మీ మెడిక్లెయిమ్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు తీసుకున్న ఇన్సురెన్స్ మొత్తానికి కోవిడ్-19(ఎన్సిఓవి) వైద్యానికి అయ్యే ఖర్చును కూడా భరిస్తుంది. అయితే ట్రీట్మెంట్ లో భాగంగా వినియోగించే పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లోవ్స్ లు, ఆక్సీమీటర్, వెంటిలేటర్ మొదలగు వస్తువుల ఖర్చులను మాత్రం కవర్ చెయ్యదు. ఇక ఐఆర్ డీఏఐ సూచనల మేరకు దాదాపు ఆన్ని జనరల్ మరియు హెల్త్ ఇన్సురెన్స్ లు కోవిడ్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తున్నాయి.
అయితే చాలా మటుకు కోవిడ్-19 పాలసీలు ఆసుపత్రిలో చేరక ముందు మరియు చేరిన తర్వాత కనీసం 24 గంటలు వరకూ అయ్యే అన్ని ఖర్చులను కవర్ చేస్తున్నాయి. ఇక ఇందులో కొన్ని పాలసీలు అయిన కరోనా రక్షక్, కరోనా కవచ్ వంటివి ఆయుష్ ట్రీట్మెంట్ మరియు హోం ట్రీట్మెంట్ లకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తున్నాయి. అయితే పూర్తి వివరాలకు పాలసీని క్షుణ్ణంగా చదవడం మంచిది.
ఇక ఒకవేళ గనుక మీరు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలో సభ్యులు అయితే కోవిడ్-19 ట్రీట్మెంట్ కొరకు ఎంత వరకు కవరేజ్ ఉందన్న విషయాలని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ గనుక సొంతంగా కోవిడ్-19 పాలసీని పొందాలి అనుకుంటే మీ ఇన్సురెన్స్ లో పాలసీ కవరేజ్, బెనిఫిట్, అవధులు మొదలగు అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక అన్ని మెడిక్లెయిమ్ పాలసీలు ముందు చెప్పినట్లుగా పీపీఈ కిట్లు తదితర వస్తువుల ఖర్చును తప్ప మిగిలిన కరోన వైరస్ ట్రీట్మెంట్ ను కవర్ చెయ్యగా, కేవలం కరోనా వైరస్ పాలసీ మాత్రం అన్ని ఖర్చులను భరిస్తుంది.
అలాగే మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం పెయిడ్ తీసుకోవడం వలన సెక్షన్ 80డి ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ ఆఫ్ ఇండియా, 1961 ప్రకారం ఆదాయ పన్ను రాయితీలను కూడా పొందవచ్చును.
మెడిక్లెయిమ్ పాలసీ విధానాలు మరియు ఉపయోగాలు:
ఏదైనా మెడిక్లెయిమ్ పాలసీని కొనే ముందు దాని యొక్క విధానాలు, ఉపయోగాలను తెలుసుకోవడం ఎంతో మంచిది. ఇక ఈ రోజుల్లో జీవితకాల రోగాలు పెరుగుతున్న సందర్భంలో హాస్పిటల్ ఖర్చులు, వైద్య పరమైన ఖర్చులు తట్టుకోవాలంటే ఆర్ధికపరమైన హామీని ఇచ్చే మెడిక్లెయిమ్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ పాలసీలు ఎన్నో రకాల ఇన్సురెన్స్ బెనిఫిట్ లను కూడా అందిస్తున్నాయి. అవి ఎలా అంటే :
- అందుబాటు ధర: సమర్ధవంతమైన ఆరోగ్యపరమైన సర్వీసులను అందుకోవడానికి మెడిక్లెయిమ్ పాలసీ అందుబాటు ధరలో లభ్యమవుతుంది.
- కాష్ లెస్ ట్రీట్మెంట్: ఏదైనా మెడికల్ ఎమర్జన్సీ వచ్చినప్పుడు మన జేబులో డబ్బు ఖర్చు కాకుండా ఆసుపత్రిలో చేరి వైద్యం పొందే అవకాశాన్ని కలిగిస్తుంది.
- ఆర్ధిక ఒత్తిడి తగ్గింపు: మెడిక్లెయిమ్ పాలసీ తీసుకోవడం వలన పాలసీ దారుడికి మరియు అతని కుటుంబ సభ్యులకు ఆర్ధిక పరమైన ఒత్తిడి తగ్గుతుంది అనడంలో సందేహం లేదు.
- వ్యక్తిగతంగా మరియు కుటుంబం మొత్తానికి కవరేజ్: ఈ మెడిక్లెయిమ్ పాలసీలు వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి తీసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
- ఆసుపత్రిలో చేరక ముందు, చేరిన తర్వాత ఖర్చు భరింపు: మెడిక్లెయిమ్ పాలసీలు ఆసుపత్రిలో చేరక ముందు మరియు చేరిన తర్వాత అయ్యే అన్ని ఖర్చులని భరిస్తాయి. ఇక 30-60 రోజులు, 60-120 రోజుల వరకు ఆసుపత్రి ఖర్చులను భరిస్తాయి. అలాగే అత్యవసర సహాయాలకు అయ్యే ఖర్చులను కూడా ఇవి కవర్ చేస్తాయి.
- డే కేర్ హాస్పిటలైజేషన్: ఏదైనా ట్రీట్మెంట్ కు సంబంధించి కనీసం 24 గంటలు హాస్పిటల్ లో ఉండాలన్న షరత్తుతో సంబంధం లేకుండా అందుకు అయ్యే ఖర్చును ఈ పాలసీ భరిస్తుంది.
- జీవిత కాల పునరుద్ధరణ: మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నభీమా ప్లానును అనుసరించి జీవితకాల పునరుద్ధరణ కవరేజి ఆప్షన్ ను కలిగి ఉంటుంది.
- అదనపు లాభాలు: ఐసియూ లకు అయ్యే ఖర్చు, ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్, వార్షికపు చెక్ అప్ ల ఖర్చులను కవర్ చేస్తుంది.
ఆదాయ పన్ను రాయితీలు: ప్రతీ సంవత్సరం ఆదాయ పన్ను రాయితీలను సెక్షన్ 80డీ అనుగుణంగా మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియుం ద్వారా పొందవచ్చు.
నిరాకరణ: *పాలసీ బజార్ బీమా సంస్థ అందించే ఏదైనా నిర్దిష్ట బీమాను, బీమా ప్రోడక్ట్ను ఆమోదించాడు, రేట్ చేయదు లేదా సిఫార్సు చేయదు.
దాదాపు అన్ని ఇన్సురెన్స్ కంపెనీలు వివిధ మెడిక్లెయిమ్ పాలసీలను అందిస్తున్నాయి.
మెడిక్లెయిమ్ పాలసీలలో రకాలు:
ఈ మెడిక్లెయిమ్ పాలసీలలో చాలా రకాలు ఉన్నాయి. ఇక మీ అవసరాలకు, మీ పెట్టుబడికి తగ్గట్టుగా ఉండేలా మనశ్శాంతిని అందిస్తూ చాలా మెడిక్లెయిమ్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అవి ఏమిటో ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం.
ఇండివిడ్యువల్ మెడిక్లెయిమ్ పాలసీ:
ఇది కేవలం పాలసీని తీసుకున్న వ్యక్తికి మాత్రమే కవరేజ్ అవుతుంది. ఇక పాలసీ పొందిన వ్యక్తి మాత్రమే తాను తీసుకున్న పాలసీ మొత్తానికి వైద్య సేవలను పొందగలడు. కాగా ఇండియాలో చాలా హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు ఈ వ్యక్తిగత పాలసీలను అందిస్తున్నాయి.
ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ:
ఈ పాలసీలో పాలసీదారుడికి మాత్రమే కాకుండా అతని ఇతర కుటుంబ సభ్యులైన తల్లితండ్రులు, భార్య/భర్త, పిల్లలకు కవరేజ్ అందుబాటులో ఉంటుంది.
సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీ:
సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ 60ఏళ్ళు పైబడిన వృద్ధుల కోసం ఏర్పాటు చెయ్యబడ్డాయి అలాగే తీసుకున్న ప్లాన్ మొత్తానికి అనుగుణంగా వారి హాస్పిటల్ ఖర్చులను ఈ పాలసీ భరిస్తుంది.
తీవ్ర అనారోగ్య మెడిక్లెయిమ్ పాలసీ:
ఈ పాలసీ జీవితాన్ని ఖరీదు చేసే భయంకరమైన రోగాలకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ కిడ్నీ సమస్య, క్యాన్సర్, కార్డియోవాస్కులర్ సమస్య మొదలగు భయంకర రోగాలకు అయ్యే హాస్పిటల్ ఖర్చును ఈ పాలసీ భరిస్తుంది.
Explore in Other Languages
మెడిక్లెయిమ్ పాలసీ మరియు హెల్త్ ఇన్సురెన్స్ ల మధ్య పోలికలు:
*అన్ని సేవింగ్స్ ఐఆర్‌డిఎఐ ఆమోదించిన బీమా పధకం ప్రకారం బీమా సంస్థచే అందించబడతాయి. ప్రామాణిక నిబందనలు & షరతులు వర్తిస్తాయి.
మెడిక్లెయిమ్ పాలసీని క్లెయిమ్ చేసుకునే విధానాలు:
మెడిక్లెయిమ్ పాలసీని రెండు విధాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అవి ఎలాగో ఇక్కడ పరిశీలిద్దాం.
క్యాష్ లెస్ ప్రొసీజర్:
- క్యాష్ లెస్ విధానంలో పేషెంట్ పాలసీ పరిధిలోని ఏదైనా హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు పైసా చేతి ఖర్చు లేకుండానే వైద్యాన్ని పొందవచ్చు. ఇక ఈ విధమైన ప్రొసీజర్ ను పొందడానికి కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
- దీనికోసం మొదట హాస్పిటల్ ఇన్సురెన్స్ డెస్క్ వద్ద నుండి ఫారమ్ ను తీసుకుని అందులో ప్రతీ చిన్న డీటెయిల్ ను తప్పులు లేకుండా రాయాలి. ఇలా చెయ్యడం వలన తర్వాత ఇన్సురెన్స్ కంపెనీ నుండి ఎటువంటి ఆలస్యం జరిగే అవకాశం ఉండదు. ఇక ఇలా వివరాలను పూర్తి చేసిన ఫారమ్ పై హాస్పటల్ మరియు డాక్టర్ యొక్క స్టాంపును వేసి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టిపిఏ) ద్వారా ఇన్సురెన్స్ కంపెనీకి ఫ్యాక్స్ చెయ్యల్సి ఉంటుంది. అప్పుడు సదరు ఇన్సురర్ ఆ ఫారమ్ ను క్షుణ్ణంగా పరిశీలించి వారు వైద్యం కొరకు ‘X’ మొత్తంను అందించగలరని హాస్పిటల్ కు తిరిగి ఫ్యాక్స్ చేస్తారు.
- దీనిని ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. ఒకవేళ వైద్యానికి ఖర్చు రూ.4 లక్షలు కాగా, ఇక ఇన్సురెన్స్ మరియు TPA వాళ్ళు తిరిగి అంచనా వేసి మరియు ఇప్పటికి తాము ౩ లక్షలు వరకు క్యాష్ లెస్ వైద్యాన్ని భరిస్తాం అని చెప్పారు అనుకుందాం. ఇక మొత్తం వైద్యం పూర్తయ్యి డిశ్చార్జ్ అయ్యే సమయానికి రూ.60 లక్షలు అయ్యింది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ పేషెంట్ రెండు విధానాలను పాటించాల్సి ఉంటుంది. మొదటిది హాస్పిటల్ వాళ్ళు ఇచిన బిల్లును తిరిగి ఇన్సురెన్స్ వాళ్ళకు సబ్మిట్ చేసి వాళ్ళు రెస్పాండ్ అయ్యేవరకు ఎదురు చూడడం. ఇది ఖచ్చితంగా లేటు అయ్యే ప్రాసెస్. ఇక రెండోది పాలసీదారుడు మిగిలిన ధనం అంటే రూ.40,000 తన సొంత డబ్బును చెల్లించి, తర్వాత అతను ఒరిజినల్ బిల్లులను రీయింబర్స్మెంట్ రూ. 40,000 లను పొందటానికి పాలసీ ప్రొవైడర్కు సబ్మిట్ చేస్తాడు
రియుంబర్స్మెంట్:
ఇక డబ్బు వాపసు పొందాలనుకునేవాళ్ళు హాస్పిటల్ లో చేరే ముందు గాని లేదా చేరే అవకాశం ఉందన్న విషయాన్ని ఇన్సురెన్స్ కంపెనీకి ఫోను చేసిగాని మెయిల్ ద్వారా గాని చెప్పాల్సి ఉంటుంది. ఇక రియంబర్స్ మెంటు కోసం హాస్పిటల్ యొక్క మొత్తం బిల్లులు, బయట కొన్న మందుల బిల్లులు అన్నింటిని ఇన్సురెన్స్ కంపెనీకి అందజేయాల్సి ఉంటుంది.
మెడిక్లెయిమ్ పాలసీ కవరేజి:
మెడిక్లెయిమ్ పాలసీలో ఒక్కొక్క పాలసీ ఒక్కో కవరేజీని కలిగి ఉంటుంది. అయితే సాధారణంగా అన్ని పాలసీలు దిగువ తెలిపిన అంశాలను కవర్ చేస్తాయి.
హాస్పిటల్ లో చేరిన తర్వాత ఓటీ చార్జులు, డయాగ్నొస్టిక్ ప్రొసీజర్, బ్లడ్, ఆక్సిజన్, మందులు, కీమోతెరపి, ఎక్స్ రే, రేడియోథెరపీ, డోనార్ ఎక్స్పెంసెస్, పేస్ మేకర్ వంటి ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
టెక్నికల్ గా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అయిన కేటరాక్ట్ ఆపరేషన్ వంటి వాటికి 24 గంటలు హాస్పిటల్లో చేరనవసరం లేకుండానే ఈ పాలసీ ద్వారా లబ్ది పొందవచ్చును.
- హాస్పిటల్ లో చేరే ముందు, చేరిన తర్వాత ఖర్చులు:
హాస్పిటల్ లో చేరక ముందు 30 రోజుల నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 60 రోజుల వరకు అంబులెన్స్ చార్జెస్ తో సహా ఈ పాలసీలో కవర్ చేయబడుతుంది.
రెగ్యులర్ వార్డులు, ఐసియూ ఖర్చులు అన్ని ఈ పాలసీ పరిధిలో గల హాస్పిటల్స్ లో క్యాష్ లెస్ పద్ధతిలో కవర్ చెయ్యబడతాయి.
డాక్టర్, సర్జెన్, నర్స్, అనస్తీషియన్ మొదలగు వారి ఫీజులు కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి.
మెడిక్లెయిమ్ పాలసీలో కవర్ చెయ్యబడని అంశాలు?
ప్రతీ మెడిక్లెయిమ్ పాలసీలో కొన్ని అవధులు ఉంటాయి. క్రింది పేర్కొన్న కొన్ని సందర్భాలలో ఈ పాలసీ వాటిని కవర్ చెయ్యదు. అవి ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.
ముందస్తుగా ఉన్న అనారోగ్యాలకు ఈ పాలసీ వర్తించబడదు.
- పాలసీ తీసుకున్న రోజు నుండి 30 రోజుల లోపు ఏదైనా తీవ్ర అనారోగ్యం గుర్తించబడినట్లయితే ఈ పాలసీ వారికి వర్తించబడదు. ఇక పూర్తి వివరాల కొరకు పాలసీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది.
- కొన్ని ప్రత్యేకమైన అనారోగ్యాలు ఈ పాలసీ ప్లాన్ లో కవర్ చెయ్యబడవు.
- దంతాలకు సంబంధించిన ఆపరేషన్లకు ఈ పాలసీ వర్తించదు. ఒకవేళ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే సందర్భంలో మాత్రమే ఈ పాలసీ కవర్ అయ్యే అవకాశం ఉంది.
- జనన నియంత్రణ మరియు హర్మోనల్ ట్రీట్మెంట్లకు ఈ పాలసీ వర్తింపబడదు.
- బిడ్డ పుట్టే సమయంలో వచ్చే సమస్యలు మరియు గర్భధారణ సమస్యలకు ఈ పాలసీ వర్తించదు.
మెడిక్లెయిమ్ పాలసీని తీసుకునే ముందు గుర్తించాల్సిన అంశాలు:
మీకు ఇప్పటి వరకు మెడిక్లెయిమ్ పాలసీ లేకుండా ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి అనుకుంటే క్రింద చర్చించే విషయాలను బాగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవి మీకు మార్కెట్ లో ఏది బెస్ట్ పాలసీయో గుర్తించడానికి ఉపయోగపడతాయి.
- ఇండివిడ్యుయల్మరియు ఫ్యామిలీ ఫ్లోటర్:
ఇక వ్యక్తిగత పాలసీలో ఒక వ్యక్తికి కొంత సొమ్ము వరకు భీమా చెయ్యబడి ఉంటుంది, అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ లో మాత్రం మొత్తం కుటుంబానికి కొంత సోమ్ము నిర్దేశించబడి ఉంటుంది. అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ లో ఒకవేళ పాలసీ చేసిన వ్యక్తి గనుక మరణించడం లేదా నిర్దేశించిన వయసుకు చేరుకోవడం జరిగితే ఈ పాలసీ ముగిసిపోతుంది. ఇక కుటుంబంలోని ఇతర వ్యక్తులు వయసులో ఉన్నవాళ్ళు అయినా సరే దీనిని రెనివల్ చేసే అవకాశం ఉండదు. అయితే వ్యక్తిగత పాలసీలో మాత్రం పాలసీదారుడు నిర్దేశిత వయసుకు వచ్చినా సరే ఇతర కుటుంబ సభ్యుల యొక్క ఇన్సురెన్స్ కవరేజ్ విషయంలో ఎటువంటి ప్రభావం ఉండదు.
మెడిక్లెయిమ్ పాలసీని ఎంచుకునే విధానంలో ఎంత సొమ్మును భీమా చేస్తారో నిర్ణయించుకునే విషయంలో చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు గనుక మహా నగరాల్లో నివసించే మాటైతే మీకుగాని, కుటుంబ సభ్యులకు గాని తీసుకునే పాలసీ అక్కడ హాస్పిటల్ ఖర్చులు ఇతర విషయాలను దృషిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా అధిక మొత్తంలో పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
చాలా వరకు మెడిక్లెయిమ్ పాలసీలు కో పేమెంట్ ఆప్షన్ నిబంధనతో పనిచేస్తాయి. దీని ప్రకారం పాలసీదారుడు వైద్యానికి అయిన ఖర్చులో కొంత శాతం తను పెట్టుకోవాల్సి వస్తుంది. మిగిలిన సొమ్మును పాలసీ కవర్ చేస్తుంది. సాధారణంగా ఇది 10% నుండి 30% వరకు ఇన్సురెన్స్ పాలసీని బట్టి ఆధారపడి ఉంటుంది.
మెడిక్లెయిమ్ పాలసీలో తీసుకున్న ప్లాన్ కు అనుగుణంగా కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. వాటిలో హెచ్ ఐవీ ఇన్ఫెక్షన్, డ్రగ్ లేదా ఆల్కహాల్ అడిక్షన్, ఆత్మహత్యా ప్రయత్నం, పుట్టుకతో వచ్చే వ్యాధులు మొదలగునవి ఈ పాలసీలో మినహాయింపుకు గురవుతాయి. అయితే గర్భాశయ శస్త్ర చికిత్స, కిడ్నీలో రాళ్ళు తొలగించడం, గాల్ బ్లాడర్ సర్జరీ మరియు మెటర్నేటీ మొదలగు వాటికి కొంత కాలం వెయిట్ చేసిన తర్వాత లబ్దిపొందే అవకాశం ఉంది.
మెడిక్లెయిమ్ పాలసీల వలన పొందే అతి పెద్ద ఉపయోగం ఏమిటంటే అత్యవసర సమయాల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను పొందడమే. అయితే ఈ పద్ధతిలో వైద్యం పొందాలంటే సదరు పాలసీ పరిధిలో ఉండే హాస్పిటల్స్ జాబితాను ముందే తెలుసుకోవలసి ఉంటుంది. లేదా మీ ఏరియాలోని ఏ హాస్పిటల్ కు ఏ పాలసీ అందుబాటులో ఉందో తెలుసుకుని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా పాలసీని తీసుకోవడం మంచిది. ఇక మీ పాలసీని ఆమోదించే నెట్ వర్క్ హాస్పిటల్ దగ్గరగా ఉండడం అంటే మీకు అత్యంత కీలకమైన సమయాలో ఎంతో మానసిక ధైర్యం పొందినట్లే కదా..
దాదాపు అన్ని పాలసీలు ఏడాది కాలం మాత్రమే కవరేజీని కలిగి ఉంటాయి. అయితే నిజానికి ఇది మీకు మీ ఇన్సురెన్స్ కంపెనీకి మధ్య ఉన్న రిలేషన్ పై ఆధారపడి ఉంటుంది. అయితే, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీ వయసును బట్టి మీకు పాలసీని కవర్ చెయ్యని పక్షంలో అటువంటి పాలసీని కొనడంలో మీకు మనశాంతి లభించదు అనడంలో సందేహం లేదు.
మెడిక్లెయిమ్ పాలసీ తీసుకునే సమయానికి పాలసీదారునికి ఏదైనా అనారోగ్యం ఉండి, అటుపై దాని ప్రమేయంతో వేరే అనారోగ్యం తలెత్తినా దానిని కూడా ఈ ప్లాన్ లో కవర్ చెయ్యబడుతుంది. ఉదాహరణకు పాలసీ తీసుకునే సమయానికి ఒక వ్యక్తి డయాబెటిక్ అయ్యి తర్వాత గుండె జబ్బును పొందితే, ఈ గుండె జబ్బును కూడా ముందస్తుగా ఉన్న అనరోగ్యంగానే ఇన్సురెన్స్ కంపెనీలు గుర్తిస్తాయి. అయితే అన్ని కంపెనీలు కూడా ఇన్ని సంవత్సరాలు పాలసీని రెనివల్ చేసినట్లయితేనే, ముందస్తు వ్యాధులను కవర్ చేస్తామనే నిబంధనను కలిగి ఉంటాయి. ఇక పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు మెడిక్లెయిమ్ పాలసీతీసుకోవాలనుకుంటున్నారా? అయితే మా సహాయాన్ని పొందండి:
మన దైనందిన బిజీ జీవితంలో భోజనం ఆర్డరు దగ్గర నుండి కాలేజి చదువులు వరకు అన్నీ ఆన్ లైన్ నే ఉపయోగిస్తున్నాము. మరి అలాంటప్పుడు ఒక మంచి మెడిక్లెయిమ్ పాలసీని ఆన్ లైన్ లో ఎందుకు తీసుకోకూడదు?ఇక పాలసీదారుడికి, ఇన్సురెన్స్ కంపెనీలకి మధ్య వారధిలా పనిచేసే పాలసీ బజార్ మీకు అందుబాటులో ఉండగా ఒక మంచి మెడిక్లెయిమ్ పాలసీని తీసుకోవడంలో మీకు ఎటువంటి కష్టం రాదు. అదేవిధంగా పేరు, వార్షికాదాయం, ఉద్యోగం వంటిసాధారణ డిటైల్స్ తో మీరు, మీకు సరిపడే మంచి పాలసీలను ఇక్కడ ఒక మౌస్ క్లిక్ తో సేకరించవచ్చు. ఇక పాలసీ వివరాలను సేకరించి పోల్చి చూసుకునే సమయంలో పైన చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మీకు తగినట్టి మంచి మెడిక్లెయిమ్ పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే మీరు మా మెడిక్లెయిమ్ ప్రీమియం కాలిక్యులేటర్ నుఉపయోగించి ఒక చక్కని, మంచి, మీకు తగినటువంటిమెడిక్లెయిమ్ పాలసీని పొందగలరు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు
-
జ: ఇది OT చార్జీలు, మందులు, ఆక్సిజెన్, రక్తం లేదా చికిత్సల కోసం అవసరమైన ఏదేని ఇతర పరిక్షలతో సహా ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది. ఇది డే-కేర్ చికిత్స, రోగ నిర్ధారణ పరిక్షలు, సాంకేతిక అబివృద్ధి చెందిన చికిత్సల ఖర్చులను కూడా బరిస్తుంది. ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు హాస్పిటల్లో చేరడానికి 30రోజుల ముందు మరియు డిశ్చార్జ్ అయ్యాక 60 రోజుల వరకూ ఖర్చులను కవర్ చేస్తుంది.
-
జ: IRDAI నిబందనల ప్రకారం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు కరోనా వైరస్ సంబందిత క్వారన్టైన్ అలాగే ఆసుపత్రి ఖర్చులను కవర్ చేయడం తప్పనిసరి చేశారు. కొంతమంది బీమా ప్రొవైడర్లు నిర్దిష్ట కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీను అందిస్తున్నాయి, మరియు మిగిలినవి బేసిక్ మెడిక్లెయిమ్ ప్లాన్స్ ను మాత్రమే అందిస్తున్నాయి. అయినప్పటికీ, కోవిడ్-19 ను కవర్ చేస్తే, ఇది మహామ్మరిగా ప్రకటించబడిన తర్వాత కూడా కవర్ చేస్తుందో మీ బీమా సంస్థతో చెక్ చేసుకోండి.
-
జ: మీ మెడిక్లెయిమ్ పాలసీ యొక్క ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి రెండు మార్గాలున్నాయి- రియింబర్స్మెంట్ క్లెయిమ్ మరియు కాష్ లెస్ క్లెయిమ్. రియింబర్స్మెంట్ పొందటానికి మీరు బీమా సంస్థకు లేదా టిపిఏ కు ఆసుపత్రిలో చేరడం గురించి తెలియచేయాలి. మెడికల్ రియింబర్స్మెంట్ ను క్లెయిమ్ చేయడానికి హాస్పిటల్ ఖర్చులతో పాటు అన్ని మెడికల్ బిల్లులను కూడా ఉంచాలి. కాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం, క్లెయిమ్ ఫారంలో మీరు అన్ని వివరాలు పూరించాలి మరియు అదే వివరాలను బీమా సంస్థకు కూడా సమర్పించాలి. మరియు బీమా సంస్థ మీ హాస్పిటల్ బిల్లులను నేరుగా హాస్పిటల్లో సెటిల్ చేస్తుంది(బీమా చేసిన మొత్తం వరకూ).
-
జ: మినహాయింపులు ఒక మెడిక్లెయిమ్ పాలసీ నుండి మరొక దానికి మరియు ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి మరొక దానికి మారుతూ ఉంటాయి. మెడిక్లెయిమ్ పాలసీలు చాలా వరకు ముందుగా ఉన్న వ్యాధులకు ఖర్చులను వెయిటింగ్ పీరియడ్ పూర్తి కాకుండా, ఆత్మ హత్యా ప్రయత్నాలు, సౌందర్య శస్త్ర చికిత్సలు, నేర ఉద్దేశం గల ఏదైనా క్రిమినల్ చర్యలు వంటి వాటికి ఖర్చులను భరించవు. మినహాయింపుల యొక్క వివరణాత్మక జాబితా కోసం మీరు పాలసీలో ఉన్న పాదాలను చెక్ చేయవచ్చు.
-
జ: మీరు సరైన మెడిక్లెయిమ్ పాలసీ ని సులభంగా ఎంచుకోవడానికి సమృద్ధిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. మా వెబ్ సైట్ నుండి టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఈజీ గా మెడిక్లెయిమ్ పాలసీలను పోల్చవచ్చు మరియు కొనుగోలు చేయవచ్చు. మైన కవరేజ్ ను సరైన ప్రీమియంలో పొందుటకు ప్లాన్స్ ఉన్నాయి. మీరు మీ కోసం మరియు మీ ఫ్యామిలీ కోసం సరైన మెడికల్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.
-
జ: వయస్సు ప్రమాణం అనేది సాధారణంగా ఒక బీమా సంస్థ నుండి మరొక దానికి మారుతుంది. ఇది సాధారణంగా 18 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు మరియు కొత్తగా పుట్టిన శిశువులకు కూడా 91 రోజుల నుండి కవర్ చేస్తారు. క్కొన్ని ప్లాన్స్ లైఫ్ టైమ్ రెన్యూవబుల్ సౌకర్యాలను అందిస్తాయి.
-
జ: మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే వెంటనే మీరు ఆసుపత్రిలో చేరడం గురించిన వివరాలతో పాటు మీ పాలసీ, హాస్పిటల్, తీసుకోబోతున్న చికిత్స వివరాలను టిపిఏ కు తెలియచేయడం, మీ పాలసీ నెంబర్, ఆసుపత్రి పేరు మరియు తీసుకున్న చికిత్స లాంటి వివరాలను క్లెయిమ్ ఫారంలో పూరించాలి. ఆ తరువాత, ఆసుపత్రిలో టిపిఏ విభాగంలో ఆ పత్రాలన్నింటిని సమర్పించాలి. బీమా సంస్థకు అన్ని పత్రాలు సమర్పించిన తరువాత దావా అప్పుడు ముందుకు తీసుకోబడుతుంది.
-
జ: యాక్సిడెంట్ లు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కింద కవర్ చేయబడతాయి. మీ ప్రాధమిక మెడిక్లెయిమ్ ప్లాన్ తో పాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కోసం మీరు యాడ్-ఆన్ కొనుగోలుచేయవచ్చు.
-
జ: నగదు రహిత మెడిక్లెయిమ్ పాలసీలో, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రి ఖర్చులను నేరుగా ఆసుపత్రిలోనే చెల్లిస్తుంది. బీమా చేసిన మొత్తం వరకూ మీరు ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు(తగ్గింపులు లేకపోతే).
-
జ: లేసర్ కంటి శస్త్ర చికిత్స సాధారణంగా చాలా మెడిక్లెయిమ్ పాలసీల పరిధిలో ఉండదు. అయితే, మీరు కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మీరు కొన్ని క్లెయిమ్ ప్రయోజనాలను పొందగలరు. దయచేసి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ను పాలసీ కొనే ముందే లేసర్ కంటి శస్త్ర చికిత్స కవర్ అవుతుందా అని లేదా పాలసీలో పదాలు అడిగి తెలుసుకోండి.
-
జ: యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ అయితే తప్ప దంత చికిత్సలు బేసిక్ హెల్త్ ప్లాన్స్ పరిధిలోకి రావు, కొన్ని బీమా సంస్థలు దంత చికిత్సను యాడ్-ఆన్ ప్రయోజనంగా కవర్ చేస్తాయి. డెంటల్ ట్రీట్మెంట్ కవర్(ఏదైనా ఉంటె) పొందలనుకుంటే మీరు ఎక్స్ట్రా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంది.
-
జ: గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది సాధారణంగా కంపెనీలు వారి ఉద్యోగులకు అందిస్తాయి మరియు కొన్ని సందర్భాలలో వారి కుటుంబ సభ్యులకు భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులతో సహా అందరికీ వర్తిస్తుంది. ప్రీమియం ఉద్యోగుల తరపున కంపెనీ చెల్లిస్తుంది మరియు బీమా చేసిన వ్యక్తి ఆసక్తికి అనుగుణంగా అదనపు ప్రీమియం చెల్లింపుపై అనుకులీకరించవచ్చు. కవరేజ్ పరిమితం; అందువల్ల, ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
-
జ: పేరు సూచించినట్లుగా, అంతర్జాతీయ లేదా విదేశీ మెడిక్లెయిమ్ విధానం అనేది ఒకరకమైన మెడికల్ ఇన్సూరెన్స్ అది విదేశాలకు ప్రయాణించేటప్పుడు వచ్చే అత్యవసర ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది.
-
జ: పేరు సూచించినట్లుగా, ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు బీమా సాధారణ మొత్తం మరియు సింగిల్ ప్రీమియం మొత్తం కింద కవర్ చేస్తుంది.
-
జ: మీ మెడిక్లెయిమ్ పాలసీని పోర్ట్ చేయడం చాలా సులభం. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్కు మీ ప్రస్తుత హెల్త్ ప్లాన్ గడువు ముగియడానికి 45 నుండి 60 రోజుల ముందు తెలియచేయవచ్చు. మీరు పోర్టబిలిటీ ఫారంను పూరించాల్సిన అవసరం ఉంది, దానికి మీరు మీ మునుపటి ఆరోగ్య బీమా వివరాలను అందించండి ఆపై పోర్టబిలిటీ కోసం దరఖాస్తు చేయండి.
-
జ: పాలసీ కొనుగోలుచేసిన మొదటి 30 లలో తలెత్తే అనారోగ్యాలకోసం చాలా బీమా సంస్థలు అంగీకరించవు. అయినప్పటికీ, పాలసీ కొనుగోలుచేసిన మొదటి 30 రోజులలో ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరే ఖర్చులను భరిస్తుంది.
-
జ: మెడిక్లెయిమ్ పాలసీ మరియు ఆరోగ్య బీమా పాలసీ మధ్య ప్రధాన వ్యత్యాసం క్రింద ఇవ్వబడింది: 1. మెడిక్లెయిమ్ ఆసుపత్రి ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది. కాగా ఆరోగ్య బీమా పాలసీ ప్రీ-పోస్ట్ హాస్పిటలైసేషన్ ఖర్చులు, యాక్సిడెంట్ కేసులు, ఆసుపత్రి ఖర్చులు, అంబులెన్సు చార్జీలు, డాక్టర్ ఫీజులు మొదలైనవి కవర్ చేయబడతాయి. 2. మెడిక్లెయిమ్ పాలసీ యాడ్-ఆన్ ప్రయోజనాలను అందించదు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ- క్లిష్టమైన అనారోగ్యాల కవర్, ప్రసూతి కవర్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మొదలైనవి ఆఫర్ చేస్తుంది.
-
జ: భారతదేశంలో అనేక రకాల మెడిక్లెయిమ్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి మరియు వాటి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి: 1. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ- ఈ ఫ్లోటర్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఒకే హామీ మొత్తం. 2. వ్యక్తిగత మెడిక్లెయిమ్- ఇది ప్రాధమికంగా బీమా చేసిన వ్యక్తికి ఉహించని ఆసుపత్రుల ఖర్చును పరిహారంగా ఇస్తుంది. 3. గ్రూప్ మెడిక్లెయిమ్- ఈ రకమైన పాలసీ కొంతమంది వ్యక్తుల సమూహానికి ఒకే ప్లాన్ కింద కవరెజీను ఇస్తుంది. చాలా కంపెనీలు ఈ గ్రూప్ లేదా ఎంప్లొయెర్ మెడిక్లెయిమ్ పాలసీని తమ ఉద్యోగుల కొరకు కొనుగోలు చేస్తారు.
Health insurance companies
View more insurers
Disclaimer: The list mentioned is according to the alphabetical order of the insurance companies. Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by any insurer. For complete list of insurers in India refer to the Insurance Regulatory and Development Authority of India website www.irdai.gov.in