ఇన్సూరెన్సు పాలసీ తీసుకొనే టప్పుడు మొట్ట మొదట కాల పరిమితి, వయస్సు, ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య మరియు కవరేజి మొత్తము వంటి ముఖ్యమైన కారకాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. సరైన పాలసీ ని ఎంచుకొనే ముందు కాస్త పరిశోధన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనం టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ మరియు సాంప్రదాయక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ల గూర్చి మాట్లాడుకున్నట్లయితే రెండు ప్లాన్ లు కొన్ని ప్రయోజనాలూ, కొన్ని పరిమితులూ కలిగి ఉంటాయి. ఇపుడు మనం టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ వలన కలిగే లాభాలు తెలుసుకోవడం ద్వారా టర్మ్ ఇన్సూరెన్సు, సాంప్రదాయక లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లలో ఏది కొనుగోలు చేసుకోవాలో అర్ధం చేసుకుందాం.
డెత్ బెనిఫిట్
టర్మ్ ఇన్సూరెన్సు మరియు సాంప్రదాయక లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ మధ్య గల ముఖ్యమైన వ్యత్యాసం డెత్ బెనిఫిట్. టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కేవలం ఇన్సూరెన్సు చేయబడిన వ్యక్తి కాలపరిమితి మధ్య లో మరణించినపుడు మాత్రమే డెత్ బెనిఫిట్ ఇవ్వబడుతుంది కానీ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీదారుని కి డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇవ్వబడుతుంది. టెర్మ్ ఇన్సూరెన్సు పాలసీ లలో ఇచ్చే డెత్ బెనిఫిట్ మొత్తం లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు అందించే మెచ్యూరిటీ మొత్తం కంటే చాలా ఎక్కువ గా ఉంటుంది. అయినప్పటి కీ చాలా మంది లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు తీసుకొనేందుకు మొగ్గుచూపడానికి కారణం జీవిత భీమా తో పాటు పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక. తక్కువ ఇన్సూరెన్సు ప్రీమియం తో ఎక్కువ డెత్ బెనిఫిట్ ని అందించే టెర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ని కనీసం ఒక్కటైనా తీసుకోవడం శ్రేయస్కరం.
రిస్కు కవరేజీ మరియు పొదుపు-
టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ వల్ల పాలసీ దారుడు మరణించిన తరువాత డెత్ బెనిఫిట్ వారి కుటుంబ సభ్యులకు చెందుతుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు జీవిత భీమా పాలసీల వలె సర్వైవల్ బెనిఫిట్స్ లేదా మెచ్యూరిటీ రిటర్న్స్ అందించవు. అందువల్ల ఎక్కువ విలువ గల డెత్ ఇన్సూరెన్సు ప్రీమియం లు చెల్లించలేని వ్యక్తులు టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకోవడం మంచిది. కానీ, ఒక వేళ జీవిత భీమా తో బాటు పెట్టుబడులతో సంపదను పెంచుకోవాలనుకొనే వారు ఖచ్చితం గా సాంప్రదాయ జీవిత భీమా తీసుకోవాలి.
వెసులుబాటు-
జీవిత భీమా ని సరెండర్ చేయడం కన్నా, టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ని సరెండర్ చేయడం చాలా సులువు. టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకున్న పాలసీదారుడు ప్రీమియం లు కట్టడం మానివేసినట్లయితే పాలసీ వల్ల లభించే ప్రయోజనాలు ఆగిపోయి పాలసీ లాప్స్ అవుతుంది. కానీ, జీవిత భీమా పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ కాలపరిమితి పూర్తి అయిన తరువాత మాత్రమే మెచ్యూరిటీ బెనిఫిట్ పొందగలుగుతారు. పాలసీ దారులు సగం కాలపరిమితి దగ్గర లో సరెండర్ చేస్తే, వారు ఆదా చేసిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందలేరు. కట్టిన ప్రీమియం మాత్రమే కొన్ని రకాల తగ్గింపులు అయిన తరువాత చెల్లించబడుతుంది. అంతే కాకుండా చాలామటుకు టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు పునరుద్దీకరణ చేసుకొనేందుకు, ప్రస్తుత ప్లాన్ ను ఎండోమెంట్ ప్లాన్ కు మార్చుకొనేందు కు అనువుగా ఉన్నాయి. కానీ ఈదశలో అదే హామీ మొత్తానికి లభ్యమయే ఎండోమెంట్ ప్లాన్ కు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
* అన్ని సేవింగ్స్ ఐ ఆర్ డి ఏ అనుమతించిన ఇన్సూరెన్సు ప్లాన్ ప్రకారం భీమా సంస్థ అందిస్తుంది. ప్రామాణిక షరతులకు వర్తిస్తాయి.
ప్రీమియం మొత్తము-
ఒక వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లో ఎక్కువ కవరేజీ కోరుకుంటున్నట్లైతే, ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్లనే, ఎక్కువ మంది ఇన్సూరెన్సు వినియోదాదారులు కవరేజీ ని పొందలేక పోతున్నారు. అంతేకాక, లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు చాలా తక్కువ రాబడి శాతం అంటే 5% - 7%, ఒక వేళ సరెండర్ చేసినట్లయితే ఇంకా తక్కువ రాబడి కలిగిఉంటుంది. అంతే కాక, నిర్వహణ ఖర్చుల తగ్గింపు వల్ల రాబడి ఇంకా తగ్గుతుంది. దీనికి విరుద్ధం గా టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు సరసమైన ధరలో ఎక్కువ కవరేజి ని అందిస్తున్నాయి.
ఉదాహరణకు, 30 సంవత్సారాల వయసు కలిగిన ఒక వ్యక్తి 20 సంవత్సరాల కాలపరిమితి కి రూ. 10,00,000 ల హామీ మొత్తం గల టర్మ్ ఇన్సూరెన్సు తీసుకోవాలంటే ప్రతీ సంవత్సరం రూ. 3000 లు చెల్లించవలసి ఉంటుంది. ఇది ఇలా ఉండగా అదే డెత్ బెనిఫిట్ కలిగిఉన్న వితౌట్ ప్రాఫిట్ ఎండోమెంట్ పాలసీ కి సంవత్సరానికి రూ. 30,000 మరియు, విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ పాలసీకి సంవత్సరానికి రూ. 50,000 పాలసీ ప్రీమియం ధర ఉంటుంది.
ఎవరైతే తమ కుటుంబానికి సరి అయిన ఆర్ధిక భద్రత కలిగించలేమని భావిస్తుంటారో లేదా స్థిరమైన ఆదాయం, ఆర్ధిక భద్రత లేదని అనుకుంటారో వారికీ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు ఉపయోగకరం గా ఉంటాయి.
టాక్స్ బెనిఫిట్ -
చాలా మంది వ్యక్తులు ఇన్ కం టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 C ద్వారా చెల్లించిన జీవిత భీమా ప్రీమియం పై ఆదాయపు పన్ను బెనిఫిట్ పొందవచ్చు అనే అపోహలో అధిక ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. అంతేకాక, మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా టాక్స్ నుండి మినహాయింపు అని భావిస్తూ ఉంటారు.
కానీ, గమనించాల్సింది ఏమిటంటే టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లకు ప్రీమియం లు తక్కువగా ఉంటాయి మరియు ఇన్ కం టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 సి ప్రకారము పన్ను తగ్గింపు కూడా వర్తిస్తుంది. టాక్స్ ఆదా చేయడం కోసం ఇన్సూరెన్సు ప్లాన్ ని తీసుకొనే వారు టర్మ్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టి, రెండు ప్రీమియం ల మధ్య గల వ్యత్యాసం తో ఇ ఎల్ ఎస్ ఎస్, పి ఎఫ్ ఎఫ్ మొదలైన టాక్స్ సేవింగ్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చును.
క్రింద ఇవ్వబడిన వివిధ లైఫ్ ఇన్సూరెన్సు మరియు టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ల మధ్య తులనాత్మక అధ్యయనం ఈ విషయాన్ని మరింత చక్కగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ప్రమాణం
|
టర్మ్ ప్లాన్లు
|
ఎండోమెంట్ ప్లాన్
|
యూనిట్ లింక్డ్ ప్లాన్
|
మెచ్యూరిటీ బెనిఫిట్
|
టర్మ్మె ప్లాన్ లలో మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు
|
ఉంటుంది
|
ఉంటుంది
|
డెత్ బెనిఫిట్
|
మరణించినట్లయితే హామీ మొత్తం డెత్ బెనిఫిట్ గా ఇవ్వబడుతుంది.
|
మరణించినట్లయితే హామీ మొత్తం మరియు బోనస్ (ఉన్నట్లయితే) కూడా డెత్ బెనిఫిట్ గా ఇవ్వబడుతుంది.
|
మరణించినట్లయితే హామీ మొత్తం లేదా ఫండ్ యొక్క విలువ ఏది ఎక్కువ గా ఉంటే అది డెత్ బెనిఫిట్ గా ఇవ్వబడుతుంది.
|
ప్రీమియం (30 సంవత్సరాల వయస్సు గ వ్యక్తి రూ.25 లక్షల కవరేజి తో 25 సంవత్సరాల కల పరిమితి)
|
ప్రీమియం సుమారు గా సంవత్సరానికి రూ 4000 ప్రీమియం కాలపరిమి, వయస్సు మరియు హామీ మొత్తం పై ఆధారపడి ఉంటుంది.
|
ప్రీమియం సుమారు గా సంవత్సరానికి రూ 21,000. పాలసీ కాల పరిమితి, వయసు మరియు హామీ మొత్తాన్ని బట్టీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది.
|
ప్రీమియం సుమారు గా సంవత్సరానికి రూ 2.5 లక్షలు. హామీ మొత్తాన్ని బట్టి, ఎంత ప్రీమియం చెల్లించాలో వ్యక్తి నిర్ణయించుకొని అవకాశం ఉంది.
|
చివరి మాట!
పెట్టుబడి దారులకు, లైఫ్ ఇన్సూరెన్సు అనేది వారి ఆర్ధిక ప్రణాళిక లో చాలా ముఖ్యమైన భాగం. అది తమ జీవిత భీమా మరియు టర్మ్ ఇన్సూరెన్సు కూడా సమానంగా ఉపయోగపడుతుంది. ఒక ప్లాను పెట్టుబడి పై రాబడిని మరియు జీవిత సంరక్షణ కు, మరొక ప్లాను చిన్న ప్రీమియం తో తాము ప్రేమించే వ్యక్తుల భవిష్యత్ ఆర్ధిక అవసరాలకు రక్షణ గాను ఉపయోగపడుతుంది. పైన చెప్పబడ్డ విషయాలు ఒక ఉత్తమమైన, అనుకూలమైన ఇన్సూరెన్సు ప్లాన్ ని ఎలా ఎంచుకోవాలో తెలియచేస్తున్నాయి.
(View in English : Term Insurance)