లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విభాగం.
Read More
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ - ఒక అవలోకనం:
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది US కు చెందిన లిబర్టీ మ్యుచువల్ ఇన్సూరెన్స్ గ్రూప్ DP జిందాల్ అండ్ ఎనమ్ సెక్యూరిటీస్ మధ్య జాయింట్ వెంచరుగా ఏర్పడింది. ఇది 2013 సంత్సరంలో ప్రారంభం అయింది. ప్రజలందరి ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటుగా కారు ఇన్సూరెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్, కమర్షియల్ ఇన్సూరెన్స్ మొదలయిన ఇన్సూరెన్స్ లు కూడా ఉన్నాయి.
వినియోగదారుల సౌకర్యార్థం 95 నగరాలలో, 110 ఆఫీసుల్లో, 1200 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 94% క్లైమ్ రేటుతో ముందుకు సాగుతోంది లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అంటే.. పెరుగుతున్న కాలుష్యం, రోజురోజుకు ఎక్కువ అవుతున్న రోడ్డు ప్రమాదాలు, ఉన్నవి సరిపోనట్టు వస్తున్న కొత్త కొత్త జబ్బులు, మారుతున్న ఆరోగ్య పరిస్థితులు. ఇన్ని మారినా మారని మనిషి జీవితం, అందులో ఖర్చులు. అలాంటి సమయంలో మనకి అనుకోకుండా జరిగే ప్రమాదాలు, ఊహించకుండా వచ్చే అనారోగ్యాలు వాటి ద్వారా కలిగే ఆర్థిక ఇబ్బందులు.
వీటన్నిటి నుండి మనం బయట పడాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. చేతిలో డబ్బు లేదని భయపడకుండా వైద్యం చేయించుకోవడానికి, ప్రాణాలు నిలబెట్టు కోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో ఉయోగపడుతుంది.
డబ్బు ఖర్చు అయితే తిరిగి సంపాదించు కోవచ్చు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకుని రాగలమా? అన్నిటికీ మూలం డబ్బు, కానీ అది అవసరం ఉన్న సమయంలో లేకపోతే ఏం లాభం. డబ్బు లేకున్నా వైద్యం చేయించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరికీ అందుబాటులో ఉండేలా ప్లానులని రూపొందించి, అందరి ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తమ వద్ద ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి, ఇన్సూరెన్స్ తీసుకోవడంలో గానీ, రెన్యువల్ చేసుకోవడంలో గానీ, క్లైమ్ చేసుకోవడంలో గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.
మీకు నచ్చిన లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోండి
హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు:
- హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ అని చెప్పలేం. ఎందుకంటే అనుకోకుండా అనారోగ్యం కలిగినప్పుడో, ప్రమాదాలు జరిగినప్పుడో ఉన్నట్టుండి ఆర్థిక ఇబ్బందులు వచ్చి మీద పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి తీరాల్సిందే.
- హాస్పిటల్లో చేరడానికి ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు అన్ని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
- అంబులెన్స్ ఛార్జీలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో భాగంగానే ఉంటాయి. రూమ్ రెంట్, కన్సల్టేషన్ ఫీజు, ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు, మందులకు అయ్యే ఖర్చులు ఇలా అన్ని రకాల ఖర్చులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అందువల్ల వాటి గురించి ఆలోచించి, భయపడవలసిన అవసరం లేదు.
- ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్యం చేయించుకోవడానికి అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి.
- ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకునే సదుపాయం కూడా ఇందులో కవర్ అవుతుంది. క్యాష్ లెస్ చికిత్స విధానం కూడా ఇందులో ఉంటుంది. డే కేర్ చికిత్స విధానం కూడా ఇందులో ఉంటుంది.
- క్లైమ్ చేసుకొని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ చేయబడుతుంది. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే, లేదా శాశ్వత వైకల్యం సంభవించినపుడు దానికి కూడా నష్ట పరిహారం అందుతుంది.
- కరోనా వైరస్ వంటి వ్యాధులకు చికిత్స కోసం అయ్యే ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి. కానీ అది తీసుకునే పాలసీని బట్టి ఉంటుంది.
- ఇంకా మనం ఎంచుకొని తీసుకొనే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానుని బట్టి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. అవి ఒక్కొక్క ప్లానులో ఒక్కో రకమైన ప్రయోజనాలు ఉంటాయి. మనకు కావలసిన వాటిని ఎంచుకొని తీసుకొనే అవకాశం మనకు ఉంటుంది.
- అందరికీ అందుబాటులో ఉండేలా ఎన్నో రకాల ప్లానులు మనకు లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలలో ఉంటాయి.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులు:
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రజల యొక్క వివిధ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులను అందుబాటులోకి తెచ్చింది. లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానుల గురించి తెలుసుకుందాం.
-
లిబర్టీ హెల్త్ కనెక్ట్ పాలసీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పాలసీ. దీనిని వ్యక్తుల కోసం మరియు కుటుంబాలకు కోసం తీసుకోవచ్చు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 2 నుండి 15 లక్షల వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 91 రోజుల నుండి.
- 55 సంత్సరాల లోపు వారికి ప్రి హెల్త్ చెకప్ అవసరం లేదు.
- పాలసీ సమయం:- 1 లేదా 2 సంవత్సరాలు.
- కో పేమెంట్ వర్తించదు.
లిబర్టీ హెల్త్ కనెక్ట్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- ఈ పాలసీలో 60 మరియు 90 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- రోజుకు రూ.500 నుండి రూ.1000 వరకు డైలీ క్యాష్ అలోవెన్స్ అందుబాటులో ఉంది.
- డే కేర్ చికిత్స విధానం, అంబులెన్స్ ఛార్జీలు, ఇంట్లో ఉండి వైద్యం చేయించుకునే సదుపాయం కూడా ఇందులో కవర్ చేయబడుతుంది.
- సుప్రీం ప్లానులో భాగంగా రికవరీ బెనిఫిట్, నర్సింగ్ అలోవెన్స్ కవర్ చేయబడతాయి.
- రెన్యువల్ చేసుకునే సమయంలో క్యాష్ లెస్ హెల్త్ చెకప్ చేయంచుకునే అవకాశం ఉంది.
-
లిబర్టీ హెల్త్ కనెక్ట్ సుప్రా పాలసీ అనేది ఇన్సూరెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తికి క్లైమ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఈ పాలసీలో క్లైమ్ చేసిన ప్రతిసారీ క్లైమ్ మొత్తం తగ్గుతూ ఉంటుంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా కవరేజీ, ఇన్సూరెన్స్ మొత్తం రీలోడ్ చేసుకోవడం మొదలైన అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
లిబర్టీ హెల్త్ కనెక్ట్ సుప్రా పాలసీనీ వ్యక్తుల కోసం మరియు కుటుంబాల కోసం తీసుకోవచ్చు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 3లక్షల నుండి 1 కోటి వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 91 రోజుల నుండి.
- 65 సంత్సరాల లోపు వారికి ప్రి హెల్త్ చెకప్ అవసరం లేదు.
- పాలసీ సమయం:- 1, 2 లేదా 3 సంత్సరాలు.
లిబర్టీ హెల్త్ కనెక్ట్ సుప్రా పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- రూమ్ రెంట్, ICU ఛార్జీలు, హాస్పిటల్ ఖర్చులు కవర్ చేయబడతాయి.
- ఈ పాలసీలో 60 మరియు 90 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- ఇందులో 405 డే కేర్ విధానాలు కవర్ చేయబడతాయి.
- ఈ పాలసీలో ప్రపంచ వ్యాప్తంగా కవరేజీ మరియు ఆయుష్ చికిత్సా విధానం కవర్ చేయబడతాయి.
- ప్రతి క్లైమ్ చేయని సంవత్సరానికి ఇన్సూరెన్స్ మొత్తం 10% లాయల్టీ పర్క్ కింద పెరుగుతూ ఉంటుంది.
-
లిబర్టీ సెక్యూర్ హెల్త్ కనెక్ట్ పాలసీ అనేది పూర్తి కుటుంబం కోసం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాను. ఇందులో కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కవర్ చేయబడతారు. ఈ పాలసీలో ఎన్నో ప్రయోజనాలతో పాటు ప్రీమియం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో కట్టుకునే సదుపాయం కూడా ఉంది.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 2 నుండి 15 లక్షల వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 91 రోజుల నుండి.
- 55 సంత్సరాల లోపు వారికి ప్రి హెల్త్ చెకప్ అవసరం లేదు.
- పాలసీ సమయం:- 1, 2 లేదా 3 సంత్సరాలు.
- 60 సంత్సరాల వయసు దాటినా లేదా ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలో లేని హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి అనుకున్నా 10% కో పేమెంట్ కట్టవలసి ఉంటుంది.
లిబర్టీ సెక్యూర్ హెల్త్ కనెక్ట్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- ఇందులో రోడ్డు అంబులెన్స్ ఛార్జీలు, పేషంట్ ట్రీట్మెంట్ ఖర్చులు కవర్ చేయబడతాయి.
- ఈ పాలసీలో 30 మరియు 45 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- ఇందులో 405 డే కేర్ విధానాలు కవర్ చేయబడతాయి.
- ఇందులో 10 రోజుల వరకు హాస్పిటల్లో డైలీ క్యాష్ ఆలోవెన్స్ అందుబాటులో ఉంటుంది.
- ఈ పాలసీలో 25% వరకు క్యుములేటివ్ బోనస్ అందుబాటులో ఉంటుంది.
- ప్రతి రెండు క్లైమ్ చేయబడని సంవత్సరాలకు ఒకసారి హెల్త్ చెకప్ సదుపాయం అందబాటులో ఉంటుంది.
-
లిబర్టీ ఇండివిజువల్ పర్సనల్ ఏక్సిడెంట్ ప్లాన్ అనేది ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాటికి అయ్యే హాస్పిటల్ ఖర్చులను కవర్ చేస్తుంది. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే లేదా ఏదైనా వైకల్యం సంభవించినపుడు దానికి నష్ట పరిహారం కూడా అందిస్తుంది. ప్రమాదాలు కారణంగా రాబడిని కోల్పోయినప్పుడు దానికి కూడా నష్ట పరిహారాన్ని అందిస్తుంది. లిబర్టీ ఇండివిజువల్ పర్సనల్ ఏక్సిడెంట్ ప్లాన్ వ్యక్తుల కోసం మరియు కుటుంబాల కోసం తీసుకోవచ్చు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 1 లక్ష నుండి 1 కోటి వరకు.
- వయో పరిమితి:- 18 సంత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 5 సంత్సరాలు నుండి.
- పాలసీ సమయం:- 1, 2 లేదా 3 సంవత్సరాలు.
లిబర్టీ ఇండివిజువల్ పర్సనల్ ఏక్సిడెంట్ ప్లాన్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- ఈ ప్లాన్ ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే లేదా ఏదైనా వైకల్యం సంభవించినపుడు దానికి నష్ట పరిహారం అందిస్తుంది.
- ఇందులో చైల్డ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్, దహన ఖర్చులు మొదలైన అదనపు కవర్లు ఉంటాయి.
- ఇందులో ప్రమాదాల వల్ల హాస్పిటల్లో చేరడం, అంబులెన్స్ ఛార్జీలు, హాస్పిటల్ డైలీ క్యాష్, లైఫ్ సపోర్ట్ బెనిఫిట్ మొదలైన ఆప్షనల్ కవర్లు కూడా ఉంటాయి.
- ఈ పాలసీలో 6 రకాల హెల్త్ ప్లానులు ఉంటాయి. అందులో నుండి ఎంపిక చేసుకొనే అవకాశం మనకు ఉంటుంది.
- పర్సనల్ ఏక్సిడెంట్ విషయాల్లో ప్రపంచ వ్యాప్తంగా కవరేజీ ఉంటుంది.
-
లిబర్టీ జనత పర్సనల్ ఏక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఇది ప్రత్యేకంగా గ్రామాలలో నివసించే వారికి పర్సనల్ ఏక్సిడెంట్ కవర్ అందించడానికి రూపొందించబడింది.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 5 సంత్సరాలు నుండి.
- పాలసీ సమయం:- 1 సంవత్సరం.
లిబర్టీ జనత పర్సనల్ ఏక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- ఈ ప్లాన్ ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే లేదా ఏదైనా వైకల్యం సంభవించినపుడు దానికి కవరేజీనీ అందిస్తుంది.
- ఇది ప్రపంచ వ్యాప్తంగా కవరేజీనీ కలిగి ఉంటుంది.
- ఇందులో పాలసీదారుడు అయిపోయిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
-
లిబర్టీ హస్పి - క్యాష్ కనెక్ట్ పాలసీ అనేది అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా హాస్పిటల్లో చేరినప్పుడు తలెత్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతంది. 30 రోజుల వరకు హాస్పిటల్లో డైలీ క్యాష్ కవర్ చేయబడుతుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న వారి అవసరాలకు అనుగుణంగా కవరేజిలో వెసులుబాటు ఉంటుంది.
- ప్లాను రకాలు:- శ్యూర్, శ్యూర్ ఆప్టిమ, శ్యూర్ అల్టిమా, శ్యూర్ సుప్రీం, శ్యూర్ ఎక్సెల్.
- ఈ ప్లాన్ వ్యక్తుల కోసం మరియు కుటుంబాల కోసం తీసుకోవచ్చు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 2 లక్షల నుండి 10 లక్షల వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 91 రోజుల నుండి.
- ముందుగా ఏదైనా అనారోగ్యం కారణంగా మెడికల్ హిస్టరీ ఉన్న వారికి మాత్రమే ప్రి హెల్త్ చెకప్ అవసరం ఉంటుంది.
- పాలసీ సమయం:- 1, 2 లేదా 3 సంవత్సరాలు.
లిబర్టీ హాస్పి - క్యాష్ కనెక్ట్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- హాస్పిటల్లో చేరినప్పుడు డైలీ క్యాష్ ఒకే మొత్తంలో అందించ బడుతుంది.
- ICU మరియు ఏక్సిడెంట్ బెనిఫిట్ రెండింతలు అందిస్తుంది.
- హాస్పి శ్యూర్ ఎక్సెల్ ప్లాన్ కింద ఇన్సూరెన్స్ మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది.
- ఇందులో 3 సంవత్సరాల కాల పరిమితి ఉన్న పాలసీలో మొదటి రెన్యువల్ తరువాత ముందుగానే ఉన్న అనారోగ్యాలు కవర్ చేయబడతాయి.
- ఫ్లెక్సీ ప్లానులో భాగంగా డే కేర్ చికిత్స విధానానికి క్యాష్ మరియు క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో రెండింతలు క్యాష్ ఆఫర్ చేస్తుంది.
-
లిబర్టీ క్రిటికల్ కనెక్ట్ పాలసీ అనేది క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ను కవర్ చేయడానికి రూపొందించింది. HIV/AIDS తో పాటుగా క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో వైద్యం చేయించు కోవడం కోసం ఒకే మొత్తంలో డబ్బును అందించడం ఇందులో కవర్ చేయబడుతుంది.
- ఈ ప్లాన్ వ్యక్తుల కోసం మరియు కుటుంబాల కోసం తీసుకోవచ్చు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 1 లక్ష నుండి 1 కోటి వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 5 సంత్సరాలు నుండి.
- పాలసీ సమయం:- 1, 2 లేదా 3 సంవత్సరాలు.
- కో పేమెంట్ వర్తించదు.
లిబర్టీ క్రిటికల్ కనెక్ట్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- ఇందులో 59 రకాల తీవ్ర అనారోగ్యాలకు నష్ట పరిహారం అందివ్వ బడుతుంది.
- తీసుకున్న ప్లాన్ రకాన్ని బట్టి రెండు, మూడు లేదా అనేక సార్లు క్లైమ్ కవరేజీ అందుబాటులో ఉంటుంది.
- ఇందులో సెకండ్ ఒపీనియన్ మరియు టెలి కన్సల్టేషన్ కవర్ చేయబడతాయి.
- ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి క్యాష్ లెస్ మెడికల్ చెకప్ అందుబాటులో ఉంటుంది.
-
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ అనేది స్టాండర్డ్ పాలసీ. ఇది ఎన్నో రకాల హాస్పిటల్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ పాలసీ హాస్పిటల్ ఖర్చులతో పాటుగా కీమో థెరపీ, స్టెమ్ సెల్ ఆధునిక చికిత్స థెరపీ మొదలైన ఆధునిక చికిత్సలను కవర్ చేస్తుంది.
- ఈ ప్లాన్ వ్యక్తుల కోసం మరియు కుటుంబాల కోసం తీసుకోవచ్చు.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 1 లక్ష నుండి 5 లక్షల వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 91 రోజుల నుండి.
- 45 సంత్సరాల లోపు వారికి ప్రి హెల్త్ చెకప్ అవసరం లేదు.
- పాలసీ సమయం:- 1 సంవత్సరం.
- అన్ని క్లైమ్ కొరకు 5% వరకు కో పేమెంట్ వర్తిస్తుంది.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ : ఆరోగ్య సంజీవని పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- ఇందులో రోడ్డు అంబులెన్స్ ఛార్జీలు, హాస్పిటల్ ఖర్చులు, డే కేర్ చికిత్స విధానం ఖర్చులు కవర్ చేయబడతాయి.
- ఈ పాలసీలో 30 మరియు 60 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- ఇందులో ఆయుష్ చికిత్స విధానం మరియు 12 రకాల ఆధునిక చికిత్సలు కవర్ చేయబడతాయి.
- ఈ ప్లాన్ లో ఇన్సూరెన్స్ మొత్తంలో 40,000 లేదా 25% వరకు కేటరాక్ట్ చికిత్స కవర్ చేయబడుతుంది.
- క్లైమ్ చేయని ప్రతి సంవత్సరానికి క్యుములేటివ్ బోనస్ వస్తుంది.
-
లిబర్టీ హెల్త్ ప్రైమ్ కనెక్ట్ పాలసీ అనేది వివిధ రకాల మెడికల్ మరియు హాస్పిటల్ ఖర్చుల నుండి కవరేజీనీ అందించే సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. జంతువులు కరచినప్పుడు వాక్సినేషన్, లేసర్ ఐ సర్జరీ వంటివి ఇందులో కవర్ చేయబడతాయి.
మెటర్నిటీ ఖర్చులు, ఊబకాయానికి ట్రీట్మెంట్, సంతానం కోసం ట్రీట్మెంట్ మొదలైనవి కూడా ఇందులో కవర్ చేయబడతాయి.
- ప్లానుల్లో రకాలు:- ఎసెన్షియల్, ఆప్టిమం, ఆప్టిమం ప్లస్.
- కవరేజ్ టైప్:- ఇండివిజువల్ / ఫ్లోటర్.
- ఇన్సూరెన్స్ మొత్తం:- 10 లక్షల నుండి 1 కోటి వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు, చిన్న పిల్లలకి 91 రోజుల నుండి.
- పాలసీ సమయం:- 1లేదా 2 సంవత్సరాలు.
- కో పేమెంట్ వర్తించదు.
లిబర్టీ హెల్త్ ప్రైమ్ కనెక్ట్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- ఈ పాలసీలో హాస్పిటల్లో అయ్యే ఖర్చులు, ఇంట్లో ఉండి వైద్యం చేయించుకుంటే అయ్యే ఖర్చులు, అవయవదాన ఖర్చులు మొదలైనవి కవర్ చేయబడతాయి.
- ఈ పాలసీలో 90 మరియు 120 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- లేసర్ ఐ సర్జరీ, సెకండ్ ఒపీనియన్, జంతువులు కరచినప్పుడు వాక్సినేషన్ వంటివి కవర్ చేయబడతాయి.
- రోజుకు 4,000 రూపాయల వరకు హాస్పిటల్ డైలీ క్యాష్ అందుబాటులో ఉంటుంది.
- ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఫ్రీ హెల్త్ చెకప్ చేయబడుతుంది.
- మెటర్నిటీ ఖర్చులు, ఊబకాయానికి ట్రీట్మెంట్ మొదలైనవి ఇందులో కవర్ చేయబడతాయి.
-
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ లోని కరోనా కవచ్ పాలసీ అనేది covid-19 వల్ల అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఇందులో హాస్పిటల్లో అయ్యే ఖర్చులు, ఇంట్లో ఉండి వైద్యం చేయించుకోవడం కోసం అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి. అలాగే మాస్కులు, ఆక్సిజన్, PPE కిట్ మొదలైన వాటికి అయ్యే ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
- కవరేజ్ టైప్:- ఇండివిజువల్ / ఫ్లోటర్.
- ఇన్సూరెన్స్ మొత్తం:- రూ.50,000 నుండి 5 లక్షల వరకు.
- పాలసీ సమయం:- 3.5, 6.5 మరియు 9.5 నెలలు.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్: కరోనా కవచ్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:-
- కరోనా వైరసు కోసం అయ్యే హాస్పిటల్ ఖర్చులు, ఇంట్లో ఉండి వైద్యం చేయించుకోవడం వల్ల అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- ఈ పాలసీలో 15 రోజులు మరియు 30 రోజుల వరకు హాస్పిటల్లో చేరక ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
- కరోనా వైరస్ వ్యాధి తగ్గించు కోవడానికి తీసుకొనే ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
- హాస్పిటల్ డైలీ క్యాష్ కూడా కవర్ లో ఉంటుంది.
-
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ లోని కరోనా రక్షక్ పాలసీ అనేది covid-19 వల్ల అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. కరోనా నిర్ధారణ అయిన తర్వాత ఒకే మొత్తంలో డబ్బు అందించ బడుతుంది. ఈ పాలసీ హాస్పిటల్లో చేరిన 72 గంటల తర్వాత పని చేయడం మొదలు పెడుతుంది.
- ఇది వ్యక్తిగతంగా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
- ఇన్సూరెన్స్ మొత్తం:- రూ.50,000 నుండి 2.5 లక్షల వరకు.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు.
- పాలసీ సమయం:- 3.5, 6.5 మరియు 9.5 నెలలు.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్: కరోనా రక్షక్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:
- కరోనా వైరస్ వల్ల అయ్యే హాస్పిటల్ ఖర్చులను ఒకేసారి కవర్ చేస్తుంది.
- కరోనా వైరస్ ఉందని నిర్ధారించబడితే ఒకే మొత్తంలో డబ్బు అందించ బడుతుంది.
- హాస్పిటల్లో చేరిన 72 గంటల తర్వాత పని చేయడం మొదలు పెడుతుంది.
-
లిబర్టీ సెక్యూర్ ఫ్యూచర్ కనెక్ట్ పాలసీ వివిధ రకాల మెడికల్, హాస్పిటల్ ఖర్చులను కవర్ చేస్తుంది. పాలసీ సమయంలో 25 రకాల తీవ్ర అనారోగ్యాలను కవర్ చేస్తుంది. ఇందులో పర్సనల్ ఏక్సిడెంట్ కవర్ కూడా ఉంటుంది.
- ఇది వ్యక్తిగతంగా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు.
- పాలసీ సమయం:- 1, 2 లేదా 3 సంవత్సరాలు.
లిబర్టీ సెక్యూర్ ఫ్యూచర్ కనెక్ట్ పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:
- 25 రకాల తీవ్ర అనారోగ్యాలకు చికిత్స కోసం ఒకే మొత్తంలో డబ్బు అందించ బడుతుంది.
- ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా ఏదైనా వైకల్యం సంభవించినపుడు నష్ట పరిహారం అందిస్తుంది.
- ఉద్యోగం కోల్పోయినప్పుడు ఒకసారి నష్ట పరిహారం అందిస్తుంది.
-
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ లోని సరల్ సురక్ష బీమా పాలసీ అనేది పర్సనల్ ఏక్సిడెంట్ పాలసీ. ఇందులో ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే లేదా ఏదైనా వైకల్యం సంభవించినపుడు నష్ట పరిహారం అందిస్తుంది.
ఏక్సిడెంట్ అయినప్పుడు అయ్యే హాస్పిటల్ ఖర్చులు, ఎడ్యుకేషన్ గ్రాంట్ మొదలైనవి కవర్ చేయ బడతాయి.
- ఇది వ్యక్తిగతంగా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
- వయో పరిమితి:- 18 సంవత్సరాలు మొదలు.
- పాలసీ సమయం:- 1 సంవత్సరం.
- కో పేమెంట్ వర్తించదు.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్: సరల్ సురక్ష బీమా పాలసీ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు:
- ఈ పాలసీ ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే నష్ట పరిహారం అందిస్తుంది.
- శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యాలు ఇందులో కవర్ చేయబడతాయి.
- ప్రమాదాలు జరిగినప్పుడు హాస్పిటల్ ఖర్చులు, ఎడ్యుకేషన్ గ్రాంట్ మొదలైనవి కవర్ చేయ బడతాయి.
- క్లైమ్ చేసుకొని ప్రతి సంవత్సరానికి 5% క్యుములేటివ్ బోనస్ వస్తుంది.
ఏమి కవర్ చేయబడింది?
- రూమ్ రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, ట్రీట్మెంట్ ఖర్చులు.
- ICU బెడ్ చార్జీలు, రూమ్ రెంట్.
- సర్జికల్ ఫీజు, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, బ్లడ్, ఆక్సిజన్, అనస్తేషియ, ఫిజికల్ థెరపీలు.
- మందులకు అయ్యే ఖర్చులు.
- లాబొరేటరీ ఛార్జీలు, ఎక్స్ రే, డయాగ్నొస్టిక్ టెస్టుల ఛార్జీలు.
- హాస్పిటల్లో చేరడానికి ముందు చేరిన తర్వాత అయ్యే ఖర్చులు.
- డే కేర్ చికిత్స విధానం.
- క్యాష్ లెస్ చికిత్స కోసం లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని హాస్పిటల్లలో అడ్మిట్ అవ్వాలి.
- డైలీ పేమెంట్.
ఇవన్నీ ఇంకా వీటితో పాటు అనేక కవరేజీలు మీరు తీసుకునే ప్లాను మీద ఆధారపడి ఉంటాయి.
ఇన్సూరెన్స్ పరిధిలోకి రానివి:-
- దంతాలకు చేయించుకునే వైద్యం, సర్జరీలకి అయ్యే ఖర్చులు కవర్ చేయబడవు.
- OPD ట్రీట్మెంట్ కవర్ చేయబడదు.
- కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ కవర్ చేయబడవు.
- స్వతహాగా చేసుకునే గాయాలు, ఆత్మహత్య ప్రయత్నాలు ఇందులో కవర్ చేయబడవు.
- మానసిక వ్యాధులు, ఒత్తిడికి సంబంధించినవి కవర్ చేయబడవు.
- HIV AIDS వంటి వ్యాధులు కవర్ చేయబడవు.
- సాహస క్రీడలు వంటి వాటిలో పాల్గొన్నప్పుడు అయ్యే గాయాలు కూడా కవర్ చేయబడవు.
- లైంగిక సంబంధిత వ్యాధులు కూడా కవర్ చేయబడవు.
ఇంకా మీరు తీసుకునే ప్లానును బట్టి ఇంకా ఏమి కవర్ అవుతాయో ఏమి కవర్ అవ్వవో తెలుసుకోవచ్చు.
క్లయిమ్ ఎలా చేయాలి, దానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు:-
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో రెండు విధాలుగా క్లైమ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి క్యాష్ లెస్ క్లైమ్, రెండవది రీయింబర్స్మెంట్ క్లైమ్.
*క్యాష్ లెస్ క్లైమ్:- క్యాష్ లెస్ క్లైమ్ పొందడానికి ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారాన్ని అందించాలి. తరువాత లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలోని హాస్పిటల్లో చేరాలి. క్యాష్ లెస్ క్లైమ్ కొరకు సంబంధించిన ఫామును నింపాలి. నింపిన ఫామును లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చేరేవేసే TPA కు సబ్మిట్ చేయాలి.
అన్ని వివరాలను సరి చూసిన తరవాత లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ కి అధికారిక లెటర్ ను పంపిస్తుంది. అప్పుడు హాస్పిటల్లో వైద్యం అందించ బడుతుంది.
హాస్పిటల్ నుండి కోలుకొని బయటకు వెళ్ళే సమయంలో లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానులో కవర్ చేయబడని సేవల యొక్క మొత్తాన్ని కట్టవలసి ఉంటుంది. హాస్పిటల్ బిల్లులను సరిచూసుకుని సంతకాలు పెట్టాలి. డిశ్చార్జ్ సమ్మరి, టెస్టుల యొక్క రిపోర్టులు, అన్ని డాక్యుమెంట్లు యొక్క కాపీలు మొదలైన వాటిని తీసుకోవాలి. ఇంకా ఏమైనా లావాదేవీలు ఉంటే వాటిని లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ తో సెటిల్ చేసుకుంటుంది.
రీయింబర్స్మెంట్ క్లైమ్:-
హాస్పిటల్ లో చేరిన 7 రోజుల లోపు లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ కాల్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించాలి. లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలో లేని హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి. కోలుకొని డిశ్చార్జ్ అయ్యే సమయంలో అన్ని డాక్యుమెంట్లను హాస్పిటల్ నుండి తీసుకోవాలి.
హాస్పిటల్ బిల్లులతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. మీరు తీసుకున్న ప్లాన్ యొక్క కవరేజీనీ బట్టి అన్ని డాక్యుమెంట్లను లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సరిచూసుకుంటుంది.
అన్ని వివరాలు సరిగ్గా ఉన్నట్లైతే లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 7 రోజుల లోపు మీ క్లైమ్ మొత్తాన్ని మీకు అందేలా చేస్తుంది.
రీయింబర్స్మెంట్ క్లైమ్ కొరకు అవసరమయ్యే డాక్యుమెంట్లు:-
- సంతకం చేసిన రీయింబర్స్మెంట్ క్లైమ్ ఫామ్.
- పాలసీ డాక్యుమెంట్ లేదా ఐ డి కార్డ్.
- డాక్టరు కన్సల్టేషన్ మందుల చీటీ.
- టెస్టులకు సంబంధించిన బిల్లులు మరియు రిపోర్టులు.
- రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సందర్భంలో అయితే పోలీసు FIR కాపీ.
- ఒరిజినల్ హాస్పిటల్ బిల్లులు, రిసీప్ట్ లు, రిసీప్ట్ నంబరుతో పాటు.
- హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నంబరు, పాన్ నంబరు.
- డాక్టరు యొక్క క్వాలిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ నంబరు.
ఇవన్నీ రీయింబర్స్మెంట్ క్లైమ్ కోసం అవసరం అయ్యే డాక్యుమెంట్లు.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎలా కొనుగోలు చేయాలి?
- లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పొందడం కోసం ముందుగా అధికారిక వెబ్ సైటును సందర్శించాలి.
- అందులో హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- మీ పేరు, వయసు, మొబైల్ నంబర్, నగరం మొదలైన వాటిని ఫాంలో నింపాలి.
- ఇంతకు ముందు ఏమైనా అనారోగ్యాలు కానీ ఉండి ఉంటే వాటిని నమోదు చేయాలి.
- మీకు కావలసిన, మీ ఆరోగ్యానికి సరిపడే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానును లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానుల నుండి ఎంచుకోవాలి.
- ఇంకా ఏమైనా కవర్లు అందంగా కావాలంటే అవి కూడా ఎంచుకోవాలి.
- మీరు ఎంచుకున్న ప్రీమియం మొత్తం ఎంత ఉందో దానిని ఆన్లైన్లో చెల్లించవచ్చు.
- ప్రీమియం మొత్తం చెల్లించిన కొద్ది నిమిషాల లోనే మీ లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేయబడుతుంది.
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవడం కోసం క్రింది సూచనలు పాటించండి:
ఆన్లైన్లో లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీనీ రెన్యువల్ చేసుకోవడానికి ఈ కింది పద్ధతులను పాటించాలి.
- ముందుగా అధికారిక వెబ్ సైటును సందర్శించాలి.
- రెన్యు యువర్ పాలసీ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- తర్వాత అందులో హెల్త్ రెన్యువల్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- పాలసీ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబరును నమోదు చేయాలి.
- రెన్యు చేసుకోవాలి అనుకునే లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలను సరి చూసుకోవాలి.
- అదనంగా జోడించాలి అనుకున్నా లేదా తీసెయ్యాలి అనుకున్నా ఏమైనా కవర్లు ఉంటే చూసుకోవాలి.
- రెన్యువల్ చేసుకునే ప్రీమియం మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాలి.
- కొన్ని నిమిషాలలోనే మీ పాలసీ రెన్యువల్ చేయబడుతుంది.
కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటైల్స్:-
టోల్ ఫ్రీ నంబర్ - 1800-266-5844
బోర్డ్ లైన్ - 022 6700 1313
ఫ్యాక్స్ - 022 6700 1606
ఈమెయిల్ - care@libertyinsurance.in
సీనియర్ సిటిజన్స్ కోసం - seniorcitizen@libertyinsurance.in
అడ్రస్-
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్,
10 వ ఫ్లోర్, టవర్ -A, పెనిసుల బిజినెస్ పార్క్, గణపత్ రావ్ కడం మార్గ్, లోయర్ పరెల్, ముంబై 400013.