ఇండియా లో ని హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్రకారం, ఒక వేళ పాలసీ దారుడు 100 సంవత్సరాల వయస్సు కన్నా ఎక్కువ కాలం జీవించి ఉన్నట్లైతే, మెచ్యూర్ అయిన కవరేజీ మొత్తం పాలసీ దారునికి మెచ్యూర్ ప్రయోజనం గా అందించబడుతుంది.
ఈ పాలసీ మీరు జీవించి ఉన్నంత కాలం మిమ్మల్ని కవర్ చేస్తుంది. ఇది మొత్తం జీవితం యొక్క రిస్క్ ని కవర్ చేస్తూ ఉండటం వలన, దీనిని పెర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ అని కూడా అంటారు. ఇది లైఫ్ కవర్ మరి బోనస్ లతో ద్వంద్వ ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇన్సూరెన్సు కవరేజీ కోసం మొదటి 10-15 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి మరియు కవరేజీ పాలసీ దారుని మొత్తం జీవిత కాలం వరకూ పెంచబడుతుంది. ఉదాహరణకు, మీరు 30 సంవత్సరాల వయసు గల వ్యక్తి అయి, రూ. 30 లక్షల హామీ మొత్తం గల ఒక హోల్ లైఫ్ ప్లాన్ ను ఎంచుకున్నట్లైతే, మీకు 45 సంవత్సరాల వయస్సు వరకూ ప్రీమియం ను చెల్లించి ఆపివేసినా, డెత్ బెనిఫిట్ కవరేజ్ మాత్రం మీ జీవితాంతం కలిగి ఉంటుంది. ప్రీమియం ను ఒక నియమిత కాలపరిమితి వరకూ చెల్లించాల్సి ఉంటుంది కనుక, ఇది కొంచెం ధర లో ఉంటుంది.
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ఎలా పని చేస్తుంది?
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పొలిసీదారుని మొత్తం జీవితాన్ని కవర్ చేయడానికి ప్రత్యేకం గా తయారుచేయబడిన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాను. దీని వలన ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లైతే ఆర్ధిక భద్రత మరియు భవిష్యత్ ఆర్ధిక సహకారాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది.
ఈ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు డెత్ బెనిఫిట్ తో పాటు మెచ్యూరిటీ మరియు సర్వైవల్ బెనిఫిట్ ను పాలసీ దారునికి అందిస్తుంది. వివిధ లైఫ్ ఇన్సూరెన్సు సంస్థ లు అందిస్తున్న హోల్ లైఫ్ ఇన్సూరెన్సు లలో పాలసీ దారుడు తన అవసరాలకు తగిన ఇన్సూరెన్సు ను ఎంచుకోవచ్చు.
ప్రతీ సంవత్సరం, పాలసీ దారుడు ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. దీనిలో, కొంత భాగం రక్షణను కల్పించడానికి మరియు మరి కొంత భాగం కంపెనీలో పెట్టుబడిగా ను ఉంటుంది. ఒక వేళ లాభాలు ఆర్జిస్తే, పాలసీ దారుడు ఆ పెట్టుబడి మొత్తం ఫై బోనస్ పొందడానికి అర్హుడౌతాడు. ఆ పెరిగిన పెట్టుబడి పాలసీ దారుడు పాలసీ ని ఉపసంహరించుకున్నా లేదా పాలసీ మెచ్యూరిటీ వ్యవధి వరకూ జీవించి ఉన్నా తిరిగి చెల్లించబడుతుంది.
మొత్తానికి, హోల్ లైఫ్ ప్లాన్ లు పూర్తి జీవిత కాలానికి కవర్ అందిస్తూ కొంత మొత్తాన్ని ప్రోగుచేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. దీనిని మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ ఫోలియో లో ఒక భాగం గా చేసుకోవడం మంచిది.
హోల్ లైఫ్ పాలసీ లోని అంశాలు
ఈ పాలసీ పాలసీ దారునికి పూర్తి జీవిత కాలం పాటు కవరేజీ ని అందిస్తుంది. పాలసీ దారుడు మరణించిన తరువాత, ఇన్సూరెన్సు పే అవుట్ నామినీ కి అందచేయబడుతుంది. దీనిలో చాల అంశాలు ఈ క్రింది విధం గా కలిగి ఉన్నాయి:
భీమా చేయబడిన వ్యక్తి కి పాలసీ కాల పరిమితి లో అకాల మరణం సంభవించినట్లైతే, ఆ డెత్ బెనిఫిట్ మొత్తం నామినీ కు చెల్లించబడుతుంది. పాలసీ యొక్క అన్ని ప్రీమియం లు చెల్లించబడి ఉన్నట్లైతే, డెత్ బెనిఫిట్ హామీ మొత్తం రూపం లో పాలసీ లబ్ధిదారునికి ఇన్సూరెన్సు కంపెనీ చెల్లిస్తుంది.
ఈ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ యొక్క ప్రీమియం రేటు మొత్తం పాలసీ కాలవ్యవధి కే నిర్ణయించబడి ఉండటం చేత పాలసీ కాలవ్వ్యవధి ముగిసే వరకూ పాలసీ ప్రీమియం లో హెచ్చు తగ్గులు ఉండవు. అందువలన, ఒక పాలసీ దారుడు రూ. 2500 ప్రీమియం ను నెలకు చెల్లిస్తున్నాడు అనుకుంటే, అతడు/ఆమె అదే ప్రీమియం మొత్తాన్ని పాలసీ కాల పరిమితి వరకూ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్రత్యేకం గా పాలసీ దారుడు మరణించిన తరువాత కుటుంబ సభ్యుల జీవిత సంరక్షణకు వీలుగా ఖచ్చితం గా లభించే బోనస్ ల తో పాటూ హామీ మొత్తం అందించేందుకు తయారు చేయబడింది.
పాలసీ కు చెల్లించిన ప్రీమియం మరియు మెచ్యూరిటీ ఆదాయం లో ఇన్ కం టాక్స్ ఆక్ట్ 1961 సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు.
పాలసీ మూడు సంవత్సరాల కాల వ్యవధి తీరిన తరువాత, పాలసీ దారుడు పాలసీ పై ఋణం పొందవచ్చు.
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ వలన ప్రయోజనాలు
ఇది పాలసీ దారునికి 100 సంవత్సరాల వయస్సు వరకూ డెత్ బెనిఫిట్ కవరేజీ ని అందిస్తుంది. ఇది పాలసీ దారుని మరణం వరకూ రక్షణ కల్పిస్తుంది.
ఇది ఒక కుటుంబానికి మరియు ప్రియమైన వ్యక్తులకు సంపాదించే వ్యక్తి దూరమయినప్పటికీ ఆర్ధిక సంరక్షణను అందిస్తుంది.
పాలసీ మెచ్యూరిటీ సమయం లో పాలసీ దారుడు ఒక పెద్ద మొత్తం మెచ్యూరిటీ ప్రయోజనం గా కలిగి ఉంటే బోనస్ తో పాటు కూడా పొందుతాడు. అంతేకాక, కొన్ని రకాలైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లు మెచ్యూరిటీ మొత్తాన్ని క్రమ ఆదాయ రూపం లో కూడా అందచేస్తుంటాయి. అందువలన, పాలసీ మెచ్యూరిటీ సమయం లో పాలసీ దారుడు తనకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఒక పెద్ద-మొత్తం లో ఒకే సారికావాలో లేదా నిర్ణీత కాల వ్యవధి కలిగిన క్రమ ఆదాయ రూపం లో కావాలో ఎంచుకోవాలి.
పాలసీ దారుడు ఈ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ కి చెల్లించిన ప్రీమియం మొత్తానికి సెక్షన్ 80 సి ప్రకారం పన్ను రాయితీ ని పొందవచ్చు అంతే కాక, మెచ్యూరిటీ క్లెయిమ్ లు కూడా ఇన్ కం టాక్స్ ఆక్ట్ 1961, సెక్షన్ 10(10 డి) ప్రకారం రాయితీ ని కలుగజేస్తాయి.
-
ఆదాయ వనరు గా పనిచేస్తుంది
నిపుణుల సలహా ల ప్రకారం ప్రతీ వ్యక్తీ కొంత సొమ్ము ని జీవితం లో రాబోయే విపత్కర సమయాన్ని ఎదుర్కోవడం కోసం ఆదా చేసుకోవాలి. అయితే, తక్కువ సమయం లో ఎక్కువ మొత్తం ప్రోగు చేయడం సులభం గా జరిగే పని కాదు, కానీ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ సహాయం లో ఇండియా లో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఆర్ధికం గా సురక్షితం గా ఉంచుకోవడమే కాక జీవిత దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా సాధించగలుగుతాడు.
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ 100 సంవత్సరాల వయసు వరకూ రక్షణ కల్పించడం తో పాటు, పాలసీ దారుని కి ప్లాన్ పై ఋణం పొందే సదుపాయం కూడా ఉంది. అయినప్పయికీ, ఋణం పొందడానికి పాలసీ దారుడు ఆ పాలసీ యొక్క అన్ని ప్రీమియం పూర్తిగా చెల్లించి ఉండటమే కాక కనీసం 3 పాలసీ సంవత్సరాల కాలం దాటి ఉండాలి.
-
ప్లాన్ పై ఆధారపడిన వారికి ప్రయోజనాలు
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ అనేది కుటుంబ ఆర్ధిక భద్రత ను కాపాడు కోవడం కోసం ఒక మంచి పెట్టుబడి మార్గము. ఉదాహరణకు, ఒక వ్యక్తి హోల్-లైఫ్ ప్లాన్ ఎంచుకున్నట్లైతే, ఆ వ్యక్తి, మరియు జీవిత భాగస్వామి ఇద్దరూ అదనపు ఆర్ధిక రక్షణను కలిగి రిటైర్మెంట్ సమయం లో రిటైర్మెంట్ ఫండ్ ను పొందగలుగుతారు. ఒక వేళ, ఒక వ్యక్తి మరణించినా, ఆ పాలసీ డెత్ బెనిఫిట్ పాలసీ లభిదారునికి లభిస్తుంది.
అంతేకాక, జీవిత భాగస్వామి యొక్క పాలసీ వారి పిల్లకు భీమా చేసిన వ్యక్తి మరణించిన తరువాత ఆర్ధికం గా దన్ను ను కలుగ చేయటం లో పనిచేస్తుంది. అందువలన, హోల్-లైఫ్ ఇన్సూరెన్సు అనేది సంపదను సృష్టించడానికి, భవిష్యత్తు ప్రణాళిక కు ఒక మంచి మార్గము గా తద్వారా, ఆర్ధిక భద్రతో పాటు మంచి జీవన శైలి ని వారి కుటుంబానికి అందించడానికి ఉపయోగపడుతుంది.
హోల్ లైఫ్ ఇన్సురన్ ప్లాన్ ల లోని రకాలు
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ, భీమా చేయబడిన వ్యక్తి కి మరణం ఎప్పుడు కలిగినా, రక్షణను కల్పించే ఒక లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ. దీనికి అర్ధం, హోల్ లైఫ్ ఇన్సూరెన్సు దృష్టి లో ఒక నిర్దిష్టమైన టర్మ్ లేదు. చాలా రకాలైన పాలసీ లు డివిడెండ్ ను అందజేస్తూ రిటైర్మెంట్ సమయం లో సహాయపడుతుంటాయి. ఈ లైఫ్ పాలసీ లు చనిపోయే వరకూ ఇన్సూరెన్సు ను భీమా చేసిన వ్యక్తికి అందజేస్తూ ఉంటాయి. హోల్ లైఫ్ పాలసీ లను ఈ ఈ విధం గా వర్గీకరణ చేయవచ్చు.
-
నాన్-పార్టిసిపేటింగ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు
ఇది ఫేస్ అమౌంట్ మరియు లెవెల్ ప్రీమియం కలిగిన ఒక లో-కాస్ట్ ఇన్సూరెన్సు ప్లాను. ఇది ఒక నాన్-పార్టిసిపేటింగ్ పాలసీ కావడం చేత, ఈ ప్లాన్ ద్వారా విధమైన డివిడెండ్ లేదా బోనస్ ను పొందే సౌకర్యం లేదు.
-
పార్టిసిపేటింగ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు
నాన్-పార్టిసిపేటింగ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు కు భిన్నంగా, పార్టిసిపేటింగ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ బోనస్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా, చెల్లించ బడిన ప్రీమియం మొత్తం కంపెనీ చేత పెట్టుబడి పెట్టబడుతుంది; పెట్టుబడుల ద్వారా సంపాదించిన లాభాలు బోనస్ ల రూపం లో భీమా చేయబడిన వ్యక్తి కి చెల్లిస్తుంది.
-
ప్యూర్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు
ఈ ప్లాన్ ప్రకారం, ప్రీమియం లు జీవితాంతం క్రమం తప్పకుండా మరణించే వరకూ చెల్లించ వలసి వస్తుంది. రిస్క్ ప్రయోజనం జీవితం మొత్తానికి మరియు హామీ మొత్తం పాలసీ దారుడు మరణించిన తరువాత చెల్లించబడుతుంది.
-
లిమిటెడ్ పేమెంట్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు
ఈ ప్లాన్ ప్రకారం, ప్లాన్ కాల వ్యవధి వరకూ పాలసీ దారుడు ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లించ వలసి ఉంటుంది. పాలసీ మొత్తం కాల వ్యవధి వరకూ పాలసీ ప్రీమియం స్థిరం గా ఉంటుంది.
దీనిలో పాలసీ దారుడు ఒక నిర్దిష్టమైన సంవత్సరాల వరకూ లేదా అతడు/ఆమె ఒక నిర్దిష్టమైన వయస్సుకు చేరినంత వరకూ పాలసీ ప్రీమియం లు చెల్లిస్తూ ఉండాలి. రిస్క్ కవర్, భీమా చేసిన వ్యక్తి జీవితం మొత్తానికి ఉంటుంది.
-
సింగల్ ప్రీమియం హోల్ లైఫ్ ఇన్సూరెన్సు
ఈ ప్లాన్ ప్రకారం, పాలసీ యొక్క ప్రీమియం మొత్తం ఒకే సారి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం, ఒక పెద్ద మొత్తం తప్పని సరిగా అందే హామీ మొత్తం రూపం లో పాలసీ లబ్ధిదారునికి అందజేయబడుతుంది.
ఇండియా లో ఉత్తమ మైన హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీలు
ప్లాన్ లు
|
ప్రవేశ వయస్సు (కనిష్టం నుండి గరిష్టము)
|
మెచ్యూరిటీ వయస్సు
|
పాలసీ పరిమితి
|
హామీ మొత్తం
|
ఏగొం లైఫ్ గారంటీడ్ ఇన్కమ్ అడ్వాంటేజ్ ఇన్సూరెన్సు ప్లాన్
|
20-55 సంవత్సరాలు
|
85 సంవత్సరాలు
|
85-ఎంట్రీ వయస్సు
|
కనిష్టం- రూ. 1,00,000
గరిష్టము - పరిమితి లేదు
|
హెచ్ డి ఎఫ్ సి లైఫ్ సంపూర్ణ సంవృద్ధి ప్లస్
|
30-60 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
15-40 సంవత్సరాలు
|
కనిష్టం- రూ. 65,463
గరిష్టము - పరిమితి లేదు
|
ఐ డి బి ఐ ఫెడరల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు
|
18-55 సంవత్సరాలు
|
100 సంవత్సరాలు
|
100 సంవత్సరాలు
|
కనిష్టం- ఎంట్రీ వయస్సు మరియు పి పి టి పై ఆధార పడి.
గరిష్టము - పరిమితి లేదు
|
ఇండియా ఫస్ట్ సి ఎస్ సి శుభ లాబ్ ప్లాన్
|
18-55 సంవత్సరాలు
|
65 సంవత్సరాలు
|
10 లేదా 15 సంవత్సరాలు
|
పాలసీ దారుని వయస్సు పై ఆధారపడి
|
కోటక్ ప్రీమియర్ లైఫ్ ప్లాన్
|
3 -8 సంవత్సరాలు
పి పి టి- 55 సంవత్సరాలు
12- సంవత్సరాల కోసం
పి పి టి- 53
15- సంవత్సరాల కోసం
పి పి టి- 50 సంవత్సరాలు
20- సంవత్సరాల కోసం
పి పి టి- 45 సంవత్సరాలు
|
99 సంవత్సరాలు
|
99 సంవత్సరాలు లెస్ ఎంట్రీ వయస్సు
|
కనిష్టం (మెచ్యూరిటీ సమయం లో) - రూ. 2,00,000
|
మాక్స్ లైఫ్ హోల్ లైఫ్ సూపర్
|
18-50 సంవత్సరాలు
|
100 సంవత్సరాలు
|
100 సంవత్సరాలు వయస్సు వరకూ
|
కనిష్టం- రూ. 50,000
గరిష్టము - పరిమితి లేదు
|
పి ఎన్ బి మెట్ లైఫ్ హోల్ లైఫ్ వెల్త్ ప్లాన్
|
30 - 65 సంవత్సరాలు
|
99 సంవత్సరాలు
|
99 సంవత్సరాలు
|
హామీ మొత్తం గణాంకాలు
ఎంట్రీ ఏజ్ 45 సంవత్సరాల కన్నా తక్కువ అయితే 0.5 * (70 - ఎంట్రీ వయస్సు), కనీసం 10 ఉండాలి.
ఎంట్రీ ఏజ్ 45 సంవత్సరాల కన్నా ఎక్కువ అయితే 0.25 * (70 - ఎంట్రీ వయస్సు), కనీసం 7 ఉండాలి.
|
ప్రమెరికా సహజ సురక్ష
|
18- 50 సంవత్సరాలు
|
75 సంవత్సరాలు
|
15 మరియు 20 సంవత్సరాలు
|
కనిష్టం- రూ. 1,00,000
గరిష్టము - పరిమితి లేదు
|
రిలయన్స్ లైఫ్ లాంగ్ సేవింగ్స్
|
15- 30 సంవత్సరాలు
|
70 సంవత్సరాలు
|
15 - 30 సంవత్సరాలు
|
కనిష్టం- రూ. 80,000
గరిష్టము - పరిమితి లేదు
|
ఎస్ బి ఐ లైఫ్ శుభ నివేశ్
|
18- 60 సంవత్సరాలు
|
65 సంవత్సరాలు
|
15 సంవత్సరాలు (100 సంవత్సరాల వరకూ పెంచబడిన లైఫ్ కవర్)
|
కనిష్టం- రూ. 75,000 (x1000/-)
గరిష్టము:
పరిమితి లేదు
|
స్టార్ యూనియన్ దైచిస్ జీవన్ ఆశ్రయ్
|
8- 50 సంవత్సరాలు
|
70 సంవత్సరాలు
|
15 - 25 సంవత్సరాలు
|
కనిష్టం- రూ. 2,00,000
గరిష్టము - రూ. 50,00,000
|
టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్సు ఫార్చ్యూన్ మాక్సిమా
|
30 రోజులు - 60 సంవత్సరాలు
|
100 సంవత్సరాలు
|
100 మైనస్ ఇష్యూ ఏజ్
|
సింగల్ పే - 1.25 రెట్ల సింగల్ ప్రీమియం
లిమిటెడ్ పే - 10*ఏపి లేదా 0.5* పాలసీ టర్మ్ * ఏపి
|
విశేష సూచన: పాలసీ బజార్ ఎటువంటి భీమా సంస్థ కు గానీ అవి అందించే ఉత్పత్తులకు గా నీ సిఫార్సు, రేటింగ్ ఇవ్వడం గానీ లేదా ఆమోదించడం గానీ చేయదు.
ఈ ప్లాన్ రిటైర్మెంట్ అయినా తరువాత కూడా మంచి సుఖవంతమైన జీవితాన్ని పొందటానికి అవకాశమిస్తుంది. పాలసీ కాలం ముగిసిన తరువాత పాలసీ దారుడు గారంటీడ్ ఇయర్ లీ పే అవుట్ లు పొందుతాడు. ఈ ప్లాన్ అందించే అదనపు రైడర్ ప్రయోజనాలు కొన్ని అవసరాలకు తప్పక ఉపయోగపడుతుంది.
ఈ ప్లాన్ ఎండోమెంట్ మరియు ఎండోమెంట్ హోల్-లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ మధ్య ఎంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. నిర్దిష్టమైన ప్రీమియం కలిగిన ఈ ఎండోమెంట్ పాలసీ, లైఫ్ కవరేజీ ని 100 సంవత్సరాల వయస్సు వరకూ కొనసాగింపు కలుగచేస్తుంది. అదీకాక లైఫ్ కవర్ ప్రయోజనం తో పాటూ ఈ పాలసీ పన్ను ఆదాను ను కూడా అందజేస్తుంది.
ఈ హోల్ లైఫ్ పాలసీ, టర్మ్ లైఫ్ కవరేజీ ని పాలసీ దారునికి 100 సంవత్సరాల వయస్సు వరకూ అందజేస్తుంది. ఈ ప్లాన్ ఆధారంగా, ఆ పెద్ద మొత్తం లో ఒకే సారి పాలసీ దారునికి మెచ్యూరిటీ బెనిఫిట్ రూపం లో పాలసీ కాలం ముగిసిన తరువాత అందజేయబడుతుంది. లైఫ్ ప్రొటెక్షన్ ప్రయోజనం తో పాటు, ఈ ప్లాన్ బోనస్ ను గ్యారంటీడ్ అడిషనల్ బోనస్ లేదా రేవిషనరీ బోనస్ ను కూడా ఉంటే, అందిస్తుంది.
ఈ ప్లాన్ చిన్న మొత్తం లో ఆదా చేస్తూ, చిన్న ప్రీమియం ల సహాయంతో భవిష్యత్తులో కుటుంబాన్ని ఆడుకొనేంత గా పెట్టుబడి చేసే అవకాశం ఇస్తుంది. దీని ద్వారా ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత పార్షియల్ విత్ డ్రాయల్ అవకాశం ద్వారా కొంత సొమ్ము ను తీసుకొనే అవకాశం ఉంది.
-
కోటక్ ప్రీమియర్ లైఫ్ ప్లాన్
ఈ ప్లాన్ ఇన్సూరెన్సు చేసిన వ్యక్తి తమకు కావలసిన విధం గా సుఖాలను పొందడానికి అవకాశం ఇస్తుంది. అంతే కాక, ఇది అంతర్లీనం గా ఒక భాధ్యతను తెలియజేస్తూ తమ కోసం, తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు ను భద్రం గా చూసుకొనేందు కు ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ 99 వ సంవత్సరంవయస్సు వరకూ భద్రతను కలుగ చేస్తుంది. ఒక లిమిటెడ్ ప్రీమియం గల హోల్ లైఫ్ ప్లాన్ ప్రీమియం చెల్లించాల్సిన కాల వ్యవధి దాటినా తరువాత బోనస్ అందుకొనేందు కు ఎంచుకోవచ్చు. ఈ పే అవుట్ లు ముందుగా చేసుకున్న ప్రణాళికలను, నిర్ణయించుకున్న పనులను పూర్తి చేసుకోవడానికి మరియు మీ బంగారు జీవిత కాలాన్ని సంతోషం గా గడపడానికి పనికి వస్తాయి.
ఇది ఒక పార్టిసిపేటింగ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ అంటే జీవిత కాలం మొత్తం 100 సంవత్సరాల వయస్సు వరకూ కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ బోనస్ ప్రయోజనాన్ని కూడా పాలసీ దారుని కి అందజేస్తుంది. ఎక్కువ ఇన్సూరెన్సు కవరేజీ కలిగిన ఈ ఇన్సూరెన్సు ప్లాన్ తమ కుటుంబ సభ్యుల కు మరియు ప్రియమైన వారికీ, భవిష్యత్ ఆర్ధిక అవసరాలకోసం భద్రత కలిగించాలనుకొనే వ్యక్తులకు బాగా తగినది.
-
పి ఎన్ బి మెట్ లైఫ్ హోల్ లైఫ్ వెల్త్ ప్లాన్
ఈ ప్లాన్ క్లిష్ట ఆరోగ్య పరిస్థితులలో కూడా సంపదను ఖచ్చితం గా అందిస్తుంది. ఒక హోల్ లైఫ్ కవర్ అంతరాయం లేకుండా ఒక వ్యక్తి కిఅందజేస్తూ,సంవత్సరాల తరబడి ఆదాచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కొన్ని ఫన్ బూస్టర్ ల సహాయం తో ఒక వ్యక్తి ఫైనాన్సియల్ పోర్ట్ ఫోలియో మేనేజ్ చేయడానికి అనుకూలం గా ఉంటుంది. కొద్దీ పాటి క్లిక్ లతో ఒక కుటుంబ భవిష్యత్తు ఆర్ధిక అవసరాలకు పరిష్కారాన్ని సాధించుకోవడానికి ప్లాన్ ను ఎంచుకోవచ్చు.
ఈ ప్లాన్ మీ ఆర్ధిక స్థితిని అత్యవసర స్థితుల్లో మీ బంగారం లాంటి జీవితం లో చింతలు రాకుండా, పిల్లల చదువులు, వివాహం ఇంకా ఎన్నో విషయాలలో చక్కగా ఉంచడం లో సహాయపడుతుంది. ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ఒక తెలివైన ఎంపిక ; ఎందుకంటే ఒక వేళ ఇన్సూరెన్సు చేసిన వ్యక్తి మరణించిన తరువాత కుటుంబానికి రాబోయే సమయాల్లో కావలసిన ఆర్ధిక ఆసరా కల్పించే కొంత సంపదను సృష్టిస్తుంది.
-
రిలయన్స్ లైఫ్ లాంగ్ సేవింగ్స్
ఈ ప్లాన్ జీవిత కాలం ఆదా చేయడాన్ని ప్రేరేపిస్తూ, సమగ్ర లైఫ్ కవర్ మరియు కొంత సంపదను కుటుంబానికి అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ఒకరి జీవితం లోని ఎప్పటినుండో పధకాలు వేసుకున్న ముఖ్యమైన మైలురాళ్ళు ఇల్లు కొనుగోలు చేయడం, పిల్ల ల భవిష్యత్తు, ఒక విదేశీ కుటుంబ యాత్ర వంటి ఇంకా ఎన్నింటినో సాధించడానికి ఉపయోగపడుతుంది. అయితే, ఇవి సాధించాలంటే ఒక మంచి ఆర్ధిక ప్రణాళిక ఆవసరం. ఈ ప్రణాళిక కుటుంబం అన్నివిధాలా ఊహించని పరిస్థితుల నుండి భద్రత కలిగించి తప్ప కుండా ప్రయోజనాలను పొందటానికి తయారుచేయబడింది.
ఇది పాలసీ దారుని జీవిత కాల లైఫ్ కవర్ ను కలిగిన ఒక నాన్-లింక్డ్ విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ అసురన్సు ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా పాలసీ దారుడు భవిషత్తులో కావలసిన ఆర్ధిక మద్దత్తు కోసం ఆదా చేయడాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ద్వారా ఒక వేళ పాలసీ దారుడు, పాలసీ కాలపరిమితి లో జీవించి వుంటే మెచ్యూరిటీ బెనిఫిట్ తో పాటూ వుంటే బోనస్ ను కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ ఒక వ్యక్తి కి ఉజ్వలమైన భవిషత్తు ను అందిస్తుంది. ఒక వేళ అనిశ్చిత పరిస్థితులలో, ఆదా చేసిన చిన్న చిన్న మొత్తాలు భవిషత్తు లో మానసిక ప్రశాంతతను మరియు ఆర్ధిక ఒత్తిడినుంచి కుటుంబాన్ని దూరం చేస్తూ ఒక మంచి భవిష్యత్తును రాబోయే కాలం లో కల్పిస్తుంది. ఒకే ప్లాన్ వల్ల ఆదా చేయడం తో పాటూ అకాల మరణం వలన సంభవించే సంక్లిష్ట పరిస్థితులనుండి కూడా సమగ్ర ఆర్ధిక భద్రత కల్పిస్తూ సహాయపడుతుంది.
ఈ ప్లాన్ ప్రియమైన వారి ఆర్ధిక భద్రత ను నిశ్చయం గా కాపాడుతూ ప్రతీ ఒక్కరి అవసరాలను సమర్ధవంతం గా తీరుస్తూ ఉండే ఒక నాన్-పార్టిసిపేటింగ్ యూనిట్-లింక్డ్ పాలసీ. ఈ ప్లాన్ ద్వారా మార్కెట్ పెరుగుదల తో పాటూ సంపద పెంపుదలకు సహాయపడుతూ ఉంటుంది. ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం వలన రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల చదువులు వంటి దీర్ఘ-కాల ప్రయోజనాలు సమర్ధవంతం గా సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ఒకరి జీవిత కాల స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి సహాయపడుతుంది.
టర్మ్ ఇన్సూరెన్సు మరియు హోల్ లైఫ్ ఇన్సూరెన్సు మధ్య వ్యత్యాసాలు
టర్మ్ ఇన్సూరెన్సు కొనుగోలు చేయాలా లేక హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలు చేయాలా అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత నిర్ణయం మరియు అది వారి అవసరాలు మరియు ఆర్ధిక లక్ష్యాల పై ఆధారపడి తీసుకోవలసి ఉంటుంది.
అయితే, ఎలాంటి ఆర్ధిక ప్రణాళిక కలిగి ఉన్నా, లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశ్యం లైఫ్ కవరేజీ మాత్రమే. ఇప్పుడు హోల్ లైఫ్ ఇన్సురన్ పాలసీ మరియు టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ల మధ్యగల వ్యత్యాసాలు క్లుప్తం గా అర్ధం చేసుకుందాం.
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ
|
టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ
|
ఇది రెండు రకాల ప్రయోజనాలు ఆదా మరియు భద్రత ను కలిగి ఉంది
|
ఇది ఒక శుద్ధమైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ కావడం వల్ల, డెత్ బెనిఫిట్ తప్ప ఇంకేమీ అదనపు ప్రయోజనాలను కలిగి ఉండదు.
|
పాలసీ దారుడు 100 సంవత్సరాల వయస్సు వరకూ అనువైన కాలపరిమితి ని కలిగి ఉంది . పాలసీ దారుడు 100 సంవత్సరాల వయస్సు కు చేరుకోగానే ప్రయోజనాలు చెల్లించబడతాయి.
|
ఈ పాలసీ నిర్ణీత కాల వ్యవధి కలిగి ఉంటుంది మరియు అదేవిధం గా ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
|
ప్రీమియం లు ప్రొటెక్షన్ ఫండ్ లో మరియు వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టబడతాయి. అందువలన బోనస్ ప్రకటించినప్పుడు పాలసీ దారునికి లాభాలు వస్తాయి.
|
టర్మ్ ఇన్సూరెన్సు కు ఆ అంశం లేదు.
|
ప్రీమియం లు చెల్లిస్తూ ఉండటం వలన ఏర్పడే నిధి నుండి రుణాలు తక్కువ-రేట్లలో పొందే అవకాశం ఉంది. తీసుకున్న ఋణం, హామీ మొత్తం నుండి తగ్గించబడం వల్ల, మీ నుండి సేకరించబడిన వడ్డీ ఇన్సూరెన్సు కంపెనీ తన వద్ద ఉంచుకోవడం వలన, మీ ఇన్సూరెన్సు ప్రీమియం పై దీని ప్రభావం ఉండదు.
|
టర్మ్ ఇన్సూరెన్సు ఆ ప్రయోజనం అందించదు.
|
టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ తో పోలిస్తే హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ప్రీమియం ధర ఎక్కువ గా ఉంటుంది
|
ఒక చిన్న ప్రీమియం మొత్తం చెల్లించడం ద్వారా పొందవచ్చు.
|
పాలసీ కాలపరిమితి అంతా స్థిరమైన ప్రీమియం ను కలిగి ఉంటుంది.
|
ముఖ్యం గా టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ చెల్లింపు సమయం లో డైనమిక్ ప్రీమియం విధానం వర్తిస్తుంది.
|
పాలసీ దారుడు పాలసీ కాలపరిమి అంతా జీవించి ఉన్నట్లైతే, ప్రీమియం తిరిగి చెల్లించబడుతుంది
|
పాలసీ దారుడు మరణిస్తే తప్ప ప్రీమియం తిరిగి చెల్లించబడదు; కేవలం హామీ మొత్తం చెల్లించబడుతుంది.
|
ఇప్పుడు, తమ తమ ప్రాధాన్యతల అనుగుణం గా, లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను ఎంచుకోవచ్చు.
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు రైడర్స్
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ల ను మరింత మెరుగుపరచానికి మరింత అందరికీ అందుబాటులోనికి తీసుకు రావడానికి ఇండియా లో చాల ఇన్సూరెన్సు కంపెనీలు వివిధ రకాలైన రైడర్ బెనిఫిట్ ప్రయోజనాలను ఇస్తున్న్నాయి.
పాలసీ లతో పాటూ ఎంచుకోవడానికి లభించే కొన్ని రైడర్ క్రింద ఇవ్వబడ్డాయి:
ఈ రైడర్ తో, ఒక వేళ పాలసీ దారుడు మరణిస్తే లేదా వైకల్యం కలిగి ఉంటె, మొత్తం జీవిత కాలం లో ఇన్సూరెన్సు ప్రీమియం లు మాఫీ అయిపోతుంది మరియు పాలసీ కాల పరిమితి వరకూ పాలసీ చలామణి లో నే ఉంటుంది.
-
ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్:
ఈ రైడర్ వలన అదనపు ఆర్ధిక ప్రయోజనాలు పాలసీ దారుడు మరణించిన తరువాత నామినీకు కలుగుతాయి. ఆ నామినీ ఆక్సిడెంటల్ బెనిఫిట్ తో పాటు అదనం గా ప్లాను ప్రాధమిక హామీ మొత్తం కూడా అందుకోవచ్చు.
-
పార్షియల్/పెర్మనెంట్ డిసబిలిటీ రైడర్:
ఒక వేళ పాలసీ దారునికి పాక్షిక లేదా పూర్తి వైకల్యం ఒక అనారోగ్యం వల్ల గానీ, ఆక్సిడెంట్ వలన కానీ సంభవిస్తే, ఈ రైడర్ వలన నియమిత కాల-వ్యవధికి లో ఆదాయం లభిస్తుంది. ఈ అందుకొనే సొమ్ము మొత్తము సంభవించిన వైకల్యం ఫై ఆధారపడి ఉంటుంది.
-
క్రిటికల్ ఇల్ నెస్ రైడర్:
ఈ రైడర్ క్లిష్ట ఆరోగ్య సమస్యలు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ తో సహా, గుండె జబ్బులు మొదలైన వైద్య ఖర్చుల కవరేజీ కోసం ఉపయోగపడుతుంది. ఈ జబ్బులు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాన్ని పాక్షికంగా నో లేదా శాశ్వతం గా నో ఆపుతూ ఉంటాయి.
ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ద్వారా, లబ్ధిదారునికి అందించే ప్రయోజనాలను ఒకే-సారి పెద్ద మొత్తం లో అందచేయడం జరుగుతుంది. ఈ రైడర్ ని ఎంచుకోవడం ద్వారా, లబ్ధిదారుడు ఇంస్టాల్ మెంట్స్ ద్వారా గ్యాంటీ ఇన్కమ్ సులువుగా పొందవచ్చు. ఇది పాలసీ దారుడు వారితో లేనప్పుడు కూడా రోజు వారీ ఖర్చులు భరించుకొనేందుకు ఉపయోగపడతాయి.
ఈ రైడర్ ప్రయోజనాలు వివిధ ఇన్సూరెన్సు కంపెనీల మధ్య వ్యత్యాసాలు కలిగి ఉంటాయి. అందువలన, మరింత స్పష్టం గ తెలుసుకొనేందు ఆయా ఇన్సూరెన్సు కంపెనీని సంప్రదించండి.
హోల్ లైఫ్ ఇన్సురన్ పాలసీ ను ఎవరు ఎంచుకోవాలి?
హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ చాలా మంది వ్యక్తులకు అవసరాలకు తగిన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాను. జీతం పొందుతున్న ప్రతీ ఒక్క వ్యక్తి తమ కు ప్రియమైన వ్యక్తులకు మరియు కుటుంబ సభ్యులకూ ఆర్ధిక సురక్షిత ను కల్పించడానికి ఈ ప్లాన్ తప్పక తీసుకోవాలి.
- భవిష్యత్ ఆర్ధిక ఆసరా కోసం ఆదా చేయాలనుకొనే వ్యక్తులకు
- పెట్టుబడి ఫై ఆదాయం తో పాటు టర్మ్ లైఫ్ ప్రయోజనం కోరుకొనే వ్యక్తులకు ఈ ప్లాన్ లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఎంచుకోవడం మంచిది.
- రిటైర్మెంట్ సమయానికి కొంత సంపద ను సమకూర్చుకోవాలనుకుంటారో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఈ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేయాలి.
- ఈ ప్లాన్ పన్ను ఆదా చేయడమే కాకుండా టర్మ్ కవర్ బెనిఫిట్ ని అందించడం వలన ఇది పెట్టుబడి పెట్టడానికి పనికి వచ్చే ఒక మంచి ఎంపిక.
తరుచు గా అడిగే ప్రశ్నలకు సమాధానాలు - హోల్ లైఫ్ ఇన్సూరెన్సు
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ఒక మంచి పెట్టుబడి అవుతుందా?
జవాబు:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ఒక వ్యక్తి తన కుటుంబానికి మంచి మొత్తాన్నిఇవ్వాలి అనుకునేవారికిమంచి పెట్టుబడి అవెన్యూ అవుతుంది. పాలసీ దారుడు మరణించిన లేదా 100 సంవత్సరముల వరకు జీవించి వున్నా సరే ఈ ఇన్సూరెన్సు ప్లాన్ కవరేజ్ ను అందిస్తుంది ఒక పెట్టుబడిదారునిగా విభిన్న పోర్టుఫోలియోలు ఉండడం ముఖ్యం.
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలు చేయడం ఖర్చుతో కూడిన పనా?
జవాబు: హోల్ లైఫ్ పాలసీని కొనుగోలు చేయదలచినప్పుడు మార్కెట్లో అందుబాటులో వున్న వేరే ఇన్సూరెన్సు ప్రొడుక్ట్సను సరి పోల్చుకొని ప్రీమియం మొత్తం మీద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ పాలసీ ని కొనుగోలు చేయడంలోని ముఖ్య ఉద్దేశ్యం సరళమైన ధరలకే అధిక సంపదలను మీ కుటుంబానికి చేకూర్చ గలుగుతారు.
ప్ర:ఏ వయసులో హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలు చేయాలి?
జవాబు:ఆర్థికంగా స్థిరపడినవారు ఎవరైనా సరే ఈ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేయవచ్చు మరియు కనీసం 18 సంవత్సరములు ఉండవలెను, గరిష్ట వయస్సుసుమారు గా 60 నుంచి 65 సంవత్సరముల మధ్యలో ఉండాలి. అయితే, ఒక్కో ఇన్సూరెన్సు కంపెనీ లో ఒక్కో విధం గా ఉండటం చేత ఆయా ఇన్సూరెన్సు కంపెనీల తో తనికీ చేసుకోండి.
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ లేక టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లలో ఏది మంచిది?
జవాబు: టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ మరియు హోల్ ఇన్సూరెన్సు ప్లాన్ రెండింటిలోనూ వాటి -వాటి ప్రయోజనాలు వున్నాయి. రెండిటి లో ఒకటి ఎన్నుకొనుటకు అవసరాలను బట్టి నిర్ణయించుకోవలసి ఉంటుంది. మీకు కావలసిన మరియు అవసరాలను బట్టి మీరు స్పష్టంగా ఉన్నట్టయితే ఏ పాలసీ అయినా మీరు ఎంపిక చేసుకొనవచ్చును
ప్ర:.హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ నగదు విలువగా మారుటకు ఎంత కాలము పడుతుంది?
జవాబు: హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీని నగదు విలువలోకి మారుటకు యెంత టైంఎంత కాలము పడుతుందో తెలుసుకొనుటకు ఇన్సూరెన్స్ కంపెనీలను లేదా ఆర్థిక సలహా దారుడను సంప్రదించవలసి ఉంటుంది. అయితే,ఖాతాలు నగదు విలువలోకి మారుటకు కనీసం 10 సంవత్సరముల కాలం పడుతుంది.
ప్ర:. హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ కాష్ అవుట్ చేసుకోనవచ్చా ?
జవాబు: హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లో పరిమితమైన మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకోవలసి ఉంటుంది. ఐతే ఇది ఎటువంటి పాలసీ ని కొనుగోలు చేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాక ఈ పోలిసీని తేలికగా తీసుకో కూడదు.
ప్ర:.హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లో జీవించి ఉంటే ఏమి జరుగుతుంది?
జవాబు: హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లో పాలసీ దారుడు మరణించిన లేక మెచ్యూరిటీ వయసుకు చేరుకున్నాఈ పాలసీ మెచ్యూరిటీ చెందుతుంది. పాలసీ దారుడు కాల వ్యవధి తరువాత జీవించి వుంటే, ఈ పాలసీ మెచ్యూర్డ్ ఎండోమెంట్ ప్లాన్ గా మారుతుది. ఇలాంటి సందర్భాలలో, పేస్ సమ్ మాత్రం అందుతుంది.
ప్ర: నేను నా టర్మ్ పాలసీ ని హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లోనికి మార్చుకొనగలనా?
జవాబు: చాల వరకు టర్మ్ ఇన్సూరెన్సు పథకాలు మార్చుకొనవచ్చును. ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ నుంచి హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లోనికి మార్చుకోవాలి అనుకుంటే మార్చుకొనవచ్చును. ఐతే హోల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ యొక్క ప్రీమియం మొత్తం ఖరీదైంది.అయితే,ప్రీమియం ను తగిన సమయమునకు చెల్లించవలసి ఉంటుంది.
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ నుండి ఋణము పొందగలనా?
జవాబు: హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లో పాలసీ గడువు కాలం పూర్తి కాని పాలసీ లో ఋణము తీసుకునే అవకాశము కంపెనీ కల్పిస్తుంది. అయితే, ఇన్సూరెన్సు కంపెనీ ను సంప్రదించి నట్లైతే మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మరియు మీకు మరింత చక్కని మార్గాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. .
ప్ర:నా పిల్లల కోసం హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేయవచ్చునా?
జవాబు: ఈ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేయడంలోని ముఖ్య ఉద్దేశ్యంకుటుంబం లోని గడించే వారికి డెత్ రిస్క్ కవరేజ్ ను అందిస్తుంది. మృతువు అనేది ఏ సమయం లో నైనా జరగ వచ్చు. ఇది ఆ కుటుంబాన్ని ఆర్ధిక ఇబ్బందులు మరియు బాధ్యతలు మధ్యకు తీసుకు వెళతాయి.
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ పదవీ విరమణ చేసినవారికి మంచి పెట్టుబడి అవుతుందా?
జవాబు: అవును, ఇది రిటైర్మెంట్ అయ్యేవారికి ప్రీమియం పేమెంట్ టర్మ్ పూర్తి అయ్యాక పాక్షిక ఉపసంహరణకు వీలు పడుతుంది కనుక ఇది ప్రయోజనం కలుగజేస్తుంది. ఈ ఉపసంహరణలు సాధారణం గా బోనస్ లను కలిగి ఉంటాయి కనుక రిటైర్మెంట్ ను ప్లాన్ చేసుకోవడాన్ని ఇది బాగా ఉపయోగపడుతుంది.
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు వయో వృద్దులకు మంచిదేనా?
జవాబు: వయో వృద్దులకు అంతగా సహాయపడక పోవచ్చు. ముందుగా కొనుగోలు చేసుకొనే వారికి పదవీ విరమణ సమయం వచ్చేసరికి ఎక్కువగా సహాయ పడుతుంది.
ప్ర:నేను నా హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలిసీ ని రద్దు చేసుకుంటే ఏమవుతుంది?
జవాబు: హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని రద్దు చేసుకున్నట్లైతే నగదు విలువ తిరిగి చెల్లించబడుతుంది.
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేసినట్లైతే ఎటువంటి కవరేజిని ఎంచుకోవాలి?
జవాబు: హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని కొనుగోలు చేసే ముందు వారి అవసరాలను అంచనా వేసుకోవడం మంచిది.సంవత్సరానికి వచ్చే ఆదాయం కంటే 15 - 20 రెట్లు కవరేజీ ని ఇచ్చే దానిని ఎంచుకుంటే బాగుంటుంది.
ప్ర:హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ తో ఏమైనా రైడర్స్ లభిస్తున్నాయా?
జవాబు: ఇండియాలో వివిధ రకాలైన ఇన్సూరెన్సు కంపెనీలు వేర్వేరు అదనపు రైడర్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. అవి ఇన్కమ్ బెనిఫిట్ రైడర్,క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మొదలైనవి.అన్ని అదనపు రైడర్స్ ను కలపవలసిన అవసరం లేదుకానీ,అవసరాలు మరియు ప్రాధాన్యతను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది.ఈ రైడర్ ఆప్షన్ లు ఇన్సూరెన్సు కంపీనీ ను బట్టీ వేర్వేరు గా ఉంటాయి.
ప్ర. హోల్ లైఫ్ ప్లాన్ పాలసీ నుండి నేను డబ్బు ఉపసంహరించుకోగలనా?
జవాబు: అవును. పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడతాయి.
ప్ర. హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ద్వారా డెత్ బెనిఫిట్ అంటే ఏమిటి?
జవాబు: సాధారణం గా డెత్ బెనిఫిట్ పాలసీ దారుని మరణం తరువాత నామినీ కి చెల్లించబడుతుంది. అదే విధం గా, హోల్ లైఫ్ ఇన్సూరెన్సు లో కూడా పాలసీ దారుని మరణం తరువాత నామినీ కు లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ మొత్తం ఒక పెద్ద మొత్తం లో ఒకే సారి లేదా విడతల ల లో చెల్లించబడుతుంది.
ప్ర. నా వయస్సు పెరుగుతున్న కొద్దీ నా హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుందా?
జవాబు: లేదు, పాలసీ ప్రీమియం పాలసీ వ్యవధి పూర్తి అయ్యే వరకూ మార్పు ఉండదు.
ప్ర: నేను హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ సరెండర్ చేస్తే ఏమి అవుతుంది?
జవాబు: పాలసీ దారునికి సరెండర్ విలువను అందజేస్తారు, ఈ సరెండర్ విలువ ఒక్కో
ఇన్సూరెన్సు కంపెనీ కి ఒక్కో విధం గా ఉంటుంది.
ప్ర: హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ లో ఎర్లీ విత్ డ్రా పొందవచ్చా ?
జవాబు: క్యాష్ వేల్యూ నుండి ఎటువంటి ఉపసంహరణ నూ అనుమతించరు. అయితే, దీని
గూర్చి వివరాలను ఇన్సూరెన్సు కంపెనీ నుండి తనిఖీ చేసుకోవలసి ఉంటుంది.
ప్ర: నేను రిటైర్ అయ్యాక ప్రీమియం ఎలా చెల్లించాలి?
జవాబు: సాధారణం గా రిటైర్ అయ్యాక ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు, ఎందుకంటే రిటైర్ అయ్యే కాలానికి ప్రీమియం చెల్లించాల్సిన వ్యవధి కూడా పూర్తి అయి ఉండవచ్చు.
ప్ర: నా హోల్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ని క్యాష్ వేల్యూ ప్రకారం ఉపసంహరించుకోగలనా?
జవాబు: అవును, క్యాష్ వేల్యూ ప్రకారం ఉపసంహరరించుకుంటే ఇన్సూరెన్సు చెల్లు బాటు అవదు, తద్వారా నామినీ కు డెత్ బెనిఫిట్ చెల్లించబడదు.
ప్ర: పన్ను ప్రయోజనం గా ఎంత సొమ్ము లభిస్తుంది?
జవాబు: ఇన్ కం టాక్స్ ఆక్ట్, సెక్షన్ 80 సి ప్రకారం చెల్లించిన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ ప్రీమియం లకు పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట మొత్తం రూ. 1,50,000 వరకూ ఉంటుంది.