కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా
మీ జీవిత కాలంలో ఆరోగ్యాన్ని కొనుగోలు చేయడమా అనేది మీరు తీసుకొనే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. ఇది ఏదయినా వైద్యపరమైన అత్యవసర
Read More
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా ఒవెర్వ్యూ
ఈ కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా తో విడి విడిగా బీమా చేయాలి అనుకుంటే, మీరు 4 పెద్దల్ని యాడ్ చేసుకోవచ్చు మరియు 4 పిల్లల్ని కలిపి తీసుకోవచ్చు.
మీరు ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ని ఎంచుకుంటే, మీరు ఒకే ప్రీమియం క్రింద 2 పెద్దలు మరియు 3 పిల్లలకు కలిపి బీమా చేయవచ్చు.
అంతేకాకుండా ఈ పాలసీ లో చెల్లించిన ప్రీమియం కు పన్ను మినహాయింపు కూడా వుంది.
మరియు ఈ పాలసీ ద్వారా ప్రాధమిక ప్రయోజనాలతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వివరంగా పరిశీలిద్దాం.
వ్యక్తిగతం గా మరియు కుటుంబ ఫ్లోటర్ ఆధారం గా ఈ పాలసీ నీ మీరు పొందవచ్చు. ఇక్కడ ఈ పాలసీ లో మీరు గరిష్టంగా 8 మంది వ్యక్తులను, 4 పెద్దలు మరియు 4 పిల్లలను జోడించి ఈ పాలసీ పొందవచ్చు ( మీరు మీ కుటుంబ సభ్యులకు విడి విడిగా బీమా చేయించాలి అనుకుంటే).
మీకు నచ్చిన కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా కవరేజీని ఎంచుకోండి
కోటక్ మహీంద్రా ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా యొక్క ప్రయోజనాలు మరియు ఫీచర్లు
కోటక్ మహీంద్రా ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా లో ఈ క్రింద ఇవ్వబడిన ప్రయోజనాలు మరియు ఫీచర్లు ఉంటాయి
- కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా సమగ్ర కవరేజ్ తో వస్తుంది.
- ఇన్ పేషెంట్ మరియు OPD కవరేజ్ తో వస్తుంది
- కోటక్ మహీంద్రా ఆన్ లైన్ లో బీమాను ఎంచుకోడం ద్వారా తక్షణ పాలసీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది.
- కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేసే సమయం లో తక్కువ పేపర్ వర్క్
- 24×7 బీమా సమయం
- వేగవంతమైన క్లెయిమ్ నమోదు
- NCB బోనస్, స్వచ్ఛంద/ నిర్బంధ మినహాయింపు మొదలైన డిస్కౌంట్లను పొందవచ్చు
- పాలసీని పోర్ట్ చేసుకోవచ్చు
- నెట్ వర్క్ ఆసుపత్రులలో భారత దేశం మొత్తం లో నగదు రహిత ఆసుపత్రి ప్రయోజనం ఉంటుంది
- కుటుంబం మొత్తానికి ఒకే ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీ కవరేజ్ ని విస్తారించవచ్చు
- ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియం అన్నింటికీ పన్ను ప్రయోజనాలను పొందండి
అనేక రకాల కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా
ప్రజల వివిధ అవసరాలను తీర్చడానికి అనేక రకాల ఆరోగ్య బీమా ఉత్పత్తులను కోటక్ మహీంద్రా బీమా అందజేస్తుంది. మీ యొక్క అవసరాలను బట్టి ఈ బీమా ప్లాన్ ను వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ఆధారంగా పొందవచ్చు. వివరంగా పరిశీలిద్దాం.
-
జీవనశైలి వ్యాధులు ప్రస్తుత రోజుల్లో పెరుగుతూనే వున్నాయి. ఒక వ్యక్తికి వున్నా క్లిష్టమయిన అనార్యోగం ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని కాకుండా వారి ఆర్థిక పరిస్థితులని కూడా ప్రతికూలంగా ప్రబావితం చేస్తుంది. మీ కోసం మీరు చేసిన చికిత్స ఖర్చుల కోసం మిమ్మల్ని కవర్ చేసే చిత్రంలోకి ఇక్కడ కోటక్ సెక్యూర్ షీల్డ్ వొచ్చేసింది. నియమ నిబంధనల ప్రకారం ఒక పెద్ద మొత్తం అమౌంట్ ని వ్యాధిని గుర్తించిన సమయం లో ఇవ్వబడుతుంది. పాలసీ లో ఇచ్చిన మొత్తం ని చిక్తిస ఖర్చుల కోసము లేదా బకాయిలు చెల్లించడం కోసం ఉపయోగించవచ్చు.
గుండెపోటు, కాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల గురించి చాల అరుదుగా వినబడే రోజులు పోయాయి. అటువంటి అనారోగ్యాలకు ఆసుపత్రిలో చేరడం మరియి వాటికీ చికిత్సలు చేయించడం కోసం అయ్యే ఖర్చులు ఆర్థిక పొదుపులో బారి నష్టాన్ని కలుగజేస్తున్నాయి కాబట్టి, అటువంటి ఊహించని ఖర్చులకు వ్యతిరేకంగా ఎలా రక్షణ కల్పిస్తారు మరియు ఆరోగ్య సంరక్షణ నాణ్యతలో రాజి లేదని నిర్దారించుకోవడం ఎలా ? కోటక్ సెక్యూర్ షీల్డ్ అనేది మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి రక్షించడానికి మరియు ఆర్థిక పరిపుష్టిని అందించడానికి దీన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించడానికి ఒక ప్రయోజనకరమైన ఉత్పత్తి. మీరు తీవ్రమైన అనార్యోగం, వ్యక్తిగత ప్రమాద మరియు / లేదా ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోవడాన్ని ఎంచుకోవచ్చు.
-
ఏదయినా హెల్త్ ఎమర్జెన్సీ / అత్యవసర ఆరోగ్య పరిస్థితులలో బారి మెడికల్ బిల్స్ ను చెల్లించకుండా ఉండేందుకు ఈ పాలసీ ద్వారా మీరు హామీ ని ఇవ్వవచ్చు. ఇప్పుడు కోటక్ మహీంద్రా ఆరోగ్య రక్షణ ప్లాన్ తో తక్షణ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ మరియు వేగవంతమైన రికవరీ ని అందించవచ్చు.
-
ప్రమాదవశాత్తు గాయం, వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడానికి మరియు ఈ పాలసీ మిమ్మల్ని కవర్ చేయడానికి రూపొందించబడింది. ఒక పెద్ద మొత్తం ని వివిధ రకాల అంగవైకల్యం కోసం చెల్లించడమే కాకుండా ఆసుపత్రి లో చేరడం కోసం అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
-
ప్రాధమిక బీమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీరు కవర్ చేయబడినప్పుడు, మీరు అధిక మొత్తం బీమాను కోటక్ ఆరోగ్య సూపర్ టాప్ అప్ ద్వారా నిర్దారించుకోవచ్చు. కోటక్ మహీంద్రా అందించే ఇతర ఆరోగ్య బీమా ప్లాన్లతో పోలిస్తే ఈ కోటక్ ఆరోగ్య సూపర్ టాప్ అప్ పాలసీ ని తక్కువ ప్రీమియం తో పొందవచ్చు.
-
ఇది ఒక సమగ్ర ఆరోగ్య బీమ పాలసీ, మీరు అంతటా ఫిట్ గా ఉండేందుకు రివార్డులు మరియు విలువ ఆధారిత ప్రయోజనాలతో పూర్తి రక్షణను అందిస్తుంది
వైద్య ద్రవ్యోల్బణం కారణంగా ఇటీవలి కాలంలో ఆరోగ్య సంరోక్షణ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఫలితంగా, ఏదయినా ప్రణాళిక లేని ఆసుపత్రిలో చేరడం వల్ల మీ జేబులో రంద్రం ఏర్పడి మీ ఆర్థిక ప్రణాళికలను నిర్వీర్యం చేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, కోటక్ మహీంద్రా జెనెరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కోటక్ హెల్త్ ప్రీమియర్ అనే సమగ్ర ఆరోగ్య బీమా ఉత్పత్తిని రూపొందించింది. ఇది సంప్రదింపుల రుసుములు, వైద్య పరీక్షలు, అంబులెన్సు చార్జీలు మరియు ఆసుపత్రి ఖర్చులకు సంబందించిన ఖర్చులను మాత్రమే కాకుండా, సాధారణ నివారణ మరియు ఫిట్ నెస్ అలవాట్ల ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు రివార్డ్ లను కూడా అందిస్తుంది . ఇది సంప్రదింపుల రుసుములు, వైద్య పరీక్షలు, అంబులెన్సు చార్జీలు మరియు ఆసుపత్రిలో అయ్యే ఖర్చులకు సంబందించిన ఖర్చులను మాత్రమే కాకుండా, సాధారణ నివారణ మరియు
ఫిట్ నెస్ అలవాట్ల ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు రివార్డ్ లను కూడా అందిస్తుంది.
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా లో గల చేరికలు కవరేజ్
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా ప్రత్యేక బీమా శ్రేణి ప్లాన్స్ తో కవరేజ్ ఇస్తుంది. అందులో ఈ క్రింద ఇవ్వబనవి వున్నాయి
- ప్రమాదం మరియు అనారోగ్యాల కారణంగా అత్యవసర మరియు ప్రణాళికాబద్ధమైన ఆసుపత్రి ఖర్చులు
- ఆసుపత్రి లో చేరడానికి ముందు మరియు ఆసుపత్రి లో చేరిన తర్వాతా అయ్యే ఖర్చుల కవరేజ్
- అంబులెన్సు కవరేజ్
- వార్షిక ఆరోగ్య తనిఖీ ఖర్చుల కవరేజ్
- ప్రాధమిక కవరేజ్ అయిపోయిన సందర్భంలో బీమా చేసిన పాలసీ మొత్తాన్ని స్వయంచాలికంగా పునరుద్ధరించడం
- డే కేర్ / రోజు సంరక్షణ చికిత్స
- రెండొవ E - అభిప్రాయం
- వైకల్యం లేదా మరణానికి దారి తీసే వ్యక్తిగత ప్రమాద కవరేజ్
- ప్రత్యామ్నాయ చికిత్సలు
- అవయవ దాత కవరేజ్
- రోజు వారి నగదు భత్యం
- కోటక్ ఎడ్జ్ బెనిఫిట్/ ప్రయోజనాలు
- ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియం లు పన్ను ప్రయోజనాలకు అర్హులు
- ప్రసూతి కవర్ ( ప్రణాళికల ఆధారంగా)
- సమగ్ర క్రిటికల్ అనార్యోగం కవరేజ్ ( ప్రణాళికల ఆధారంగా)
కోటక్ మహీంద్రా హెల్త్ బీమా లో మినహాయింపులు
కోటక్ మహీంద్రా హెల్త్ బీమా తో కవరేజ్ చేయబడనివి
- 4 నాలుగు సంవత్సరాల నిరంతర పునరుద్ధరణ తర్వాత మాత్రమే ముందుగా వున్న అనారోగ్యాలు కవరేజ్ ఇవ్వబడుతుంది
- ప్రమాదవశాత్తు క్లెయిమ్ మినహా , బీమా చేసిన వ్యక్తిని క్లెయిమ్ చేయడానికి కనీసం 90 తొంబై రోజుల నిరీక్షణ వ్యవధి ఉంటుంది
- యుద్ధం , యుద్ధ వాతావరణం , విదేశీ దండ యాత్ర, అంతర్యుద్ధం, సైనిక చర్య మొదలైన వాటి నుండి ఉత్పన్న మయ్యే క్లెయిమ్ లేదా దావా
- మద్యం, డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలతో డ్రైవింగ్ / వాహనం నడుపుతున్నప్పుడు జరిగిన ప్రమాదం
- లైంగికంగా సంక్రమించే వ్యాధి , AIDS ఎయిడ్స్ లేదా HIV చికిత్స కోసం క్లెయిమ్
- ఆర్మీ, వైమానిక దళం మరియు నేవి దళం ఆపరేషన్ లో పని చేస్తున్నపుడు జరిగిన గాయం
- తీవ్రవాద చర్య
- పూర్తిగా మినహాయింపులా జాబితా తెలుసుకోవడం కోసం దయచేసి పాలసీ పత్రాన్ని చూడండి.
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా క్లెయిమ్
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా తో అతుకులు లేని క్లెయిమ్ సెటిల్మెంట్ ను నిర్దారించుకోడానికి, మీరు ఈ క్రింది క్లెయిమ్ దశలను అనుసరించారని నిర్దారించుకోండి.
సాధారణంగా, కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా ను నగదు రహిత మరియు రీయంబర్స్మెంట్ క్లెయిమ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు
నగదు రహిత క్లెయిమ్
నగదు రహిత క్లెయిమ్ అంటే మీరు ఒక్క రూపాయి డబ్బు చెల్లించకుండానే నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవలను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని నెట్వర్క్ లో వున్న ఆసుపత్రి లో మాత్రమే పొందాలి.
- ఇది ప్రణాళికాబద్ధమైన ఆసుపత్రి లో చేరడం అయితే ఆసుపత్రి లో చేరిన 48 గంటల ముందు బీమా సంస్థ నుండి అనుమతి కోసం ముందస్తు అనుమతిని పూరించండి ఇది ఒకవేళ వెంటనే ఆసుపత్రి లో చేరాల్సిన పరిస్థితి అయితే, ఆసుపత్రిలోని హెల్ప్ డెస్క్ ను సంప్రదించడం ద్వారా ఆసుపత్రి లో చేరిన తర్వాత 24 గంటల లోపు ఫ్రీ ఆర్థరైజషన్ ఫారం ను పూరించండి
- మీ అభ్యర్థన ఆమోదించబడితే, కోటక్ మహీంద్రా జెనెరల్ ఇన్సురంచె యొక్క ఏదయినా అధీకృత ఆసుపత్రుల నుండి చికిత్సను పొందండి. సదుపాయాన్ని పొందడానికి కోటక్ మహింద్ర పాలసీ సర్టిఫికెట్ ను ఉపయోగించండి
- TPA ద్వారా పత్రాలను సమర్పించిన తర్వాత ఆసుపత్రి లో చేరేందుకు ఖర్చులు నేరుగా ఆసుపత్రి అధికారం తో పరిష్కరించబడతాయి
రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ప్రక్రియ
బీమా చేయించుకున్న వ్యక్తి నెట్ వర్క్ పరిధిలో వున్న ఆసుపత్రి లో కాకుండా వేరే ఆసుపత్రిలో నుండి చికిత్స పొందినప్పుడు, అతను/ ఆమె ఆసుపత్రి ఖర్చును చెల్లించాలి మరియు దాని కోసం తర్వాత క్లెయిమ్ వేయాలి. దీనిని రీయంబర్స్మెంట్ క్లెయిమ్ అంటారు.
రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి ఈ కింది దశలు ఉంటాయి
- ఆసుపత్రిలో చేరిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 -266 4545 కు కాల్ చేయడం ద్వారా బీమా సంస్థకు తెలియజేయాలి
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయం లో నేరుగా ఆసుపత్రి లోనే మెడికల్ బిల్స్ ను సెటిల్ చేస్కోండి. అవసరమైన అన్ని పత్రాలు ముఖ్యంగా అసలైన బిల్లులను సేకరించడం మర్చిపోవద్దు
- క్లెయిమ్ ను సమర్పించడానికి గరిష్ట విండో, డిశ్చార్జ్ తేదీ నుండి 30 ముప్పై రోజులలోపు ఉంటుంది. అన్ని సంబంధిత పాత్రలతో పాటు క్లెయిమ్ ఫారం ను సమర్పించండి. క్లెయిమ్ దాని అన్ని అవసరాలకు అనుగుణంగా ఉంటే, బీమా సంస్థ మొత్తాన్నిసెటిల్ చేస్తుంది.
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా ను క్లెయిమ్ చేస్కోడానికి కావాల్సిన పత్రాలు
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా ను క్లెయిమ్ పూరించేటప్పుడు మీరు ఈ క్రింది పత్రాలను అందించవలసి ఉంటుంది .
- సంతకం చేసిన మరియు సక్రమంగా నింపిన క్లెయిమ్ ఫారం
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ సర్టిఫికెట్
- సంబంధిత అధికారి చేత స్టాంప్ వేయబడి మరియు సంతకం చేయబడిన ఆసుపత్రి బిల్లులు
- మందుల బిల్లులు
- ఒకవేళ ప్రమాదం జరిగితే పోలీస్ వారి FIR పత్రాలు
- బీమా సంస్థ యొక్క నిబంధనల ప్రకారం ఇతర సంబంధిత పత్రాలు
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయుట
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయుట చాల తేలికైన ప్రక్రియ. మీరు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ మోడ్ ద్వారా ఈ బీమాను పొందవచ్చు. ఆన్ లైన్ లో అందుబాటులో వున్న వివిధ బీమా ప్లాన్ లను చూసి వాటిని పోల్చుకున్న తర్వాత, కోటక్ మహీంద్రా బీమా పాలసీ మీకు సరిపోతుంది అని అనిపిస్తే, మీరు కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఈ క్రింద ఇవ్వబడిన ఎంపికలను అనుసరించవచ్చు .
- "గెట్ కోట్" అనే ఆప్షన్ కు వెళ్ళండి
- మీ అవసరాలు మరియు మీ యొక్క వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి
- మీకు నచ్చిన బీమా ప్లాన్ ను ఎంచుకోండి
- ప్రీమియం ను లెక్కించండి మరియు బీమాదారు ఆమోదించిన అనేక రకాల చెల్లింపు పద్దతులను ఉపయోగించి ఆన్ లైన్ లో బీమా ను చెల్లించండి
- ఒకవేళ మీరు ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం వొద్దు అనుకుంటే, మీరు ఏజెంట్ ను సంప్రదించి కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా యొక్క ప్లాన్ ల వివరాలను తెలుసుకోవచ్చు అతను /ఆమె ద్వారా ఫార్మాలిటీస్ ను పూర్తి చేసి, చెక్ ద్వారా ప్రీమియం ను చెల్లించండి.
- అంతేకాకుండా మీరు నేరుగా ఏదయినా బీమా సంస్థ కార్యాలయాన్ని సందర్శించి మీకు నచ్చిన బీమా ప్లాన్ ను కొనుగోలు చేయొచ్చు.
కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా రెన్యువల్
మీ కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా ను సకాలంలో పునరుద్దరించకుండా, మీరు పాలసీ ప్రయోజనాలను నిరంతరం పొందలేరు. ఇంటర్నెట్ అందుబాటులోకి వొచ్చిన తర్వాత, చాల మంది ఆరోగ్య బీమా సంస్థలు తమ ఉత్పత్తులను ఆన్ లైన్ లోకి సులభంగా అందుబాటులోకి తెచ్చుకుంటారు, ఈ పునరుద్ధరణతో ఆరోగ్య బీమా మరింత సౌకర్యవంతంగా మారింది. పాలసీ నీ పునరుద్దరించేప్పుడు మీరు ఇప్పటికే వున్న బీమా సంస్థతో ఉండొచ్చు లేదా మరొక దానికి మారొచ్చు. కాబట్టి, మీరు ప్రస్తుతం వున్న మీ బీమా సంస్థతో సంతృప్తి చెందకపోతే మరియు కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా కు మారాలి అనుకుంటే, ఇది మీకు ఒక సరైన అవకాశం . మీ పాలసీ ని పోర్ట్ చేయడంలో ఉత్తమమైన భాగం ఏమిటంటే, మీరు మీ యొక్క వెయిటింగ్ పీరియడ్ ను మళ్ళి మళ్ళి తిరిగి అందించాల్సిన పని లేదు. IRDA మార్గదర్శకాల ప్రకారం పోర్టబిలిటీ సౌకర్యాన్ని అందించడానికి అన్ని బీమా సంస్థలకు అధికారం ఉంటుంది.
ఆన్ లైన్లో ఆరోగ్య బీమా రెన్యువల్ అనేది మీ పాలసీ పునరుద్ధరించడానికి అత్యంత అనుకూలమైన మరియు వేగవంతమైన ప్రక్రియ. ఈ రోజుల్లో కోటక్ మహీంద్రా జెనెరల్ ఇన్సూరెన్స్ తో పాలసీ పునరుద్ధరణ చేయటం కేవలం 4 నాలుగు సాధారణ దశలలో నిర్దారించబడుతుంది. అవి:
- బీమా సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి మరియు 'పునరుద్ధరణ' అనే ఆప్షన్ ఎంపిక ద్వారా నావిగేట్ చేయండి
- మీ పాలసీ కి అవసరమైన అన్ని వివరాలను అందించండి. పోర్ట్ విషయంలో, మీ మునుపటి బీమా దారు యొక్క వివరాలని మరియు మీ యొక్క ఇతర అవసరం అయిన వివరాలను అందించండి.
- ఆరోగ్య బీమా కాలిక్యులేటర్ ని ఉపయోగించి ప్రీమియంను లెక్కించండి మరియు డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి మీరు ఎంచుకున్న ప్రీమియం మొత్తం ని చెల్లించండి .
- మీ యొక్క విజయవంతంగా చెల్లించిన తర్వాత పాలసీకి చెందిన డిజిటల్ సంతకం చేసిన
- కాపీని మీరు పొందుతారు. మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మైయిల్ ఐడిని ఉపయోగించి ఎప్పుడైనా పాలసీ కాపీ ని ప్రింట్ తీసుకోవచ్చు.
- పాలసీ పునరుద్ధరణ చేసేటప్పుడు కోటక్ మహీంద్రా ఆరోగ్య బీమా పాలసీ కు సంబందించిన పునరుద్ధరణ సంబంధిత ఫార్మాలిటీలను పూర్తి చేయడాన్కి యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ అందజేయబడతాయి.
కోటక్ మహీంద్రా ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా పాలసీ కోసం సంప్రదించవలసిన మార్గాలు
కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
నమోదిత కార్యాలయం: 27 BKC, C 27, G బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (E), ముంబై - 400051. మహారాష్ట్ర, భారతదేశం.
టోల్ ఫ్రీ: 1800 266 4545
ఇమెయిల్: care@kotak.com.