సి బి ని అందించే, సరైన ప్లాన్ ను జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
కార్ ఇన్సూరెన్సు కోసం నో క్లెయిమ్ బోనస్ (ఎన్ సి బి) పై తరుచుగా అడిగే ప్రశ్నలు
-
ప్ర 1 . నేను నా ఎన్ సి బి ని కారు నుండి ద్విచక్ర మోటార్ సైకిల్ కి బదిలీ చేసుకోగలనా?
జవాబు: లేదు. నో క్లెయిమ్ బోనస్ ఒక కారు నుండి మరొక కార్ కు, ఒక ఇన్సూరెన్సు సంస్థ నుండి మరొక ఇన్సూరెన్సు సంస్థకు మాత్రమే బదిలీ చేసుకోవచ్చు. మీరు మీ ఎన్ సి బి ని కారు నుండి ద్విచక్ర మోటార్ సైకిల్ కి బదిలీ చేసుకోలేరు.
-
ప్ర 2 . ఎన్ సి బి ఒకటికన్నా ఎక్కువ కార్లు ఉంటె కవర్ చేస్తుందా?
జవాబు: లేదు. ఎన్ సి బి డిస్కౌంట్ కేవలం ఒక్క కార్ కు మాత్రమే వర్తిస్తుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ కార్ లు ఉన్నట్లైతే, అన్నింటికీ వేర్వేరు ఇన్సూరెన్సు పాలసీ లు తీసుకొని ఒక్కొక్క దానికి వేరు వేరు గా ఎన్ సి బి లు తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
-
ప్ర 3 . ఎన్ సి బి థర్డ్ పార్టీ లయబిలిటీ కి వర్తిస్తుందా?
జవాబు: లేదు. నో క్లెయిమ్ బోనస్ కేవలం ఓన్ డామేజ్ కవర్ కి మాత్రమే వర్తిస్తుంది కానీ థర్డ్ పార్టీ లయబిలిటీ కార్ ఇన్సూరెన్సు కు వర్తించదు. థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ కలిగి ఉన్న కార్ ఇన్సూరెన్సు ప్రీమియం లు ఏవైనా ఎన్ సి బి డిస్కౌంట్స్ ని పొందలేవు.
-
ప్ర 4 . థర్డ్ పార్టీ క్లెయిమ్స్ ప్రభావం నా నో క్లెయిమ్ బోనస్ ల పైన పడుతుందా?
జవాబు: లేదు. అదృష్టవశాత్తు, థర్డ్ పార్టీ క్లెయిమ్స్ ప్రభావం మీ నో క్లెయిమ్ బోనస్ శాతాల పైన పడదు. ఎందుకంటే, ఎన్ సి బి థర్డ్ పార్టీ ఇస్యూరెన్సు మీద వర్తించదు, తద్వారా వాటిద్వారా ఏర్పడిన క్లెయిమ్స్ కూడా బోనస్ పై ప్రభావం చూపవు.
-
ప్ర 5 . నేను నా కారు ని మార్చిన తరువాత ఎన్ సి బి ని పొందగలుగుతానా ?
జవాబు: అవును. మోటార్ ఇన్సూరెన్సు కంపెనీలు మీరు మీ కార్ ను మార్చినప్పటికీ నో క్లెయి మ్ బోనస్ డిస్కౌంట్ ను కొనసాగించుకొనే అవకాశం ఇస్తున్నారు. ఉదాహరణకు, మీరు మీ పాత ఎస్ యూ వి యొక్క ఎన్ సి బి ని నిర్వర్తించుకుంటూ ఒక క్రొత్త సెడాన్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారు అని అనుకుందాం.. ఈ పరిస్థితులలో పాత ఎస్ యూ వి యొక్క ఎన్ సి బి ని మీ క్రొత్త సెడాన్ కు కారు రకం తో సంబంధం లేకుండా బదిలీ చేసుకోవచ్చు.
-
ప్ర 6 . కార్ ఇన్సూరెన్సు ద్వారా నేను గరిష్టం గా ఎంత శాతం ఎన్ సి బి ని పొందగలుగుతాను?
జవాబు: గత ఐదు సంవత్సరాలు గా క్లెయిమ్స్ ఏమీ లేనట్లైతే, కార్ ఇన్సూరెన్సు పాలసీ క్రింద, గరిష్టం గా 50 % నో క్లెయిమ్ బోనస్ పొందవచ్చు.
-
ప్ర 7 . నేను డ్రైవింగ్ చేయడం మానివేస్తే ఎన్ సి బి ని కోల్పోతానా?
జవాబు: లేదు. మీ నో క్లెయిమ్ బోనస్ మీరు ఇన్సూరెన్సు చేయబడిన కార్ ని డ్రైవింగ్ చేయడం ఆపి వేసినా, మీతో నే ఉంటుంది. క్లెయిమ్ ను నమోదుచేయడం వలన, పాలసీ ని సకాలం లో పునరుద్ధరించకపోయినా మీ ఎన్ సి బి ని కోల్పోతారు.
-
ప్ర 8 . ఇన్సూరెన్సు కంపెనీలు క్లెయిమ్ చరిత్రనూ ఎన్ సి బి ను తనిఖీ చేస్తాయా?
జవాబు: అవును. మోటార్ ఇన్సూరెన్సు కంపెనీలు పాలసీ పునరుద్ధరణ సమయం లో తప్పక క్లెయిమ్ చరిత్రనూ ఎన్ సి బి చెల్లుబాటు ను తనిఖీ చేస్తాయి. అంతే కాక, వాహన యజమాని పేర్కొన్న ఎన్ సి బి శాతాన్ని కూడా ద్రువీకరిస్తాయి.
-
ప్ర 9 . నేను గడువు కాలం కు ముందే పాలసీ రద్దు చేసుకుంటే ఎన్ సి బి ని కోల్పోతానా?
జవాబు: అవును. గడువు తేదీ కు ముందే మీ కార్ ఇన్సూరెన్సు పాలసీ రద్దు చేసుకుంటే ఎన్ సి బి ని కోల్పోతారు. కానీ, మీరు ఒక వేళ ఇన్సూరెన్సు కంపెనీని మాత్రమే మార్చుకోవాలనుకుంటే, ఎన్ సి బి పత్రాన్ని తీసుకొని, సరైన ఎన్ సి బి ని కొత్త ఇన్సూరెన్సు కంపెనీకి సమర్పిస్తే, బోనస్ ను కోల్పోకుండా ఉంటారు.
-
ప్ర 10. ఒక క్లెయిమ్ ప్రభావం ఎన్ సి బి ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు: మీరు మీ కార్ ఇన్సూరెన్సు పాలసీ ద్వారా ఎంత చిన్న క్లెయిమ్ అయినా చేసినట్లయితే, చిన్న, పెద్ద తేడా లేకుండా మీ ఎన్ సి బి ని కోల్పోతారు.
Find similar car insurance quotes by body type
#Rs 2094/- per annum is the price for third-party motor insurance for private cars (non-commercial) of not more than 1000cc
*Savings are based on the comparison between the highest and the lowest premium for own damage cover (excluding add-on covers) provided by different insurance companies for the same vehicle with the same IDV and same NCB. Actual time for transaction may vary subject to additional data requirements and operational processes.
##Claim Assurance Program: Pick-up and drop facility available in 1400+ select network garages. On-ground workshop team available in select workshops. Repair warranty on parts at the sole discretion of insurance companies. Dedicated Claims Manager. 24x7 Claim Assistance.