మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విభాగం.
Read More
మాగ్మా హెచ్‌డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ:-
మాగ్మా హెచ్‌డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాకి చెందిన మాగ్మా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పూనావల్ల ఫిన్‌కార్ప్ లిమిటెడ్) మరియు జర్మనీకి చెందిన హెచ్‌డిఐ గ్లోబల్ ఎస్‌ఇ మధ్య జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్‌లో బలమైన అనుభవంతో, ఇన్సూరెన్స్ కంపెనీ దేశంలో అత్యంత శక్తివంతమైన, బాధ్యతాయుతమైన, ప్రాధాన్యత కలిగిన ఇన్సూరెన్స్ కంపెనీగా మారటమే లక్ష్యంగా పెట్టుకుంది.
మాగ్మా హెచ్‌డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ దేశం మొత్తం మీద 130 కన్నా ఎక్కువ బ్రాంచీలను కలిగి ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్ మెదలైన ఇన్సూరెన్సులు ఇందులో భాగంగా ఉన్నాయి.
అనుకోని పరిస్థితుల్లో ఊహించని ప్రమాదాలు జరిగి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేరి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు మానసికంగా కృంగిపోకుండా వాటి నుండి బయటపడే అవకాశం మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల లభిస్తుంది.
ఇన్సూరెన్స్ కంపెనీ దాని పనితనం వల్ల గుర్తింపు పొందడమే కాకుండా అనేక అవార్డులను అందుకుంది. ఇండియా ఇన్సూరెన్స్ అవార్డుల్లో 2020 లో రైజింగ్ స్టార్ కంపనీ ఆఫ్ ది ఇయర్, (BFSI) బి ఎఫ్ ఎస్ ఐ ఎక్సలెన్స్ అవార్డ్ 2020, 2019 లో బెస్ట్ BFSI బ్రాండ్ అవార్డ్ అందుకుంది.
మీకు నచ్చిన మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోండి
₹1లక్ష
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్
₹2లక్ష
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్
₹3లక్ష
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్
₹5లక్ష
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్
₹10లక్ష
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్
₹50లక్ష
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్
మాగ్మా హెచ్ డి ఐ హెల్త్ ఇన్సూరెన్స్ లక్షణాలు మరియు స్పెసిఫికేషన్లు
లక్షణాలు |
స్పెసిఫికేషన్లు |
నెట్‌వర్క్ హాస్పిటల్స్ |
4300+ |
ముందుగా ఉన్న వ్యాధులు వేచి ఉండే కాలం |
3/4 సంవత్సరాలు |
పొందిన దావా నిష్పత్తి (FY 2019-20) |
72.87% |
పునరుద్ధరణ |
జీవితాంతం |
క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి (FY 2020-21) |
94.41% |
హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు:-
హెల్త్ తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఎన్నో. అనారోగ్యం కారణంగానో లేదా అనుకోకుండా జరిగే ప్రమాదాల మూలంగానో హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. అలా హాస్పిటల్ లో చేరక ముందు, చేరిన తర్వాత అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లైమ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు.
హాస్పిటల్ ను బట్టి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రూమ్ రెంట్ కవరేజీ కూడా హెల్త్ ఇన్సూరెన్సులో ఒక భాగం. నగదు రహిత లావాదేవీలు. అంటే డబ్బు అవసరం లేకుండా వైద్యాన్ని పొందే సౌకర్యం మనకు ఉంటుంది. మాగ్మా హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోని హాస్పిటల్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ముందుగా చేతిలో డబ్బు లేదని భయపడకుండా ఈ క్యాష్ లెస్ విధానం ఎంతగానో ఉపయోగడుతోంది.
వార్షిక హెల్త్ చెకప్లు చేయించుకునే సదుపాయం ఉంటుంది. అంబులెన్స్ ఛార్జీలు కూడా కవర్ చేయబడతాయి. మానసిక వ్యాధులకు చికిత్స, క్లిష్టమైన అనారోగ్య సమస్యలకు చికిత్స పొందే అవకాశం ఉంటుంది. మీరు తీసుకొనే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానును బట్టి మీరు పొందే ప్రయోజనాలు ఉంటాయి.
ముందుగా వైద్యం చేయించుకొని, తర్వాత క్లైమ్ చేసుకోవచ్చు. లేదా ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని హాస్పిటల్లో చేరి, డబ్బు అవసరం లేకుండా వైద్యాన్ని పొందచ్చు. ఇంటిలో ఉండి చూపించుకోవడం, ఆయుష్ వైద్య చికిత్స కూడా ఇందులో కవర్ అవుతాయి.
తీసుకునే పాలసీని బట్టి హెచ్ ఐ వి (HIV), కరోనా వైరస్ వంటి వ్యాధులకు కూడా చికిత్స చేయించుకునే సదుపాయం ఉంటుంది. ఇంకా ఎన్నో ఇతర వ్యాధులు, అనారోగ్య పరిస్థితులకు చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
40 ఏళ్ల లోపు ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎర్లీ జాయినింగ్ బెనిఫిట్స్ కింద అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీకు కావాల్సిన విధంగా తగిన పాలసీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అవసరం అయినప్పుడు వెంటనే క్లైమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
కంపెనీ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులు:-
- మాగ్మా హెచ్ డి ఐ వన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్.
- మాగ్మా హెచ్ డి ఐ ఇండివిజువల్ పర్సనల్ ఏక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్.
- మాగ్మా హెచ్ డి ఐ ఆరోగ్య సంజీవని ప్లాన్.
- మాగ్మా హెచ్ డి ఐ కరోనా కవచ్ ప్లాన్.
-
వన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబం మొత్తానికి వైద్యం అందించడానికి గల కవరేజీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ సపోర్ట్, సెక్యూర్, సపోర్ట్ ప్లస్, షీల్డ్ మరియు ప్రీమియం అనే ఐదు వేరియంట్‌లతో వస్తుంది.
ముఖ్య లక్షణాలు & ప్రయోజనాలు:-
- హాస్పిటల్ లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు
- మానసిక రుగ్మతలు, IVF, ఆదాయ ప్రయోజనం కోల్పోవడం, HIV/AIDS మొదలైన వాటికి ప్రత్యేక కవర్లు అందుబాటులో ఉన్నాయి.
- క్లైమ్ హిస్టరీతో సంబంధం లేకుండా వార్షిక హెల్త్ చెకప్ల సౌకర్యం కలదు.
- సంవత్సరానికి 5 సార్లు ఇన్సూరెన్స్ మొత్తం రీఛార్జ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- క్లిష్టమైన అనారోగ్య కవర్, వ్యక్తిగత ప్రమాద కవర్ మరియు స్వచ్ఛంద సహ-చెల్లింపు మొదలైన ఆప్షనల్ కవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
- 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ముందుగా చేరినందుకు ప్రయోజనాలు.
- ఈ ప్లానును టాప్ అప్ ప్లానుగా మార్చుకునే అవకాశం.
- వయో పరిమితి:- పెద్దలకి - 18 నుండి 65, పిల్లలు:- 5 నుండి 26.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 2 లక్షల నుండి 1 కోటి రూపాయలు.
- ఇన్సూరెన్స్ కవర్లోకి వచ్చే కుటుంబ సభ్యులు:- మీరు, మీ భార్య లేదా భర్త, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు, అత్తమామలు, సోదరీసోదరులు, మనుమలు, మనుమరాల్లు, అల్లుడు, కోడలు మొదలైనవారు.
-
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యే హాస్పిటల్ ఖర్చుల యొక్క కవరేజిని అందిస్తుంది. కేవలం వైద్యానికి అయ్యే ఖర్చుల యొక్క కవరేజిని అందించడమే కాకుండా ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం సంభవించినపుడు పరిహారం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ బేసిక్, వైడర్ మరియు కాంప్రహెన్సివ్ అనే మూడు కవర్ వేరియంట్‌లలో వస్తుంది.
ముఖ్య లక్షణాలు & ప్రయోజనాలు:-
- ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం (పాక్షిక/పూర్తిగా) సంభవించినట్లైతే, దానికి కవరేజీ అందుబాటులో ఉంటుంది.
- ఎడ్యుకేషనల్ ఫండ్, అంబులెన్స్ ఛార్జీలు మొదలైన అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
- ఈ ప్లాన్ ప్రపంచ వ్యాప్తంగా ఆక్సిడెంటల్ కవరేజీని కలిగి ఉంటుంది.
- వైద్య ఖర్చుల పొడిగింపు, ఆసుపత్రి నిర్బంధ భత్యం సమగ్ర వేరియంట్ క్రింద యాడ్-ఆన్ కవర్‌లుగా అందుబాటులో ఉన్నాయి.
- వయో పరిమితి:- పెద్దలు:- 18 నుండి 65 సంవత్సరాలు, పిల్లలు:- 5 నుండి 23 సంవత్సరాలు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 1 లక్ష నుండి 5 కోట్లు.
- ఇన్సూరెన్స్ కవర్లోకి వచ్చే కుటుంబ సభ్యులు:- మీరు, మీ భార్య లేదా భర్త, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు, అత్తమామలు.
-
ఈ ప్లాన్ అనారోగ్యం కారణంగా లేదా ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చేరడం వల్ల కలిగే ఖర్చుల యొక్క కవరేజీని అందిస్తుంది. ఈ ప్లానులో వ్యక్తులతో పాటు వారి కుటుంబాలకు కూడా అత్యవసర వైద్య పరిస్థితుల్లో కవరేజీని అందిస్తుంది.
ముఖ్య లక్షణాలు & ప్రయోజనాలు:-
- హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు ఈ ప్లానులో కవర్ చేయబడతాయి.
- క్లయిమ్ చేయబడని ప్రతి సంవత్సరానికి 5% క్యుములేటివ్ బోనస్ ఇవ్వబడుతుంది.
- డే కేర్ చికిత్స, ఆయుష్ చికిత్స, కేటరాక్ట్ చికిత్స అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ చేయబడతాయి.
- అన్ని రకాల క్లైములకు 5% కోపెమేంట్ వర్తిస్తుంది.
- వయో పరిమితి:- పెద్దలు - 18 నుండి 65 సంవత్సరాలు, పిల్లలు - 90 రోజుల నుండి 25 సంవత్సరాలు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 50 వేల నుండి 10 లక్షల రూపాయలు.
- ఇన్సూరెన్స్ కవర్లోకి వచ్చే కుటుంబ సభ్యులు:- మీరు, మీ భార్య లేదా భర్త, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు, అత్తమామలు.
-
కరోనా కవచ్ ప్లాన్ అనేది కస్టమైజ్డ్ కరోనా వైరస్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది కరోనా వైరస్ (COVID-19) చికిత్సకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తిగత అలాగే ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీగా అందుబాటులో ఉంటుంది.
ముఖ్య లక్షణాలు & ప్రయోజనాలు:-
- హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు ఈ ప్లానులో కవర్ చేయబడతాయి.
- హోం కేర్ చికిత్స, ఆయుష్ చికిత్స, అంబులెన్స్ ఛార్జీలకు అయ్యే ఖర్చులు అందిస్తుంది.
- యాడ్-ఆన్ కవర్ లాగా హాస్పిటల్ డైలీ క్యాష్ కవర్ అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్లాను 3.5, 6.5 మరియు 9.5 నెలల కాలవ్యవధుల్లో అందుబాటులో ఉంటుంది.
- వయో పరిమితి:- పెద్దలు - 18 నుండి 65 సంవత్సరాలు, పిల్లలు - 1 రోజు నుండి 25 సంవత్సరాలు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- రూ.50,000 నుండి 5 లక్షల వరకు.
- ఇన్సూరెన్స్ కవర్లోకి వచ్చే కుటుంబ సభ్యులు:- మీరు, మీ భార్య లేదా భర్త, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లితండ్రులు, అత్తమామలు.
ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేవి:-
- వివిధ రకాల అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరడం, కరోనాతో సహా.
- కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్ లు, ఇంట్లోనే వైద్యం చేయించుకోవడం, ప్రతిరోజూ హాస్పిటల్ బిల్లులు, మానసిక వ్యాధులు కూడా కవర్ చేయబడతాయి.
- క్లిష్టమైన అనారోగ్య కవర్, వ్యక్తిగత ప్రమాద కవర్ మరియు స్వచ్ఛంద సహ-చెల్లింపు మొదలైన ఆప్షనల్ కవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
- హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- హోం కేర్ చికిత్స, ఆయుష్ చికిత్స, అంబులెన్స్ ఛార్జీలకు అయ్యే ఖర్చులు
- వైద్య ఖర్చుల పొడిగింపు, ఆసుపత్రి నిర్బంధ భత్యం సమగ్ర వేరియంట్ క్రింద యాడ్-ఆన్ కవర్‌లుగా అందుబాటులో ఉన్నాయి.
- క్లైమ్ హిస్టరీతో సంబంధం లేకుండా వార్షిక హెల్త్ చెకప్ల సౌకర్యం.
- డే కేర్ చికిత్స, ఆయుష్ చికిత్స, కేటరాక్ట్ చికిత్స అయ్యే ఖర్చులు.
*ఇవన్నీ మనం తీసుకున్న ప్లాన్ మీద ఆధారపడి ఉంటాయి*.
ఇన్సూరెన్స్ పరిధిలోకి రానివి:-
మాగ్మా హెచ్‌డిఐ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు స్వతహాగా కలిగించుకున్న గాయాలు, ఆల్కహాల్ వ్యసనం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం, టీకా ఖర్చులు, నిరూపించబడని చికిత్సలు, స్టెరిలిటీ చికిత్సలు మరియు కాస్మెటిక్/ప్లాస్టిక్ సర్జరీల వల్ల వచ్చే వైద్య ఖర్చులను కవర్ చేయవు. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల పాలసీలను చూడటం ద్వారా ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని వాటి గురంచిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
క్లయిమ్ ఎలా చేయాలి, దానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు:-
క్లైమ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్ సైట్లో క్లైమ్ ఆప్షన్ ను ఎంచుకొని ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, క్లైమ్ నంబర్, UHID లేదా మెంబర్ ఐ డి, హాస్పిటల్లో చేరిన తేదీని ఎంటర్ చేయాలి.
మెంబర్ ఐ డి కార్డ్ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని హాస్పిటల్ కి వెళ్ళాలి. ఐ డి కార్డ్ లేదా పాలసీ పేపర్ల ద్వారా ఎలిజిబిలిటి వెరిఫికేషన్ చేస్తారు. ముందుగా హాస్పిటల్ నుండి ఇంటిమేషన్ లెటర్ పంపబడుతుంది. కన్ఫర్మ్ అయిందో లేదో లెటర్ వస్తుంది. చికిత్స మొదలు అవుతుంది. బిల్స్ జెనరేట్ అవుతాయి. బిల్లుల మీద, క్లైమ్ ఫామ్ మీద పేషంట్ సంతకం పెట్టడంతో ప్రాసెస్ పూర్తి అవుతుంది.
మాగ్మా హెచ్‌డిఐ హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం కోసం క్రింది సూచనలు పాటించండి:-
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీరు మీ పేరు, ఫోన్ నంబర్, లింగ సంబంధిత వివరాలు నమోదు చేయండి.
- హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత మంది కోసం తీసుకోవాలి అనుకుంటున్నారో పెద్దల నుండి పిల్లల దాకా వారి వయస్సును నమోదు చేయండి.
- మీరు నివసిస్తున్న నగరాన్ని లేదా పిన్ కోడ్ ను ఎంపిక చేయండి.
- మీరు ఎవరెవరి కోసం ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యం కానీ, కరోనా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నమోదు చేయండి.
- మీకు తగిన మాగ్మా హెచ్‌డిఐ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ప్లాన్ లేదా ప్రణాళికలను ఎంపిక చేసుకోండి.
- ఇంకా ఏమైనా కవర్లు కావాలంటే జోడించి ప్రీమియం మొత్తాన్నీ ఆన్లైన్లో చెల్లించండి.
- ఇన్సూరెన్స్ కంపెనీ 2 నిమిషాలలో పాలసీని జారీ చేస్తుంది.
మాగ్మా హెచ్‌డిఐ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవడం కోసం క్రింది సూచనలు పాటించండి:-
- మాగ్మా హెచ్‌డిఐ హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవడం చాలా సులభం.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- రెన్యువల్ ఆప్షన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఆప్షన్ ను ఎంచుకోండి.
- పాలసీ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి.
- పాలసీ వివరాలు సరిచూసుకుని, ఇంకా ఏమైనా కవర్లు కావాలంటే వాటిని కూడా జతచేసి రెన్యువల్ ప్రీమియంను చెల్లించండి.
- ఇన్సూరెన్స్ కంపెనీ మీ పాలసీని రెన్యూ చేస్తుంది.
కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటైల్స్:-
టోల్ ఫ్రీ నంబర్:- 1800 266 3202
ఈమెయిల్:- customercare@magma-hdi.co.in
సీనియర్ సిటిజన్స్ కోసం:- namaskar@magma-hdi.co.in
అడ్రస్:-
హెడ్ ఆఫీస్
ఎక్వినాక్స్ బిజినెస్ పార్క్, టవర్ 3, 2 ఫ్లోర్, యూనిట్ నంబర్ 1బి & 2బి, ఎల్ బి ఎస్ మార్గ్, కుర్ల (వెస్ట్), ముంబై - 400070, మహారాష్ట్ర.
రిజిస్టర్డ్ ఆఫీస్
డెవలప్మెంట్ హౌజ్,
24 పార్క్ స్ట్రీట్, కలకత్తా - 700016.