ఉదాహరణకు, ఎల్ఐసీ వారి అధికారిక వెబ్ సైటులో దాని స్వంత కాలిక్యులేటర్ను కలిగిఉంది. సాధారణంగా, మీరు జీవిత బీమా కాలిక్యులేటర్లో క్రింద పేర్కొన్న అవసరమైన సమాచారాన్ని పూరించాలి:
- పాలసీ పేరు
- పాలసీదారుడి వయస్సు
- హామీ ఇచ్చిన మొత్తం
- ప్రీమియం ఫ్రీక్వెన్సీ
- పదవీ కాలం
- యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్స్, ఏదైనా ఉంటే
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ను ఎలా ఉపయోగించాలి?
బీమా పధకం యొక్క ప్రీమియంను లెక్కించడానికి చాలా మంది ఇవిత బీమా ప్రీమియం కాలిక్యులేటర్లను ఈ క్రింది స్టెప్స్ లో అనుసరిస్తారు:
దశ 1: కాబోయే పాలసీ కొనుగోలుదారు ఈ క్రింది వివరాలను నమోదు చేయాలి:
- దరఖాస్తుదారుడి వయస్సు
- దరఖాస్తుదారుడి లింగం
- దరఖాస్తుదారుడి పిల్లల సంఖ్య
- దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం
- దరఖాస్తుదారుడి వైవాహిక స్థితి
దశ 2: పాలసీ కొనుగోలుదారు పాలసీ నుండి అతని/ఆమె అంచనాలను నమోదు చేయాలి:
- పాలసీ యొక్క రకం లేదా పేరు
- పదవీ కాలం లేదా ప్రీమియం చెల్లింపు నిర్ణీత కాలం
- కావలసిన మొత్తం హామీ
- అతని/ఆమె బేస్ ప్లాన్ లో చేర్చాలనుకునే అదనపు రైడర్స్
దశ 3: ఫారం నింపడానికి కొద్ది నిముషాలు మాత్రమే పడుతుంది మరియు ఈ వివరాలన్నింటినీ నింపిన తరువాత, అంచనా వేసిన ప్రీమియం ఫిగర్ ప్రదర్శించబడుతుంది.
జీవిత బీమా ప్రీమియం కాలిక్యులేటర్ యొక్క నమూనా
ప్రీమియం యొక్క లెక్కింపు ఒక సంక్లిష్టమైన ప్రక్రియ మరియు కాబోయే కస్టమర్లు దీనిని స్వయంగా చేయలేరు. జీవిత బీమా కాలిక్యులేటర్ ద్వారా ప్రక్రియను అర్ధం చేసుకోవడానికి ఎల్‌ఐసి ప్రీమియం కాలిక్యులేటర్ యొక్క ఉదాహరణను తీసుకుందాం:
చాలా కాలిక్యులేటర్లలో నాలుగైదు ఫీల్డ్లు ఉన్నాయి, అవి మీరు ఎంచుకున్న ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. గరిష్ఠ సంఖ్యలో ఫీల్డ్లను కలిగి ఉన్న కొన్ని ఎండోమెంట్ ప్లాన్ కు ఉదాహరణ తీసుకుందాం.
- ప్లాన్ రకం: కొత్త ఎండోమెంట్ ప్లాన్
- నిర్ణీత కలం: 20 సంవత్సరాలు
- వయస్సు: 38 సంవత్సరాలు
- యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్: అవును
- హామీ ఇచ్చిన మొత్తం: 10 లక్షలు
గమనిక: యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కొన్ని అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాదవశాత్తు మరణానికి అదనపు కవర్ ఇస్తుంది. ఈ రైడర్ ను ఎల్‌ఐసి అందిస్తుంది, ఇతర బీమా సంస్థలు ఈ బీమా రక్షణను అందించకపోవచ్చు.
ఫలితాన్ని చూద్దాం:
- నెలవారీ ప్రీమియం: సుమారు రూ. 4,250
- త్రైమాసిక ప్రీమియం: సుమారు రూ. 12,750
- అర్ధ వార్షిక ప్రీమియం: సుమారు: రూ. 25,235
- వార్షిక ప్రీమియం: సుమారు రూ. 49, 940
లైఫ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ ఉపయోగాలు
- ప్రీమియంలను లెక్కించడానికి సులభమైన మార్గం: ఇది మాన్యువల్ లెక్కింపు యొక్క ఇష్యూ లేకుండా చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని లెక్కిస్తుంది.
- వాస్తవ మొత్తాన్ని లెక్కించడానికి: ఇది అతను/ఆమె జీవితాన్ని కవర్ చేయడానికి చెల్లించాల్సిన ఖచ్చితమైన మొత్తాన్ని లెక్కిస్తుంది. అతను/ఆమె జీవిత కవర్ కోసం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో ఇది ఒక ఖచ్చితమైన ఆలోచనను ఇస్తుంది. తద్వారా అతను/ఆమె ఆర్ధిక ప్రణాళికను జాగ్రత్తగా తాయారుచేసుకోవచ్చు.
- ఎర్రర్ ఫ్రీ: ప్రీమియం లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి అందులో లోపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
- అత్యంత అనుకూలమైన బీమా పాలసీని పోల్చడానికి మరియు ఎంచుకోవడానికి ఒక సాధనం: విభిన్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లను పోల్చడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి. పోలిక ఏది ఎంచుకోవాలి ఏది ఎంచుకోకూడదు అనేదానికి ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఈ విధంగా, అతను/ఆమె తీసుకోవలసిన విధానాల గురించి స్పష్టమైన చిత్రాన్ని పొందుతారు.
- పన్ను ప్రయోజనాలు: మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనం పొందవచ్చు.
జీవిత బీమా ప్రీమియం అంటే ఏమిటి?
జీవిత బీమా ప్రీమియం అనేది జీవిత బీమా పాలసీ దారుడు అతను/ఆమె పాలసీ వైపు చేసే ఒక సమయం లేదా పునరావృత చెల్లింపు. ఏదైనా జివియ్హ బీమా పధకం బీమా ప్రదాత యొక్క మార్గదర్శకాల ప్రకారం మరియు పాలసీదారుడు ప్రీమియంలను సకాలంలో చెల్లిస్తే చెల్లుతుంది. చాలా మంది పాలసీదారులు ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీని వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక మరియు నెలవారీ వంటి ఎంచుకునే ఎంపికను అందిస్తారు. పాలసీ ప్రయోజనాలు సక్రియం అయినప్పుడు పాలసీ దారుడు పొందే మొత్తం ఈ ప్రీమియం యొక్క కారకం.
పాలసీ ప్రీమియం ఎంచుకున్న ప్లాన్ పైన మరియు అతను/ఆమె అధరాలు పైన మారుతుంది మరియు ఆధారపడి ఉంటుంది. చాలా సార్లు, పెద్దవయస్సు వారితో పోల్చుకుంటే యంగ్ మరియు ఆరోగ్యవంతమైన వ్యక్తి అదే టర్మ్ ప్లాన్ ని తక్కువ ప్రీమియంతో పొందుతారు. అదే పద్ధతిలో, ధూమపానం చేసే వ్యక్తి కంటే ధూమపానం చేయని వ్యక్తికి బెటర్ ప్రీమియం లభిస్తుంది. ఇవి కాకుండా, జీవిత బీమా పధకం యొక్క ప్రీమియాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంన్న అనేక ఇతర వేరియబుల్స్ ఉన్నాయి, మరియు జీవిత బీమా కాలిక్యులేటర్ యొక్క అవసరం చిత్రంలోకి రావడానికి ఇదే కారణం.
జీవిత బీమా ప్రీమియం రేటును నిర్ణయించే అంశాలు
బీమా ప్రీమియం రేటు అంటే లైఫ్ కవర్ కొనడానికి చెల్లించాల్సిన మొత్తం. జీవిత బీమా యొక్క ప్రీమియంను నిర్ణయించే అనేక అంశాలు ఉన్నాయి, అవి:
- పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయాలు: చెల్లించిన ప్రీమియంలు జీవిత బీమా యొక్క క్లెయిమ్లను చెల్లించడానికి ఉపయోగించబడుతున్నందున, ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాలు జీవిత బీమా ప్రదాత యొక్క కోణం నుండి అవసరం.
- మరణాల రేటు: పాలసీదారుడి వయస్సు ఆ వయస్సుకి సంబందించిన మరణాల రేటును నిర్ణయిస్తుంది. పాలసీ యొక్క ప్రీమియం నిర్ణయించడానికి ఇది కీలకమైన కారకాల్లో ఒకటి. చిన్న వయస్సు పాలసీదారుడికి బీమా ప్రొవైడర్లు తక్కువ మొత్తంలో ప్రీమియంను అందించే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం క్లెయిమ్ల యొక్క అవకాశాలు తక్కువ.
- మొత్తం హామీ లేదా కవరేజ్: ఎంత ఎక్కువ హామీ ఇవ్వబడితే, అంత ఎక్కువ ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది.
- ఆరోగ్య రికార్డు మరియు వ్యక్తిగత అలవాట్లు: మధ్యపానం, ధూమపానం మొదలైన అనారోగ్య జీవన శైలి యొక్క ఫలితం ఎక్కువ ప్రీమియం. మరో మాటలో చెప్పాలంటే, మధ్యపానం, ధూమపానం మొదలైన అనారోగ్య అలవాట్లు ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవన శైలిని నడిపించేవారి కంటే ఎక్కువ ప్రీమియం (సుమారు 30 నుండి 70% ఎక్కువ) చెల్లించాలి.