ఇంతకు ముందు రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు యువతకు మాత్రమే అందించే వారు కానీ ఇప్పుడు ఇన్సూరెన్సు కంపెనీ లు వయో వృద్ధుల కు కూడా టర్మ్ ప్లాన్ లు ను అందిస్తున్నాయి. ఇప్పుడు 50 మరియు 60 సంవత్సరాల వయసు గల వ్యక్తులు కొనుగోలు చేసేందుకు ఎన్నో ఇన్సూరెన్సు ప్లాన్ లు సిద్ధం గా ఉన్నాయి. అంతే కాక ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అన్నీ 75 - 80 సంవత్సరాల వయసు వరకూ ఇన్సూరెన్సు కవరేజి ని అందిస్తాయి.
ఇప్పుడు వయోవృద్దులకు టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కొనడం ఎందుకు తీసుకోవాలో విస్తృతం గా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ కొన్ని బహుళ ప్రాచుర్యం లో ఉన్న టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల గూర్చి కూడా చర్చించడం జరిగింది.
వయోవృద్దులు టర్మ్ ఇన్సూరెన్సు ఎందుకు తీసుకోవాలి?
వయోవృద్దులు తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఎందుకు తీసుకోవాలో క్రింద కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి.
- ఒక వేళ అకస్మాత్తుగా ఇన్సూరెన్సు పాలసీదారుడు పాలసీ కాలపరిమి లోపల మరణించినట్లయితే, డెత్ బెనిఫిట్ లబ్దిదారునకు చెల్లించ బడుతుంది. చెల్లించబడిన మొత్తం వారి ఆర్ధిక బాధ్యతలు, రుణాలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
- పాలసీ దారుని పై ఆధారపడి జీవిస్తున్నవారి ఆర్ధిక భవిష్యత్తు సురక్షిత పరచడానికి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు సహాయపడతాయి.
- కొన్ని రకాల టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ లు వివిధ రకాల చెల్లింపు లను అందిస్తూవుంటాయి. అందువల్ల పాలసీ దారుడు తన అవసరాలకు తగిన, అనుకూలంగా ఉన్న చెల్లింపు లను ఎంచుకోవచ్చును.
- పాలసీ దారుడు తన దీర్ఘకాలిక ఆర్ధిక అవసరాలకు సొమ్మును ప్రోగుచేయగలుగుతాడు.
- ఒక వ్యక్తి పదవీ విరమణ చేసిన తరువాత కూడా పని చేస్తూ తమ కుటుంబానికి ప్రతినెలా కొంత ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటే తప్పని సరిగా సీనియర్ సిటిజెన్ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను తీసుకోవాలి. దీనివల్ల దురదృష్ట సంఘటనవల్ల పాలసీ దారుని కుటుంబానికి కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయం గా ఇది పనిచేస్తుంది.
వయోవృద్దుల కు సూచించిన టర్మ్ ఇన్సూరెన్సు లక్షణాలు
- వయోపరిమితి - సాధారణం గా టర్మ్ ప్లాన్ లకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట పరిమితి ఒక్కో ఇన్సూరెన్సు సంస్థ కూ ఒక్కో విధం గా ఉంటుంది. అయినా టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల గరిష్ట వయోపరిమితి సాధారణం గా 55 సంవత్సరాలు - 65 సంవత్సరాలు ఉంటుంది. అంతే కాక, గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 85 సంవత్సరాలు ఉంటుంది.
- ఇన్సూరెన్సు కవరేజి - ఒక వేళ దురదృష్టవశాత్తు వయోవృద్దుల టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకున్న పాలసీ దారుడు కాలపరిమి లోపల మరణించినట్లయితే, డెత్ బెనిఫిట్ మాత్రమే లబ్దిదారునకు చెల్లించబడుతుంది. కానీ, ఒక వ్యక్తి టి ఆర్ ఓ పి (టర్మ్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్) కొనుగోలు చేస్తే, చెల్లించిన ప్రీమియం పాలసీ మెచ్యూరిటీ సమయం లో పాలసీ దారుని కి చెల్లించబడుతుంది.
- ప్రీమియం ధర - టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ల ప్రీమియం లు సరసమైన ధరల లో నే అందుబాటు లో ఉంటాయి. ప్రీమియం రేటు ఇన్సూరెన్సు కోలుగోలు చేసే వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అందువలన, టర్మ్ ప్లాన్ ను కొంత వయసు దాటిన తరువాత కొనుగోలు చేస్తే అతడు/ఆమె తన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కోసం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
- ఆరోగ్య పరీక్ష - వయోవృద్దులు టర్మ్ ఇన్సూరెన్సు కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా ప్రీ-పాలసీ మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివలన భీమా కంపెనీ సదరు కొనుగోలుదారుడు ఏ రకమైన ఆరోగ్య సమస్యల తోనూ బాధ పడటం లేదని రూఢీ చేసుకుంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకో లేని పక్షం లో తాను ఆరోగ్యం గా ఉన్నాను అని వెల్లడించే హామీ పత్రం ఇన్సూరెన్సు కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీ కొనుగోలు చేసే సమయం లో అనారోగ్య సంబంధమైన ఎటువంటి నిజాలను కప్పి ఉంచకూడదు అనే విషయాన్నీ ఖచ్చితం గా గుర్తించండి.
- రైడర్స్ - అదనపు లాభాలు ఇచ్చే రైడర్ బెనిఫిట్స్ వయోవృద్ధుల పాలసీ కవరేజి ను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్సు కంపెనీలు అందించే ఈ అదనపు లాభాలు ఒక్కో ప్లాన్ కూ ఒక్కో విధం గా ఉంటాయి. పాలసీ దారుడు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కావలసిన లాభాలను పాలసీ కు జత చేసుకోవచ్చు.
* అన్ని సేవింగ్స్ ఐ ఆర్ డి ఏ అనుమతించిన ఇన్సూరెన్సు ప్లాన్ ప్రకారం భీమా సంస్థ అందిస్తుంది. ప్రామాణిక షరతులకు వర్తిస్తాయి.
వయోవృద్దుల కోసం ఉత్తమమైన ఇన్సూరెన్సు ప్లాన్ లు.
వయోవృద్దుల కొరకు రూపొందిన కొన్ని జనాదరణ పొందిన ఇన్సూరెన్సు ప్లాన్ లు క్రింద ఇవ్వబడ్డాయి. వాటిని ఒక సారి పరిశీలిద్దాం.
ప్లాన్ పేరు
|
వయోపరిమితి
|
మెచ్యూరిటీ వయసు
|
హామీ మొత్తం
|
|
ఎగోన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్
|
కనిష్ట 20
గరిష్ట 65 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
కనీసం రూ. 10 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
|
ఆవియా లైఫ్ షీల్డ్ ప్లాటినం టర్మ్ ఇన్సూరెన్సు
|
కనిష్ట 18
గరిష్ట 60 సంవత్సరాలు
|
65 సంవత్సరాలు
|
కనీసం రూ. 50 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
భారతి ఏ ఎక్స ఏ ఈ ప్రోటెక్ట్ టర్మ్ ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 65 సంవత్సరాలు
|
70 సంవత్సరాలు
|
కనీసం రూ. 25 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
కెనరా హెచ్ ఎస్ బి సి ఇ స్మార్ట్ టర్మ్ ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 70 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
కనీసం రూ. 25 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ఈడెల్వెయిస్ టోకియో లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 60 సంవత్సరాలు
|
70 సంవత్సరాలు
|
కనీసం రూ. 15 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ఎక్సయిడ్ లైఫ్ మై టర్మ్ ఇన్సూరెన్సు
|
కనిష్ట 18
గరిష్ట 65 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
కనీసం రూ. 25 లక్షలు
గరిష్టం - రూ. 25 కోట్లు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ఫ్యూచర్ జెనెరలి ఫ్లెక్సీ ఆన్ లైన్ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్
|
కనిష్ట 18/25
గరిష్ట 55 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
కనీసం రూ. 50 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ఐ డి బి ఐ సీనియర్ సిటిజెన్ టర్మ్ ఇన్సూరెన్సు
|
కనిష్ట 25
గరిష్ట 60 సంవత్సరాలు
|
70 సంవత్సరాలు
|
రూ. 5 లక్షలు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ఇండియా ఫస్ట్ లైఫ్ ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 60 సంవత్సరాలు
|
70 సంవత్సరాలు
|
కనీసం రూ. 1 లక్ష
గరిష్టం - రూ. 50 కోట్లు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
కోటక్ ప్రిఫెరెడ్ ఇ టర్మ్ ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 65 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
కనీసం రూ. 25 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ఎల్ ఐ సి ఇ-టర్మ్ ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 60 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
కనీసం రూ. 25 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్
|
కనిష్ట 18
గరిష్ట 60 సంవత్సరాలు
|
85 సంవత్సరాలు
|
కనీసం రూ. 25 లక్షలు
గరిష్టం - రూ. 1 కోటి
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ప్రమెరికా యు-ప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 55 సంవత్సరాలు
|
65 సంవత్సరాలు
|
కనీసం రూ. 25 లక్షలు
గరిష్టం - పరిమితి లేదు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
ఎస్ బి ఐ లైఫ్-పూర్ణ సురక్ష ప్లాన్
|
కనిష్ట 18
గరిష్ట 65 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
కనీసం రూ. 20 లక్షలు
గరిష్టం - రూ. 2 కోట్లు
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి
|
సూచన: పాలసీబజార్ ఏ ఒక్క ఇన్సూరెన్సు కంపెనీ ని గా నీ, దాని ఉత్పత్తిని గాని సూచిండం, సిఫార్సు చేయడం, పక్షపాతం వహించడం చేయదు.
ఎజోన్ లైఫ్ ఐ టర్మ్ ప్లస్ ప్లాన్
ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఆర్ధిక భద్రనే కాక కుటుంబ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సమగ్రవంతం గా పనిచేస్తుంది. ఇన్సూరెన్సు కవరేజీ తో పాటు ఈ ప్లాన్ ప్రమాద భీమా మరియు క్లిష్టమైన అనారోగ్య పరిస్థితులను కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ యొక్క లక్షణాలను, ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఏగోన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు
- ఈ ప్లాన్ మీకు 80 సంవత్సరాల వయస్సు వరకూ ఇన్సూరెన్సు కవరేజి ని అందిస్తుంది.
- ఈ ప్లాన్ 10 ప్రాధమిక క్లిష్ట వ్యాధులకు మరియు 38 అదనపు క్లిష్ట అనారోగ్యాలనుండి కవరేజీ ని అందజేస్తుంది.
- ఒక వేళ శాశ్వత వైకల్యం, క్లిష్టమైన అనారోగ్య పరిస్థితులలో పాలసీ యొక్క ప్రీమియం మాఫీ కలుగుతుంది.
- ఇన్కమ్ టాక్స్ యాక్టు సెక్షన్ 80 సి ద్వారా టాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.
- ఈ పాలసీ వల్ల స్త్రీల కు మరియు పొగ త్రాగనివారికి ప్రీమియం రేట్ లలో తగ్గింపు లభిస్తుంది.
- లైఫ్ కవర్ పెంపు ఎంపికతో పాలసీదారుడు పాలసీ లైఫ్ కవరేజి ని పెంచుకోగలుగు తాడు .
- ఈ పాలసీ అందించే డెత్ బెనిఫిట్ వల్ల ఒక వేళ అకస్మాత్తుగా ఇన్సూరెన్సు పాలసీదారుడు పాలసీ కాలపరిమి లోపల మరణించినట్లయితే, డెత్ బెనిఫిట్ లబ్దిదారునకు చెల్లించ బడుతుంది.
ఐ డి బి ఐ సీనియర్ సిటిజెన్ టర్మ్ ఇన్సూరెన్సు
ఇది వయోవృద్దులకోసం ప్రత్యేకం గా తయారుచేయబడిన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్. ఈ ప్లాన్ సీనియర్ సిటిజెన్ ల కుటుంబ ఆర్ధిక భద్రత కోసం మరియు ప్రతికూల సంఘటనలను ఎదుర్కోవడానికి ఈ ప్లాన్ సమగ్రం గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పాలసీ యొక్క లక్షణాలు అందించే లాభాల వివరాలు చూద్దాము.
ఐ డి బి ఐ సీనియర్ సిటిజెన్ టర్మ్ ఇన్సూరెన్సు యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు
- ఈ ప్లాను ప్రత్యేకం గా 50 సంవత్సరాల వయస్సు పైబడి ఉన్నవారి అవసరాల కోసం తయారు చేయబడింది.
- దీనిద్వారా ఇన్సూరెన్సు కంపెనీ పాలసీ దారునికి ఆరోగ్య పరీక్షల అవసరము లేకుండా కవరేజీ ని అందిస్తుంది.
- ఈ పాలసీ గరిష్టం గా రూ . 5 లక్షల వరకూ కవరేజీ ని కల్పిస్తుంది. పాలసీ తీసుకున్న తేదీ నుండి 2 సంవత్సరాల వ్యవధి తరువాత నుండి ఇది అమలులోకి వస్తుంది.
- పాలసీ దారుడు పాలసీ ప్రారంభం అయిన 2 సంవత్సరాల వ్యవధి లో మరణించి నట్లయితే, చెల్లించిన ప్రీమియం విలువలో 125 % మొత్తం తిరిగి నామినీ కి చెల్లించబడుతుంది.
- ఈ పాలసీ వల్ల టాక్స్ బెనిఫిట్ ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 సి ప్రకారం రూ. 1.5 లక్షల వరకూ చెల్లించిన ప్రీమియం పై పొందవచ్చు.
- ఇది టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కనుక ఇది మెట్యూరిటీ లాభాలను అందించదు. కేవలం డెత్ బెనిఫిట్ ను మాత్రమే అందిస్తుంది.
ఎల్ ఐ సి ఈ-టర్మ్ ప్లాన్
ఎల్ ఐ సి ఈ-టర్మ్ ప్లాన్ పాలసీ దారుని కుటుంబ ఆర్ధిక భద్రత కోసం మరియు ప్రతికూల సంఘటనలను ఎదుర్కోవడానికి ఈ ప్లాన్ సమగ్రం గా పనిచేస్తుంది. ఈ ప్లాన్ ను ఆన్ లైన్ లో సులువుగా నిరభ్యంతరం గా కొనుగోలు చేసుకోవచ్చును. ఈ పాలసీ అందించే లక్షణాలు, ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఎల్ ఐ సి ఈ-టర్మ్ ప్లాన్ లక్షణాలు మరియు ప్రయోజనాలు
- ఎల్ ఐ సి ఈ-టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎల్ ఐ సి వారిది కావడం చేత దీనిని కొనుగోలు ప్రక్రియ చాలా సులభంగానూ, సరళం గా నూ ఉంటుంది.
- ఈ పాలసీ పొగ త్రాగనివారికి, స్త్రీలకూ పాలసీ కొనుగోలు లో ప్రత్యేకమైన తగ్గింపు అందిస్తుంది.
- ఈ ప్లాన్ ఒక సంపూర్ణ భద్రతా ప్లాన్ కావడం చేత డెత్ బెనిఫిట్ మాత్రమే అందిస్తుంది.
- పాలసీ దారుడు ఇన్సూరెన్సు కవరేజీ ని మాత్రమే కాక ఈ పాలసీ ద్వారా పన్ను లాభాన్ని కూడా పొందగలుగుతాడు. చెల్లించిన ప్రీమియం పై రూ. రూ. 1.5 లక్షల గరిష్ట పరిమితి వరకూ పన్ను మినహాయింపును పొందవచ్చు.
- ఈ పాలసీ 75 సంవత్సరాల వయస్సు వరకూ కవరేజీని అందిస్తుంది.
- పాలసీ దారునికి కనిష్టం గా 10 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల గరిష్ట కాలవ్యవధి గల టర్మ్ పాలసీ ని ఎంచుకోవడానికి అనువుగా ఉంటుంది.
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్
ఇది సీనియర్ సీనియర్ సిటిజెన్ లో కోసం తయారుచేయబడి, ఆన్ లైన్ లో సులువు గా సరళం గా కొనుగోలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం మూడు వేర్వేరు కవరేజి లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ పాలసీ దారు కుటుంబ సభ్యులకు అత్యవసర ఆర్ధిక అవసరాలకు భద్రత ను కలుగ చేస్తుంది. ఈ ప్లాన్ యొక్క లక్షణాలు, ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్ లక్షణాలు మరియు ప్రయోజనాలు.
- ఈ ప్లాన్ మూడు రకాలైన కవర్ ప్లాన్ లను ఎంచుకోవడానికి అవకాశం ఇస్తుంది.
- ప్రాధమిక జీవిత భీమా
- జీవిత భీమా + నెలసరి ఆదాయం
- జీవిత భీమా + పెరుగుదల ఉండే నెలసరి ఆదాయం
- ఈ మూడు విభిన్నమైన ప్లాన్ లు పాలసీ దారునికి గరిష్టం గా 85 సంవత్సరాల వయస్సు వరకూ కవరేజీ ని అందిస్తాయి.
- ఈ ప్లాన్ రెండు రకాలు గా ప్రీమియం చెల్లించే సదుపాయం కలిగిస్తుంది
- సాధారణ ప్రీమియం చెల్లింపు
- 60 సంవత్సరాలు వచ్చేవరకూ చెల్లించే విధానం
- ఈ పాలసీ వల్ల పన్ను మినహాయింపు ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 సి ప్రకారం రూ. 1.5 లక్షల వరకూ చెల్లించిన ప్రీమియం పై పొందవచ్చు.
- కొన్ని రకాలైన లాభాలను జత చేసుకోవడానికి వీలుగా ఆడ్-ఆన్ రైడర్స్ ను కూడా ఈ పాలసీ అదనకపు కవరేజీ కోసం అందిస్తున్నాయి.
- ఇది ఒక ఆన్లైన్ టర్మ్ ప్లాన్ కావడం వల్ల, దీని కొనుగోలు చేసే ప్రక్రియ చాలా సులభం గాను సరళం గా ఉంటుంది.
ఎస్ బి ఐ లైఫ్ పూర్ణ సురక్ష ప్లాన్
ఇది ఒక నాన్-లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కావడం చేత సీనియర్ సిటిజెన్ లకు క్లిష్ట వ్యాధులను కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ పాలసీ దారుని కుటుంబ ఆర్ధిక భద్రత కోసం మరియు సంఘటనలను ఎదుర్కోవడానికి సమగ్రం గా పనిచేస్తుంది. ఈ పాలసీ లక్షణాలు మరియు ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఎస్ బి ఐ లైఫ్ పూర్ణ సురక్ష ప్లాన్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు
- ఈ ప్లాన్ ద్వారా పెరిగే ప్రమాదకరమైన అనారోగ్యాల ను కవర్ చేసే అవకాశం ఉంటుంది.
- ఒక వేళ క్లిష్టమైన అనారోగ్యం కలిగినట్లైతే, ప్రీమియం మాఫీ అయ్యే సౌకర్యం కూడా ఈ పాలసీ ద్వారా కలుగుతుంది.
- ఈ ప్లాన్ ప్రకారం హామీ మొత్తం ప్రతీ సంవత్సరమూ దానికదే జీవిత మరియు క్లిష్ట అనారోగ్య పరిస్థితులు మధ్య మారుతూ ఉంటుంది.
- పాలసీ కాల పరిమితి పూర్తి అయ్యేంతవరకూ ప్రీమియం స్థిరం గా ఉంటుంది.
- ఈ పాలసీ వల్ల ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 సి ప్రకారం రూ. 1.5 లక్షల వరకూ చెల్లించిన ప్రీమియం పై పన్ను మినహాయింపు పొందవచ్చు.
- ఈ పాలసీ మెచ్యూరిటీ వయో పరిమితి గరిష్టం గా 75 సంవత్సరాలు కలిగివుంది.
మీరు మరిన్ని టర్మ్ ఇన్సూరెన్సు ప్లానుల కోసం కూడా తెలుసుకోవచ్చు
- ప్రీమియం తిరిగివచ్చే టర్మ్ ప్లాన్
- గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్సు
- ఆరోగ్య పరీక్షలు అక్కర లేని టర్మ్ ఇన్సూరెన్సు
- టర్మ్ ఇన్సూరెన్సు ప్రయోజనాలు
- ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన
గమనిక: టర్మ్ బీమా అది ఏమిటో తెలుసుకోండి
(View in English : Term Insurance)