అలాగే ఈ ఇన్సురెన్స్ తీసుకున్నట్లయితే భీమాదారుని మరణానంతరం అతని కుటుంబ సభ్యులకు అధిక మొత్తంలో సొమ్ము అందజేయబడుతుంది, అయితే అన్ని రకాలైన మరణాలకు ఈ పధకం అమలుకాదు. మరి ఎటువంటి మరణాలకు ఈ భీమా పధకం అమలు అవుతుందో దేనికి కాదో మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి ఈ ఆర్టికల్ లో కొంత విపులంగా తెలుసుకుందాం.
సహజ మరణం లేదా ఆనారోగ్యపరమైన కారణాలు
భీమాదారుడు సహజమైన లేదా ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తే, ఆ వ్యక్తి యొక్క లబ్దిదారులు ఈ పధకం ద్వారా ధనాన్ని పొందగలరు.
ప్రమాదవశాత్తు మరణం
ఇక ప్రమాదవశాత్తు మరణించిన వారి లబ్దిదారులు కూడా టర్మ్ ఇన్సురెన్స్ ద్వారా ధనాన్ని పొందగలరు. అయితే చాలా టర్మ్ ఇన్సురెన్స్ పధకాలు ప్రమాదం జరిగిన వ్యక్తి యొక్క లబ్దిదారులకు ఇన్సురెన్స్ చేసిన సొమ్ము కన్నా అదనపు సొమ్మును కూడా చెల్లించే అవకాశం ఉంది.
అయితే ప్రమాదం ద్వారా చనిపోయే వ్యక్తి మద్యపానం లేదా ఏదైనా మాదక ద్రవ్యాల మత్తులో వాహనాన్ని నడిపినా లేదా ఎటువంటి నేరపూరితమైన చర్యలకు పాల్పడినా ఈ పాలసీ ద్వారా అతని కుటుంబ సభ్యులు లబ్దిపొందలేరు. అదేవిధంగా స్కై డైవింగ్, పారాచూ టింగ్, రాఫ్టింగ్, బంగీ జంప్ వంటి సాహసాలు చేస్తూ సదరు వ్యక్తి మరణించినా అతని లబ్దిదారులకు భీమా డబ్బు అందే అవకాశం లేదు.
ఆత్మహత్య
భీమా కలిగిన వ్యక్తి ఒకవేళపాలసీ తీసుకున్న రోజు నుండి 12 నెలలలోపు గనుక ఆత్మహత్య ద్వారా మరణిస్తే అతని లబ్దిదారులకు 80% ఇన్సురెన్స్ ధనం పొందే అవకాశం ఉంది. అలాగే ఈ ఇన్సురెన్స్ కి అనుసంధానంగా ఏదైనా పాలసీ తీసుకుని 12 నెలల లోపు మరణించినట్లయితే, పాలసీ యొక్క లబ్ధిదారుడుకి 100% డబ్బు చెల్లించబడుతుంది. అయితే, పాలసీదారు 1 సంవత్సరం పాలసీ పూర్తి అయిన తరువాత ఆత్మహత్య చేసుకుంటే పాలసీ యొక్క ప్రయోజనాలు రద్దు చేయబడతాయి మరియు పాలసీ రద్దు చేయబడుతుంది. ఆత్మహత్య మరణాలకు కవరేజీలను కొన్ని జీవిత బీమా సంస్థలు అందించవచ్చు లేదా అందించకపోవచ్చు. అంతే కాకుండా, బీమా కొనుగోలుదారులు పాలసీ యొక్క నిబందనలు మరియు షరతులను చదవడం చాలా ముఖ్యం మరియు పాలసీ యొక్క చేరికలు మరియు మినహాయింపులను కొనుగోలు చేసేముందు తెలుసుకోండి.
(View in English : Term Insurance)
స్వీయ గాయాలు
ఒకవేళ గనుక పాలసీ దారుడు స్వీయ గాయాలతో గాని లేదా ఏదైనా ప్రమాదకరమైన పనులు చేస్తూ గాని మరణించినట్లయితే అతని లబ్దిదారులు చేసే క్లెయిమ్ ను భీమా కంపెనీలు నిరాకరిస్తాయి.
హెచ్ ఐవీ/ఎయిడ్స్
భీమా తీసుకున్న వ్యక్తి లైంగిక పరంగా వ్యాపించే హెచ్ ఐవీ వంటి వ్యాధులతో మరణించినా ఈ ఇన్సురెన్స్ ద్వారా డబ్బులు రావు.
మత్తు పదార్ధాలు
భీమాదారుడు మద్యం, మాదక ద్రవ్యాల అధిక ప్రభావంతో మరణిస్తే ఇన్సురెన్స్ డబ్బులు వచ్చే అవకాశం లేదు.
హత్య
ఇక భీమాదారుడు అతని నామినీ చేత హత్యకు గురైనట్లు అనుమానించే సందర్భంలో కూడా ఇన్సురెన్స్ డబ్బు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ నామినీ గనుక ఇన్సురెన్స్ కోసం క్లెయిమ్ చేసే సందర్భంలో సదరు నామినీ తనపై ఉండే ఇన్వెస్టిగేషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
సునామీ లేదా ప్రకృతి వైపరిత్యాలు
సాధారణంగా, బీమా చేసిన వ్యక్తి సునామీ కారణంగా లేదా మెరుపులు, వాతావరణ పరిస్థితులు, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అతని కుటుంబానికి కవరేజీ ను అందిస్తుంది. తదనంతరం, పాలసీ యొక్క లభ్ధిదారుడు/నామినీ మొత్తం బీమా మొతాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డెత్ బెనిఫిట్ గా పొందుతారు.
రెండు కంటే ఎక్కువ పాలసీలను క్లెయిమ్ చెయ్యడం
ఇక భీమా సొమ్మును పొందాలి అనుకునే లబ్దిదారులు రెండు కంటే ఎక్కువ పాలసీలను క్లెయిమ్ చెయ్యాల్సి వచ్చినట్లయితే ఇన్సురెన్స్ రేగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా నియమాలను అనుసరించి కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అలాగే నామినీ కొత్త టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ ను కొనే ముందు ప్రస్తుతం ఉన్న భీమా వివరాలను సదరు కంపెనీకి అందజేయాల్సి ఉంటుంది. ఇక ప్రపోజల్ ఫారమ్ లో పాలసీ యొక్క సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే భీమాదారుడి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా భీమా కంపెనీని అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త భీమా కంపెనీ ఈ సమాచారాన్ని ప్రస్తుత భీమా కంపెనీతో మాట్లాడి సరిచూసుకుంటుంది. ఒకసారి ఈ వ్యవహారం అంతా విజయవంతంగా పూర్తయిన తర్వాత నామినీ భీమా సొమ్మును పొందగలరు.
చివరి మాట
టర్మ్ లైఫ్ ప్లాన్ కొనడానికి ముందు, బీమా కొనుగోలుదారులు పోల్చి డాక్యుమెంటేషన్ చదవడం చాలా ముఖ్యం. పాలసీ యొక్క చేరికలు మరియు మినహాయింపులు రెండింటి పైన సరైన జ్ఞానం కలిగి ఉండటం వలన పాలసీదారు కవరేజీని పొందటానికి మరియు క్లెయిమ్ ప్రాసెస్సింగ్ సమయంలో వచ్చే వ్యత్యాసాలను నివారించడంలో సహాయపడుతుంది.