Prices Increasing soon Prices Increasing Soon

1 కోటిరూపాయల టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్

ద్రవ్యోల్భణం వల్ల అంతకంతకూ పెరుగుతున్న ధరలు మన జీవన ప్రమాణాన్ని పెంచేస్తున్నాయి.  మీరు మాత్రమే మీ కుటుంబానికి ఆర్ధిక ఆసరా అయి, మీ ప్రియమైన వారిని అనుకోని సంఘటనల వల్ల భాధ పడకుండా ఉండేలా చేయాలంటే వారి వారి అవసరాలకోసం తప్పకుండా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.  మీ పై ఆధార పడి జీవిస్తున్న వారి ఆర్ధిక భద్రత ను మీరు జీవించి లేనప్పటికీ కాపాడుకోవాలంటే కనీసం రూ. 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేయాలి.   ఇప్పుడు ఉన్న అన్నిలైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రకాలు కంటే టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ సరసమైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ.

Read more
Gets ₹1 Cr. Life Cover at just
COVID-19 Covered
The Policybazaar Advantage
Dedicated claim support for family FREE
Upto 10% discount# for buying online
Only certified experts will call you on 100% recorded lines
We are rated~
rating
7.7 Crore
Registered Consumer
50
Insurance Partners
4.2 Crore
Policies Sold

#All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans | Standard Terms and Conditions Apply

By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use

~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ

Life is Unpredictable! Protect your family’s future
Get ₹1 Crore Life cover starting from /month+
+91
Secure
We don’t spam
Check Your Premium Now
Please wait. We Are Processing..
Get Updates on WhatsApp
The Policybazaar Advantage
Policybazaar Advantage Icon
Dedicated claim support for family FREE
Policybazaar team will help and support you at the time of claim. A personal claim handler from our team of experts will get in touch with you when your nominee applies for a claim on our website.
Policybazaar Advantage Icon
100% calls recorded to ensure no mis-selling
We will make sure you get what is promised by the advisors. We conduct regular monitoring of our calls to make sure you get the best experience.
Policybazaar Advantage Icon
Exclusive lifetime discount upto 5% for buying online
The discounts will be valid for the entire policy payment term and is not available if you choose to buy the insurance through offline agents.
Policybazaar Advantage Icon
Advisors available in your city
Our advisors are available in more than 55 cities across India and can help you at your doorstep in understanding the plans and in documentation.
Policybazaar Advantage Icon
Refund at the click of a button
In case you aren’t happy with your purchase, you can cancel your policy hassle-free at the click of a button. We will help you with the cancellation and refund of your policy.

కాలం తో పాటు మీ ఆర్ధిక అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి, అందువలన ముఖ్యమైన,  సరైన టర్మ్ ఇన్సూరెన్సు కవరేజ్ మొత్తాన్ని ని అందించే ప్లాన్ ను ఎంచుకోవాలి.  ఉదాహరణకు, ఇంటికోసం చేసిన ఋణం, పిల్లల చదువులు, వివాహం వంటివి.  రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ మీ పిల్లల తో, జీవిత భాగస్వామి తో, తల్లితండ్రులతో మీరు కలసి జీవించలేని సమయం లో కూడా సౌకర్యవంతం గా ఆర్ధిక ఇబ్బందులు  లేకుండా జీవించగలుగుతారు.   

ఈ కారణం గానే మేము రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్  కవరేజీ ను ఎంచుకున్నాము.  ఇదే మొత్తాన్ని తప్పని సరిగా ఎంచుకోవాల్సి పని లేదు. దీనికన్నా ఎక్కువ హామీ మొత్తాన్ని కూడా ఎంచుకొని మీ ప్రియమైన వారి ఆర్ధిక  భవిష్యత్తుకు భరోసా ఇవ్వవచ్చు.  

ప్రారంభం లో చాలామందికి  ప్రీమియం ధర కారణం గా సరైన టర్మ్ ఇన్సూరెన్సు కవరేజీ మొత్తాన్ని ఎంచుకోవడం  కాస్త గందర గోళం గా అనిపించ వచ్చు.  కానీ మీరు వివిధ టర్మ్ ప్లాన్ లను పోల్చి చూసినపుడు, మీ అవసరాలకు తగిన  ఒక ఇన్సూరెన్సు ప్లాన్ లభ్యం అవుతుంది.    ఈ వ్యాసం లో రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అందించే ప్రయోజనాల కోసం వివరం గా తెలుసుకోవచ్చు. మీరు ప్రాధమిక విషయాలు తెలుసుకున్నతరువాత వివిధ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లను సరిపోల్చుకోవడం చాలా సులభం అయిపోతుంది.  అప్పడు మీకు మీ కుటుంబసభ్యుల ఆర్ధిక అవసరాలకు, మీ జేబుకు అనుకూలమైన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను ఎంచుకోగలుగుతారు.  

(View in English : Term Insurance)

రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ అంటే ఏమిటి?

ఒక టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ద్వంద్వ ఉద్దేశ్యం తో, అంటే డెత్ బెనిఫిట్ తో పాటు అతని/ఆమె కుటుంబానికి  అతని/ ఆమె పాలసీ కాలపరిమితి లో మరణించిన తరువాత ఆర్ధిక స్థిరత్వానికి హామీ ఇస్తుంది.  ఈ రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఖచ్చితం గా హామీ మొత్తాన్ని పాలసీ దారుడు మరణించిన తరువాత అతని నామినీ కు అందజేస్తుంది.  ఈ పాలసీ ఆయా కుటుంబాలకు ఒక రక్షకుని గా పని చేసి వారి ఆర్ధిక అవసరాలను,  ఆకాంక్షలను పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది.  

భీమా సంస్థ

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో

గరిష్ట మెచ్యూరిటీ వయస్సు

ప్రీమియం (రూ.1 కోటి కవరేజీ కోసం)

చర్య

ఐసీ ఐసీ ఐ  ప్రుడెన్షియల్           

97.8%

85 సంవత్సరాలు

రూ. 704/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

హెచ్ ది ఎఫ్ సి లైఫ్    

99%

85 సంవత్సరాలు

రూ. 709/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

మాక్స్ లైఫ్

99.22%

75 సంవత్సరాలు

రూ. 623/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

టాటా ఏ ఐ ఏ 

99.1%

75 సంవత్సరాలు

  రూ. 927/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

బజాజ్ ఆలియాన్జ్ 

98%

85 సంవత్సరాలు

  రూ. 638/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

పి ఎన్ బి మెట్ లైఫ్ 

97.16%

99 సంవత్సరాలు

  రూ. 585/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

కెనరా హెచ్ ఎస్ బి సి  ఓ బి సి  లైఫ్ ఇన్సూరెన్సు

98.1%

99 సంవత్సరాలు

  రూ. 480/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఈడెల్వెయిస్ టోకియో 

97.8%

80 సంవత్సరాలు

  రూ. 526/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్సు

97.5%

80 సంవత్సరాలు

  రూ. 623/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఇండియా ఫస్ట్ 

96.65%

65 సంవత్సరాలు

  రూ. 422/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఏగొం లైఫ్

98%

100 సంవత్సరాలు

  రూ. 479/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్సు

98.1%

65 సంవత్సరాలు

  రూ. 500/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఎస్ బి ఐ లైఫ్

94.52%

80 సంవత్సరాలు

  రూ. 589/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

కోటక్ లైఫ్

96.3%

75 సంవత్సరాలు

  రూ. 654/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఎక్సయిడ్ 

98.1%

55 సంవత్సరాలు

  రూ. 926/ నెలకు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

విశేష సూచన: పైన చెప్పబడిన ప్లాన్ లు మరియు ప్రీమియం లు రూ. 1  కోటి హామీ మొత్తనికి 25  సంవత్సరాల వయసుగల వారికి 20 సంవత్సరాల పాలసీ కాల పరిమితి కోసం ఉద్దేశింపబడినవి.  నిర్దిష్టమైన  నిర్బంధనలు, షరతులు వర్తిస్తాయి.  

ఉత్తమమైన  రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు 

దాదాపు అన్ని ప్రముఖ భీమా సంస్థలు అన్నీ అవసరాలకు తగ్గ్గట్టు మార్చుకోవడానికి వీలు పడే విధం గా  వివిధ రాకాలైన టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ లు కొనుగోలుదారులకు  అందజేస్తున్నాయి.  వీటి ప్రీమియం ధర, పాలసీ ప్రయోజనాలు, లక్షణాలు అన్నీ ఒక దాని కి ఒక టి భిన్నం గా ఉంటాయి.  ప్రీమియం యొక్క ప్రాధమిక ధర కేవలం పొగ త్రాగనివారికి, మద్యం సేవించే అలవాటు లేనివారికి మరియు ఎటువంటి పూర్వపు ఆరోగ్య సమస్యలు లేని వారికే వర్తిస్తుంది.  ధరఖాస్తుదారుని కి వైద్య/ఆరోగ్య సమస్యలు, జీవన ప్రమాణ సంభందిత వ్యాధులు, పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉండి ఉంటే లేదా రైడర్స్ జత చేసుకొని ఉంటే ప్రీమియం ధర పెరుగుతుంది.  

ఇక్కడ మనం రూ.1  కోటి కన్నా ఎక్కువ హామీ మొత్తాన్ని అందించే కొన్ని ఉత్తమ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్లు కోసం చర్చించుకుందాం.  ఒక సారి వీటిని పరిశీలించి దీనిలో మీ అవసరాలకు తగిన  ఒక ఉత్తమమైన ప్లాన్ ను ఎంచుకోండి: 

ఈ క్రింది పట్టిక రూ.1  కోటి ఆన్ లైన్ టర్మ్ ప్లాన్ ల ముఖ్యాంశాలను వివరిస్తుంది: 

రూ.1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్

పాలసీ కాల వ్యవధి

కనిష్ట మరియు గరిష్ట వయోపరిమితి

రైడర్ ప్రయోజనాలు

మెచ్యూరిటీ వయసు

ఏగొం లైఫ్ ఐ-టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్

5-40 సంవత్సరాలు

18-65 సంవత్సరాలు

ప్రమాదాలు, డెత్ బెనిఫిట్ మరియు ప్రీమియం మాఫీ

గరిష్టం  70  సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఆవియా ఐ-లైఫ్  టోటల్

  • ప్రొటెక్ట్: 10-57 సంవత్సరాలు
  • ప్రొటెక్ట్ ప్లస్: 10-57 సంవత్సరాలు
  • ప్రొటెక్ట్ అస్సురెడ్: 15-30 సంవత్సరాలు
  • ప్రొటెక్ట్ ఇన్కమ్: 10-57 సంవత్సరాలు

కనిష్ట 18 సంవత్సరాలు గరిష్ట 65 సంవత్సరాలు

ప్రొటెక్ట్ ప్లస్ మరియు ప్రొటెక్ట్ ఇన్కమ్

క్లిష్ట అనారోగ్యాలు, శాశ్వత మరియు పూర్తి వైకల్యం, మరణాంతకమైన రోగములు నుండి రక్షణ

  • 70  సంవత్సరాలు
  • 75  సంవత్సరాలు

రైడర్ ప్రయోజనాలు లేకుండా

ఇప్పుడు దరఖాస్తు చేయండి

బజాజ్ అలియాన్స్ ఐ సెక్యూర్ టర్మ్ అసురన్సు ప్లాన్

10, 15, 20, 25, 30 సంవత్సరాలు

18-60 సంవత్సరాలు

ప్రమాదాలు, డెత్ బెనిఫిట్,  ప్రీమియం మాఫీ మరియు ప్రమాదాల వలన కలిగే

శాశ్వత పూర్తి/ పాక్షిక వైకల్య ప్రయోజనం

కనిష్టం:    28 సంవత్సరాలు

గరిష్టం : 70 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

కెనరా హెచ్ ఎస్ బి సి ఐ సెలెక్ట్ +టర్మ్ ప్లాన్

ప్లాన్ ఆప్షన్ లైఫ్ :  5-62 సంవత్సరాలు

మిగిలిన ప్లాన్ లు: 10-30 సంవత్సరాలు

డిక్రీజింగ్ కవరేజి ఆప్షన్: 10 సంవత్సరాలు

పాలసీ కాలపరిమితి లో సూచించిన వ్యవధిలో కనీసం 5 సంవత్సరా లు కవరేజీ తగ్గుతూ వస్తుంది.

18-65 సంవత్సరాలు

వర్తించదు

  • 80  సంవత్సరాలు
  • 75  సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఈడెల్వెయిస్ టోకియో లైఫ్ టోటల్ సెక్యూర్ +

లైఫ్ కవర్ : 10-62 సంవత్సరాలు

లైఫ్ కవర్ విత్ బేసిక్ హెల్త్ కవర్ & లైఫ్ ఓవర్ విత్ కంప్రెహెన్సివ్ హెల్త్ కవర్:  10-40 సంవత్సరాలు

18-65 సంవత్సరాలు

ప్రమాదాలు, డెత్ బెనిఫిట్,  ప్రీమియం మాఫీ, ప్రమాదాల వలన కలిగే

శాశ్వత పూర్తి/ పాక్షిక వైకల్య ప్రయోజనం మరియు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్

  • 80  సంవత్సరాలు
  • 75  సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఫ్యూచర్ జెనెరలి ఫ్లెక్సీ ఆన్ లైన్ టర్మ్ ప్లాన్

బేసిక్ లైఫ్ కవర్ - 10 సంవత్సరాలు - 75 సంవత్సరాలు


ఇన్కమ్ ప్రొటెక్షన్ 10 సంవత్సరాలు - 65 సంవత్సరాలు

బేసిక్ లైఫ్ కవర్ - 18 - 55 సంవత్సరాలు


ఇన్కమ్ ప్రొటెక్షన్- 25 - 55 సంవత్సరాలు

ప్రమాదాల డెత్ బెనిఫిట్ రైడర్

బేసిక్ లైఫ్ కవర్ - 75 సంవత్సరాలు

ఇన్కమ్ ప్రొటెక్షన్  65 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

హెచ్ ది ఎఫ్ సి లైఫ్ క్లిక్2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్

10-40 సంవత్సరాలు

18-65 సంవత్సరాలు

ప్రమాదాల వలన కలిగే వైకల్యం లేదా క్లిష్ట అనారోగ్యం రైడర్

75 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఐసీ ఐసీ ఐ పృదేంటిల్ I కేర్ II టర్మ్ ప్లాన్

  • వన్ పే ఆప్షన్: 5-10  సంవత్సరాలు
  • రెగ్యులర్ పే: 5-67  సంవత్సరాలు

18-60 సంవత్సరాలు

అందుబాటులో వుంది

  • వన్ పే ఆప్షన్: 65  సంవత్సరాలు
  • రెగ్యులర్ పే ఆప్షన్ I  : 85  సంవత్సరాలు
  • రెగ్యులర్ పే ఆప్షన్ II  : 80  సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఇండియా ఫస్ట్ ఎనీ టైం టర్మ్ ప్లాన్

5-40 సంవత్సరాలు

18-60 సంవత్సరాలు

వర్తించదు

70 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఎల్ ఐ సి టెక్ టర్మ్ ప్లాన్

10-40 సంవత్సరాలు

18-65 సంవత్సరాలు

అందుబాటులో వుంది

గరిష్టం 80 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

మాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ఆన్ లైన్

40 సంవత్సరాలు

--

ప్రమాదాల కవరేజి

గరిష్టం 85 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

పి ఎన్ బి మెట్ లైఫ్ మేరె టర్మ్ ప్లాన్

10-81 సంవత్సరాలు

18-65 సంవత్సరాలు

ప్రమాదాల వలన మరణం/వైకల్యం కవరేజి, క్లిష్ట ఆరోగ్య సమస్యలు, జాయింట్ లైఫ్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్ నెస్ రైడర్.

గరిష్టం 99 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఆన్ లైన్ టర్మ్ ఇన్సూరెన్సు

10-35 సంవత్సరాలు

18-55 సంవత్సరాలు

అందుబాటులో వుంది

కనిష్టం:    28 సంవత్సరాలు

గరిష్టం : 75 సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు  ఈ షీల్డ్ టర్మ్ ప్లాన్

లెవెల్ కవర్: 5 నుండి 80 సంవత్సరాలు

లెస్ ఎంట్రీ ఏజ్ ఇంక్రీసింగ్ కవర్: 10-75  సంవత్సరాలు  లెస్ ఎంట్రీ ఏజ్

18  సంవత్సరాలు మరియు 65 సంవత్సరాలు (లెవెల్ కవర్) 60  సంవత్సరాలు (ఇంక్రీసింగ్ కవర్)

ప్రమాదాల వలన మరణం/వైకల్యము రైడర్

80 సంవత్సరాలు (లెవెల్ కవర్) 75  సంవత్సరాలు (ఇంక్రీసింగ్ కవర్)

ఇప్పుడు దరఖాస్తు చేయండి

స్టార్ట్ యూనియన్ డా-ఇచి ప్రీమియర్ ప్రొటెక్షన్ ప్లాన్

10-30 సంవత్సరాలు

18-60 సంవత్సరాలు

ప్రమాదాల వలన మరణం, శాశ్వత పూర్తి/ పాక్షిక వైకల్య ప్రయోజన రైడర్

70  సంవత్సరాలు

ఇప్పుడు దరఖాస్తు చేయండి

విశేష సూచన: పాలసీ బజార్ ఎటువంటి భీమా సంస్థ కు గానీ అవి అందించే ఉత్పత్తులకు  గా నీ సిఫార్సు, రేటింగ్ ఇవ్వడం గానీ లేదా ఆమోదించడం గానీ చేయదు.

ఏగొం లైఫ్ ఐ టెర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్

మీరు ఈ రూ.1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కొనుగోలుచేసినట్లైతే, 100 సంవత్సరాల వయసు వరకూ లైఫ్ కవర్ పొందవచ్చు:

  • దీనిలో లైఫ్ ప్రొటెక్ట్, ప్రొటెక్ట్ ప్లస్ మరియు డ్యూయల్ ప్రొటెక్ట్ అనే మూడు రకాలైన ఇన్సూరెన్సు ప్లాన్ లు లభ్యమవుతున్నాయి.  
  • ఒక వేళ మీరు లైఫ్ ప్రొటెక్ట్ ప్లాన్ ను ఎంచుకున్నట్లైతే, లైఫ్ కవర్ జీవితం లోని వివిధ దశల్లో ఎదురయ్యే మరణాంతక మైన వ్యాధులనుండి రక్షిస్తుంది.  
  • ప్రొటెక్ట్ ప్లస్ లైఫ్ కవర్ ఎంచుకున్నట్లైతే అదనపు ప్రీమియం చెల్లించనవసరం లేకుండానే ప్రతీ సంవత్సరమూ 5% మరణాంతక మైన వ్యాధులనుండి అదనపు కవరేజి కోసం పెంచబడుతుంది. 
  • డ్యూయల్ ప్రొటెక్ట్ ప్లాను మీ లైఫ్ కవరేజీ తో పాటు, మరణాంతక రోగాలకు రక్షణ మరియు 60 సంవత్సరాల వయసు దాటిన తరువాత నెల వారీ చెల్లింపులు చేయబడతాయి.  
  • ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క విశిష్టత ఏమిటంటే పాలసీ కాలవ్యవధి లో ఆరోగ్య కరమైన జీవిత విధానాన్ని, పొగత్రాగడం వంటికి అలవాట్లకు దూరం అవడం వల్ల కొన్ని బహుమతులు కూడా పొందవచ్చు.  దీనికి జీవించి ఉండటం వల్లన లభించే సర్వైవల్ బెనిఫిట్ కూడా లైఫ్ ప్రొటెక్ట్ మరియు ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ లలో లభిస్తాయి.

ఆవియా ఐ-లైఫ్ టోటల్ ప్లాన్

ఆవియా ఐ-లైఫ్ టోటల్ ప్లాన్ యొక్క కనిష్ట హామీ మొత్తం రూ. 50 లక్షలు మరియు గరిష్ట హామీ మొత్తానికి హద్దులు ఏమీ లేవు.  ఈ రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ సరసమైన ప్రీమియం లలో లభిస్తుంది.  ఈ ప్లాన్ యొక్క ముఖ్యమైన లక్షణాలను ఇప్పుడు చూద్దాం:

  • ఆవియా ఐ-లైఫ్ టోటల్ ప్లాన్ మూడు రకాలైన ప్లాన్  లను కలిగి ఉంది.
  • ప్రొటెక్ట్ ప్లాన్ డెత్ కవర్ తో బాటు మరణాంతక వ్యాధుల నుండి కవర్ చేస్తుంది
  • ప్రొటెక్ట్ అస్సురెడ్:  మరణాంతరం హామీ మొత్తం/ జీవించి ఉంటే మెచ్యూరిటీ వరకూ చెల్లించిన ప్రీమియం కు 120 % 
  • ప్రొటెక్ట్ ప్లస్: ప్రమాదం వలన జరిగే మరణ పరిహారం తో బాటు హామీ మొత్తానికి రెట్టింపు మొత్తం.
  • ప్రొటెక్ట్ ఇన్కమ్: మరణించిన తరువాత ఆధారపడి జీవిస్తున్నవారికి నెలసరి ఆదాయం 
  • ప్రవేశానికి కనీస వయస్సు 18  సంవత్సరాలు
  • ప్రొటెక్ట్ ప్లస్ మరియు ప్రొటెక్ట్ ఇన్కమ్ ఆప్షన్ లకు ప్రవేశానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు 
  • ప్రొటెక్ట్ అస్సురెడ్ ప్లాన్  రకంలో  ప్రవేశానికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు 
  • క్లిష్ట అనారోగ్యం, వైకల్య రైడర్ లు జత లేకుండా  గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75  సంవత్సరాలు.  రైడర్ ప్రయోజనాల తో కలిపి  గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70  సంవత్సరాలు ఉంటుంది.  

బజాజ్ అల్లియంజ్ ఐ సెక్యూర్ టర్మ్ అసురన్సు ప్లాన్

  • ఇది ఒక రూ. 1 కోటి కన్నా ఎక్కువ హామీ మొత్తాన్ని అందించే  నాన్-పార్టిసిపేటింగ్ టర్మ్ అసురన్సు ప్లాన్.  ఈ టర్మ్ ప్లాన్ అందించే అపూర్వమైన లక్షణాలను కొన్నింటిని క్రింద ఇవ్వబడ్డాయి.  ఇవి మూడు రకాలైన ప్లాన్లు.  బేసిక్ లైఫ్ కవర్, నెలవారీ ఆదాయం తో కూడిన బేసిక్ లైఫ్ కవర్ మరియు బేసిక్ లైఫ్ కవర్ తో పాటు పెరుగుతూ ఉండే  నెలవారీ ఆదాయం.
  • ఈ ప్లాన్ జీవనశైలి ని అనుసరించి వివిధ రకాలైన ప్రీమియం రేట్ లను కలిగి ఉంటుంది; కనీస హామీ మొత్తం రూ. 20  లక్షలు గల ప్లాన్ ప్రిఫర్డ్ నాన్-స్మోకర్, నాన్-స్మోకర్ & స్మోకర్ కేటగిరీ లు కలిగి ఉంది.  
  • ఈ ప్లాన్ ను కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 60 సంవత్సరాలు. 
  • దీనికి కనీస మెచ్యూరిటీ వయస్సు 28 సంవత్సరాలు, గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70   సంవత్సరాలు.
  • అంతే కాక, దీనికి కొన్ని రకాల ఆక్సిడెంటల్ డెత్  రైడర్ , ప్రీమియం మాఫీ, ప్రమాదాల వలన శాశ్వత మొత్తం/పాక్షిక వైకల్య ప్రయోజనం వంటి రైడర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.  
  • కానీ, ఈ ప్లాన్ మెచ్యూరిటీ/సరెండర్ బెనిఫిట్స్ ను అందించదు.

హెచ్ డి ఎఫ్ సి లైఫ్ క్లిక్ 2  ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్

  • ఈ ఆన్ లైన్ టర్మ్ ప్లాన్ మీ ప్రియమైన వారి కి ఆర్ధిక స్వాతంత్య్రాన్ని అందజేస్తుంది. ఈ రూ. 1  కోటి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ యొక్క ఉపయోగకరమైన అంశాలలను గమనించండి.  ఈ పాలసీ కాల వ్యవధి 10 సంవత్సరాలనుండి 40 సంవత్సరాలు ఉంటుంది.
  • ఇది నాలుగు రకాలైన ప్లాన్ లను కలిగిఉంది -  లైఫ్, ఎక్స్ట్రా లైఫ్, ఇన్కమ్ మరియు  ఇన్కమ్ ప్లస్ ఆప్షన్. 
  • ఈ ప్లాన్ ను తీసుకోవడానికి  కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 65 సంవత్సరాలు.
  • ఈ  1  కోటి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ యొక్క  మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు.  
  • మీ టర్మ్ ప్లాన్ కు క్లిష్ట అనారోగ్యం, ప్రమాదాలవలన కలిగిన అంగవైకల్యం వంటి  కవరేజీ కోసం రైడర్ బెనిఫిట్ లను కూడా జత చేసుకో వచ్చును.  
  • మీరు సింగల్ ప్రీమియం లేదా సాధారణ ప్రీమియం చెల్లింపు పద్దతులను ఎంచుకోవచ్చు.  

ఐసీ ఐసీ ఐ ప్రుడెన్షియల్ ఐ కేర్ II టర్మ్ ప్లాన్

ఈ ఐసీ ఐసీ ఐ ప్రుడెన్షియల్ ఐ కేర్ II టర్మ్ ప్లాన్ అందజేసే రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రయోజనాలు/లక్షణాలు/ అర్హతల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ఈ ప్లాన్ యొక్క కనిష్ట మరియు గరిష్ట ప్రవేశ వయస్సు వరుసగా 18 మరియు 60 సంవత్సరాలు. 
  • గరిష్ట మెచ్యూరిటీ పరిమితి వన్ పే ఆప్షన్ కు 65 సంవత్సరాలు; రెగ్యులర్ పే  ఆప్షన్ I కు 85 సంవత్సరాలు మరియు రెగ్యులర్ పే  ఆప్షన్ II  కు 80 సంవత్సరాలు  కలిగి ఉంది. 
  • రెగ్యులర్ పే మరియు వన్ పే వంటి ప్రీమియం చెల్లించే విధానాలను ఎంచుకోవచ్చు.
  • పాలసీ కాలపరిమి వన్ పే ప్రీమియం విధానానికి 5/10 సంవత్సరాలు మరియు రెగ్యులర్ పే కు 5-67  సంవత్సరరాలు కలిగి ఉంటుంది.  
  • ప్రమాదవశాత్తు మరణించడం వలన అందే డెత్ బెనిఫిట్ ఐ కేర్ II ఆప్షన్ II  అంటే అది హామీ మొత్తానికి సమానం.  
  • ఈ ప్లాన్ మెచ్యూరిటీ బెనిఫిట్ ను అందించదు.  కానీ, మీరు వన్ పే ప్రీమియం పేమెంట్ విధానాన్ని ఎంచుకున్నట్లైతే మీకు సరెండర్ వేల్యూ అందుతుంది.  మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే పాలసీ వివరాలు చూడండి.  

ఎల్ ఐ సి టెక్ టర్మ్ ప్లాన్

రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ కవరేజీ ను అందించే ఈ  ఆన్ లైన్ నాన్-లింక్డ్ ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ లక్షణాలను క్రింద తెలుసుకుందాం:

  • దీనిని తీసుకోవడానికి  కనీస  వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు  65  సంవత్సరాలు, గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 80 సంవత్సరాలు ఉంటుంది.
  • కనీస హామీ మొత్తం రూ. 50  లక్షలు మరియు హామీ మొత్తం గరిష్ట పరిమితి లేదు. అందువల్ల,  రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
  • ఈ ప్లాన్ వివిధ రకాలైన రైడర్ బెనిఫిట్స్ తో కూడి ఉంటుంది మరియు డెత్ బెనిఫిట్ మొత్తాన్ని వాయిదా పద్దతులలో పొందే అవకాశం కూడా ఉంది.  
  • వీటి ప్రీమియం చెల్లించే సమయం లో 30  రోజుల గ్రేస్ పీరియడ్ సదుపాయం కూడా  ఈ ప్లాన్ అందిస్తుంది.  
  • ఈ పాలసీ కాల  వ్యవధి 10  నుండి 40 సంవత్సరాలు ఉంటుందని,  జీవించి ఉండటం వలన కలిగే మెచ్యూరిటీ బెనిఫిట్స్ అందజేయబడవని దయచేసి గమనించాలి.  

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు స్మార్ట్ టర్మ్ ప్లాన్

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు స్మార్ట్ టర్మ్ ప్లాన్ నెలకు రూ. 493 ల ప్రీమియం తో,  రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు  కవరేజీని పొందటానికి అవకాశమిస్తుంది.  రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లక్షణాలను మీకు తెలియజేయడానికి  క్రింద ఇవ్వబడ్డాయి.    

  • ఈ ప్లాన్ ను 85 సంవత్సరాల వయస్సు వరకూ కవరేజీ ని అందజేస్తుంది.
  • ఈ ప్లాన్ ను మనకు కావలసిన విధం గా మరణం, క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు మరియు అంగవైకల్యం వంటి కవరేజీలను అనుకూలించుకోవచ్చు.  
  • పాలసీ కాలవ్యవధి తరువాత జీవించి ఉంటే చెల్లించిన ప్రీమియం తిరిగిపొందే అవకాశం అన్నింటి కంటే ఉత్తమమైన విషయం.
  • ఈ పాలసీ  లో అనుకూలమైన ప్రీమియం పేమెంట్ విధానాన్ని కూడా ఎంచుకొనే సౌలభ్యం ఉంది. 
  • ప్రమాదాల రైడర్ బెనిఫిట్ కూడా లభ్యమవుతుంది.
  • అంతే కాక, డెత్ బెనిఫిట్ చెల్లింపు ను ను ఒకేసారి లేదా నెలవారీ పెరిగే ఆదాయ విధానాల లో ఒక దానిని ఎంచుకోవచ్చు.  

పి ఎన్ బి మెట్ లైఫ్ మేరా టర్మ్ ప్లాన్

  • ఈ  రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు అందించే ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ కవరేజీ ప్రయోజనాలు: దీనికి గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 99  సంవత్సరాలు కలిగి ఉండడమే ఈ టర్మ్ ప్లాన్ కు ఉన్న ప్రత్యేకత.  
  • ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రవేశ వయోపరిమితి కనిష్ట గా 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి 65 సంవత్సరాలు కలిగి ఉంది. 
  • ఈ టర్మ్ పాలసీ కాల వ్యవధి పరిధి 10 మరియు 81 సంవత్సరాలు 
  • ఈ  రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు తో బాటు ఎంచుకోవడానికి అనువుగా ఉండే రైడర్ బెనిఫిట్స్ : ప్రమాదాల వలన కలిగే మరణం, ప్రమాదాల వలన అంగవైకల్యం, తీవ్రమైన అనారోగ్యం, లైఫ్ స్టేజి ప్రొటెక్షన్, క్లిష్ట వ్యాధుల బెనిఫిట్ మరియు జాయింట్ లైఫ్ బెనిఫిట్.  

రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఆన్ లైన్ టర్మ్ ఇన్సూరెన్సు

ఈ రూ. 1  కోటి టర్మ్ ప్లాన్ పొగ త్రాగని వారికి ప్రత్యేక మైన తగ్గింపు ప్రయోజనాలను అందిస్తుంది.  ఈ ఇన్సూరెన్సు సంస్థ దరఖాస్తు దారుని ఇంటివద్దనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే సౌకర్యాన్ని ఇస్తుంది.  కొన్ని ముఖ్య లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ఈ పాలసీ కాల వ్యవధి 10 నుండీ 35 సంవత్సరాలు ఉంటుంది 
  • ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రవేశ వయోపరిమితి కనిష్ట గా 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి 55 సంవత్సరాలు కలిగి ఉంది.   
  • ఈ ప్లాను కనీస మెచ్యూరిటీ వయస్సు 28 సంవత్సరాలు , గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు.

ప్రీమియం మొత్తం, టర్మ్ ఇన్సూరెన్సు కాల వ్యవధి సమానం గా ఉంటుంది మరియు  ప్రీమియం సంవత్సరానికి ఒక సారి చెల్లించాల్సి ఉంటుంది.  

ఎస్ బి ఐ ఇన్సూరెన్సు ఈ షీల్డ్ టర్మ్ ప్లాన్

ఈ సంప్రదాయ ప్రొటెక్షన్ ప్లాన్ రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు కవరేజీ తో పాటు ఈ క్రింది ప్రయోజనాలను కూడా అందిస్తుంది:

  • ఇది రెండు ప్లానుల రూపం లో దొరుకుతుంది: ఇందులో లెవెల్ కవర్ బెనిఫిట్ అనే ప్లాన్ లో హామీ మొత్తం పాలసీ వ్యవధి మొత్తం ఒకే లా ఉంటుంది.  ఇక ఇంక్రీసింగ్ కవర్ బెనిఫిట్ లో హామీ మొత్తం ప్రతీ 5 వ పాలసీ వ్యవధి లో 10 % వృద్ధి ఉంటుంది.  
  • మీకు డెత్ బెనిఫిట్ తో పాటు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణను ఇస్తుంది.  
  • దీనితో పాటు రెండు రకాలైన రైడర్ లను ఎంచుకోవచ్చు: ప్రమాదాల వలన మరణం మరియు ప్రమాదాల వలన కలిగిన శాశ్వత పూర్తి అంగవైకల్యం డెత్ బెనిఫిట్ రైడర్.
  • ఈ  రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 65 సంవత్సరాలు.(లెవెల్ కవర్ కు ) /60 సంవత్సరాలు (ఇంక్రీసింగ్ కవర్).   
  • దీనికి  గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 80  సంవత్సరాలు (లెవెల్ కవర్) మరియు  75  సంవత్సరాలు (ఇంక్రీసింగ్ కవర్).

రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను ఎవరు ఎంపిక చేసుకోవాలి?

వయస్సు పెరుగుతున్న కొద్దీ,  పాలసీ ప్రీమియం ధర పెరుగుతుంది కాబట్టీ దరఖాస్తు దారుడు ముందుగా కొనుగోలు చేయాలి.   మీ పై ఆధారపడి ఎవరైనా కుటుంబంలో జీవిస్తూ ఉంటే, రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకోవడం అర్ధవంతమైన నిర్ణయం.  రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం ధరను తెలుసుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం క్యాలిక్యులేటర్ ని ఉపయాగించవచ్చు.

రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కవరేజి మొత్తం మీ అవసరాలకు సరిపోతుందా లేదా అని సులభం గా సరి చూసుకోవడానికి ఒక సూత్రము క్రింద ఇవ్వబడింది.  

టర్మ్ ఇన్సూరెన్సు హామీ మొత్తం = [కుటుంబ జీవిత కాల ఖర్చులు (ద్రవ్యోల్భణాన్నిఅనుసరించి లెక్కించిన  సంవత్సర ఖర్చులు) + భవిషత్ లక్ష్యాలను సాధించడానికి అయ్యే ఖర్చులు + అప్పులు/రుణాలు] - పొదుపులు.

రూ. 2  కోటి టర్మ్ ఇన్సూరెన్సు లను అందించే ప్లాన్ లను సరిపోల్చే విధానం

చాల భీమా సంస్థలు రక రకాలైన రూ. 1  కోటి  లేదా అంతకంటే ఎక్కువ హామీ మొత్తం కలిగిన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తున్నాయి. పూర్వం  రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల ప్రీమియం ధర చాలా ఎక్కువ గా ఉండేది.  కానీ ఐ ఆర్ డి ఏ క్రొత్తగా జరీ చేసిన నియంత్రణల తరువాత ఇన్సూరెన్సు సంస్థలు రూ. 1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం ధర లను  భారీగా తగ్గించి వేసాయి.   ప్రైవేట్ భీమా సంస్థలు అయినా ఐసీ ఐసీ ఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్ డి ఎఫ్ సి స్టాండర్డ్ లైఫ్, బిర్లా సన్ లైఫ్ లు సైతం అతి తక్కువ ప్రీమియం ధరలను అందిస్తున్నాయి.  వివిధ టర్మ్ ఇన్సూరెన్సు కంపెనీలను సరిపోల్చేముందు పూచీకత్తు నిబంధనల ను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే తక్కువ ప్రీమియం ధరలు కలిగిన పాలసీ లు ఖఠినమైన నియమాలను కలిగి ఉంటాయి.

కొన్ని ఆఫ్ లైన్ టర్మ్ ప్లాన్ లు కూడా ఉంటాయి.  టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు రైడర్స్ ను జత చేసుకొనే క్రమం లో తేడాలను కలిగి ఉంటాయి. 

రూ. 3 అన్నింటి కంటే సరైన టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ఏది?

మీ కుటుంబం లో సంపాదించే వ్యక్తి మీరు ఒక్కరే అయినట్లైతే,  మీ అకాల మరణం వలన   ఆర్ధిక బాధలనుండి రక్షించడానికి సరైన ఆర్ధిక కవరేజీ ని మీ కుటుంబానికి అందించడం చాల ముఖ్యము.  1  కోటి టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ను ఎంచుకోవడం గమ్మత్తుగా అనిపించినా పైన ఇచ్చిన సూత్రాన్ని ఉపయోగించి సరైన కవరేజీ మొత్తాన్ని సులభం గా పొందవచ్చు.  మీరు పాలసీ ల ప్రయోజనాలు,  చేరికలూ మరియు మినహాయింపులను జాగ్రత్తగా తెలుసుకోవాలి.  ప్రీమియం ధరలు చాల ముఖ్యమే అయినప్పటికీ, అదొక్కటే పాలసీ తీసుకోవడానికి కారకం కాకూడదు.  మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడే మంచి టర్మ్ ప్లాన్ ని ఎంచుకోండి.  టర్మ్ ఇన్సూరెన్సు రైడర్స్ ను, ముఖ్యం గా భీమా సంస్థ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ను తెలుసుకోండి.  ఇది మీ పనిని మరింత సులభతరం చేస్తుంది.  


Premium By Age

Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by any insurer. This list of plans listed here comprise of insurance products offered by all the insurance partners of Policybazaar. For a complete list of insurers in India refer to the Insurance Regulatory and Development Authority of India website, www.irdai.gov.in



Choose Term Insurance Plan as per you need

Plans starting from @ ₹473/Month*
Term Insurance
1 Crore Term Insurance
Term Insurance
2 Crore Term Insurance
Term Insurance
4 Crore Term Insurance
Term Insurance
5 Crore Term Insurance
Term Insurance
6 Crore Term Insurance
Term Insurance
7 Crore Term Insurance
Term Insurance
7.5 Crore Term Insurance
Term Insurance
8 Crore Term Insurance
Term Insurance
9 Crore Term Insurance
Term Insurance
15 Crore Term Insurance
Term Insurance
20 Crore Term Insurance
Term Insurance
25 Crore Term Insurance
Term Insurance
30 Crore Term Insurance
Term Insurance
15 Lakh Term Insurance
Term Insurance
60 Lakh Term Insurance

Term insurance Articles

  • Recent Article
  • Popular Articles
23 Dec 2024

HDFC టర్మ్...

HDFC లైఫ్ ఇన్సూరెన్స్

Read more
23 Dec 2024

ICICI Pru iProtect స్మార్ట్...

ICICI ప్రుడెన్షియల్

Read more
17 Dec 2024

అవివా టర్మ్...

అవివా జీవిత బీమా ఒక

Read more
10 Dec 2024

బజాజ్ అలయన్జ్...

బజాజ్ అలయన్జ్

Read more
09 Dec 2024

కెనరా HSBC టర్మ్...

తెలియని చాలా మందికి, ఈ

Read more

టర్మ్ ఇన్సూరెన్స్...

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక రకమైన

Read more

LIC టర్మ్...

ఎల్‌ఐసి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు బీమా

Read more

రూ. 1 కోటి కవర్ కోసం...

ఏదైనా బీమా పాలసీని మూల్యాంకనం

Read more
Need Help? Request Callback
top
View Plans
Close
Download the Policybazaar app
to manage all your insurance needs.
INSTALL